Gunde Ninda Gudi Gantalu December 13th: సురేంద్రకు క్లాస్ పీకిన మీనా.. స్టోన్ లేడీని అలా చూసి భయపడ్డ ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu December 13th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో శ్రుతికి మీనా ధైర్యం చెబుతుంది. అందరూ కలిసి ఉంటే.. బాగుంటుందని, ఇలాంటి దుష్ట శక్తులు దాడి చేయకుండా రక్షణ ఉంటుందని చెబుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలుంటుందని, ఒకసారి రవి చెప్పింది కూడా అర్థం చేసుకోమని మీనా సలహా ఇస్తుంది. తన ప్రాణాలు కాపాడిన మీ నాకు శృతి థాంక్స్ చెప్తుంది. నేనేమీ పరాయి దాని కాదు.. నీకు అక్క నవ్వుతాను. తోడికోడలను మనమంతా ఒకటే కుటుంబం ఈరోజు కాకుండా రేపైనా కలిసి ఉండాలి అంటూ ధైర్యం చెబుతుంది.

ఇందులో రవి ఇంటికి వస్తాడు. విషయం తెలుసుకున్న సంజూను ప్రాణాలతో వదిలిపెట్టననీ, వాడికి జీవితంలో మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయకుండా బుద్ధి చెప్తానని ఆవేశపడతాడు రవి. అనవసరంగా లేనిపోని ఆవేశాలు తెచ్చుకుని చిక్కుల్లో పడుద్దంటూ మీనా సలహా ఇస్తుంది. తన భార్యను కాపాడిన మీనాకు రవి థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత మీనా.. సురేంద్ర ఇంటికి వెళుతుంది. అప్పటికే సురేంద్ర, శోభ ఇద్దరూ తన కూతురు విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించిన మీనా అక్కడినుండి వెళ్ళిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial today episode 314 December 13th 2024 here is full story

మీనా వెళ్లిపోవడాన్ని గమనించిన శోభ.. అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావ్? అని నిలదీస్తోంది. నేను ఓ విషయం చెప్పాలని వచ్చాను. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే చెప్పినా.. ఏం ప్రయోజనం లేదని సమాధానం ఇస్తుంది. అసలు ఏం విషయం? ఎందుకు వచ్చావు? ఏం చెప్పాలనుకుంటున్నావ్? అని ఆరా తీస్తుంది శోభ. మీరు అనవసరంగా ఆవేశపడి మీ కూతురు జీవితాన్ని ఆగం చేయాలని భావించారు. ఓ ఉన్మాదికిచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఆ విషయం తెలుసుకున్న మీ కూతురు రవిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉందని చెబుతోంది.

కానీ, ఆ ఉన్మాది ఇప్పుడు మీ కూతురు జీవితాన్ని ఆగం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. తనపై యాసిడ్ దాడి చేశాడంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది. ఇప్పటికైనా మీ కూతురికి అండగా ఉండి, తన ప్రాణాలను కాపాడుకోండి అని సలహా ఇచ్చి వెళ్లిపోతోంది. అప్పటివరకు కూల్ గా ఉన్న సురేంద్ర ఒక్కసారిగా ఆవేశానికి లోనవుతాడు. ఇలాగైనా ఈరోజు నీలకంఠంతో మాట్లాడి.. ఈ విషయం తేల్చుకుంటానంటూ వెళ్తాడు. మరోవైపు.. బాలు.. మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.ఇంటికి రాగానే మీనా పై అరుస్తుంటాడు మళ్లీ ఏం పెంట చేశావని, ఇంతవరకు ఎటు వెళ్ళావ్? అంటూ కోప్పడతాడు.

తాను శృతిని కలవడానికి వెళ్లాలని చెబుతోంది. దీంతో బాలు మళ్లీ వారి దగ్గరికి ఎందుకు వెళ్లావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు విషయం చెప్పేంతవరకు కాస్త ఓపిక ఉండండనీ, వాస్తవానికి రవికి శృతికి మధ్య గొడవ జరిగిందని, ఆ విషయం మాట్లాడాలని శృతి తన ని రెస్టారెంట్ కి పిలిచిందని, ఆ సమయంలో ఓ వ్యక్తి ..శృతి పై యాసిడ్ తో దాడి చేయడానికి ప్రయత్నించాడని, ఆ విషయాన్ని గమనించి తాను వారిని ఎదురించాననీ, అసలు కథ మొత్తం చెబుతుంది. దీంతో బాలు షాక్ అవుతాడు.

ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందే అంటూ ఆశ్చర్యపోతాడు. ఇంతలోనే మీడియా ఇంటికి వస్తుంది. ఇంట్లో వారందరికీ.. మీనా చేసిన సహసం చేసిన వీడియో చూపించి.. షాక్ ఇస్తుంది. మెయిన్ గా ప్రభావతి తన కోడల్నీ చూసి భయపడుతోంది. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అవుతోంది. మీడియా ముందు మీనా మాట్లాడుతూ.. తనకు తన భర్త బాలు నుండి ధైర్యం వచ్చిందని, తాను అలా పోరాడడానికి, తన భర్తని కారణమంటూ చెబుతుంది. ఆయన ఎల్లప్పుడూ పందెంకోడిలా ప్రతి సమస్యను ఎదురిస్తాలంటూ బాలుని పొగడ్తలతో ముంచెత్తుతుంది.

ఆ తరువాత బాలు మాట్లాడుతూ.. నా భార్య చాలా మంచిది, కానీ తనకు ఇంత ధైర్యం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్తాడు
తన భార్యను ఇలా చూస్తే తనకు గర్వంగా ఉందని చెబుతాడు బాలు. దీంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. మీడియా వాళ్ళు మీనాను స్టోన్ లేడీ, ధైర్యవంతురాలు అంటూ పొగుడ్తారు. మీడియా వాళ్ళు తెచ్చిన ఇటుకను బాలు తీసుకొని ఇంట్లో పెడతాడు. తన తల్లికి, మనోజ్ కు చూపిస్తూ ఇన్ డైరెక్టర్గా వార్నింగ్ ఇస్తాడు బాలు. ఈ సమయంలో అమ్మాయి అంటే అనుకువగానే కాదు.. అవసరమైతే ఆదిశక్తుల పోరాడాలంటూ మీనాను పొగడ్తాడు సత్యం. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X