Gunde Ninda Gudi Gantalu December 12th: శృతిపై సంజూ యాసిడ్ దాడి.. ఆదిశక్తిగా మారిన మీనా..
Gunde Ninda Gudi Gantalu December 12th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్లో శృతి మీనాకు ఫోన్ చేసి తనని కలవాలని, అర్జెంటుగా రెస్టారెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న శృతిని చూసి సంజీవ్ మనుషులు సంజీవ్ కి ఫోన్ చేసి చెబుతారు. శృతి ఒక్కతే ఒంటరిగా వెళుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీంతో శృతిని ఫాలో కమ్మని తాను కూడా వస్తున్నానంటూ చెబుతాడు.
మరోవైపు.. శృతిని కలవడానికి మీనా వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఈ విషయం బాలు కి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడని ఆలోచిస్తుంది. చెప్తే ఎలాగో పంపించడు కదా అని, చెప్పకుండానే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే.. పడుకున్న బాలుని పూలు చల్లి నిద్ర లేపుతుంది. ఆ తర్వాత టిఫిన్ తెచ్చి తన చేతులతో తినిపిస్తుంది. మొత్తానికి బాలుని బయటికి పంపించి తను కూడా శృతిని కలవడానికి వెళుతుంది.

రెస్టారెంట్లో శృతి మీనా మాట్లాడుకుంటారు. ఈ సమయంలో రవి పూర్తిగా మారిపోయాడని, తనని పట్టించుకోవడం లేదంటూ కంప్లైంట్ చేస్తుంది. దీంతో మీనా రియాక్ట్ అయి.. రవి కొడుతున్నాడా? లేదా తిడుతున్నాడా? నిన్ను ప్రేమగా చూసుకుంటూ లేడా? అని ప్రశ్నిస్తుంది. 'లేదు.. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ.. ఎప్పుడు మమ్మీ- డాడీ, అన్న- వదిన అంటూ తనని విసిగిస్తున్నాడని, ఇంటికి వెళ్దాం అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటూ కంప్లైంట్ చేస్తుంది.
'దీంతో మీనాకు కోపం వస్తుంది. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. కొత్త బంధం వస్తుందంటే.. పాత బంధాన్ని పెంచుకోవాలని కాదు. అనవసరంగా రవిని అనుమానించకు, ఎవరైనా కొత్త బంధాలు వచ్చినపుడు.. పాత బంధాలు తెంచుకుంటే వారికి నిజంగా ప్రేమ లేనట్టే.. ఈరోజు నువ్వు నచ్చి నీ దగ్గరికి వచ్చాడు. అదే ఈ బంధం నచ్చలేదు.. అనుకుంటే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించు. అనవసరంగా రవిని అనుమానించకుండా అర్థం చేసుకో.. అంటూ సలహా ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరోవైపు సంజు.. శృతిపై అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. మీ నా వెళ్ళిపోగానే శృతిపై దాడి చేయడానికి సిద్ధమవుతాడు. సంజీవ్ మనుషులు శృతిని పట్టుకుని ఉండగా.. యాసిడ్ బాటిల్ చూపించి భయపడతాడు. దీంతో శృతి హెల్ప్ అంటూ అరుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన మీనా వెంటనే పరిగెత్తి వస్తుంది. ఎలాగైనా శృతిని కాపాడాలని రాయితో యాసిడ్ బాటిల్ ను పగలగొడుతుంది. ఆ తర్వాత సంజీవ్ పై అతని మనసులపై రాళ్లతో దాడి చేస్తుంది. ఆ హోటల్ లో ఉన్న వాళ్ళు కూడా వారిపై దాడి చేయడంతో అక్కడి నుండి సంజు, అతని మనుషులు పారిపోతారు.
ఆ తర్వాత శృతి దగ్గరకెళ్ళి ఓదారుస్తుంది. ధైర్యం చెబుతుంది. అనవసరంగా టెన్షన్ పడొద్దు అని ఇంటికి తీసుకు వెళుతుంది. ఇంట్లో కూర్చుని పెట్టి కుటుంబం అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది? అనే విషయాలను చెబుతుంది. తన భర్త తనపై కోప్పడతాడు ఎంత కోప్పడుతాడో అంత ప్రేమగా చూసుకుంటాడు. తేడా వస్తే కొడతాడు కూడా.. కానీ ఏ రోజు కూడా అతన్ని విడిచి వెళ్లాలని అనుకోలేదు. అలాగే మాత్రం ఆమె గయ్యాలి, కానీ ఆమెను అర్థం చేసుకొని సర్దుకుపోతున్న . ఇక మామయ్య ఆయన తండ్రిలా చూసుకుంటాడు.
ఉమ్మడి కుటుంబంలో ఉంటే.. రక్షణ, ధైర్యం.. మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ గా ఉంటే అలాంటి నమ్మకాలు, ధైర్యం ఉండదని, ఇప్పటికైనా అందరితో కలిసి విధంగా ఆలోచించు.. రవిని అర్థం చేసుకో అని చెబుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో నాని ఆలోచిస్తూ ఉంటుంది. దాడి చేసిన సమయంలో ఆ వ్యక్తి అన్నమాట గుర్తు చేసుకుని.. అది ఖచ్చితంగా సంజీవని ఫిక్స్ అవుతుంది. మరోసారి కచ్చితంగా తనపై దాడి చేసే అవకాశం ఉందంటూ భయపడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా అయ్యింది.


Click it and Unblock the Notifications











