Gunde Ninda Gudi Gantalu August 10th: రోహిణి తల్లికి మీనా సాయం.. వాళ్లను విడగొట్టాలని ప్లాన్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీనా ఇంటికి బాలు వెళ్లిపోవడంతో ప్రభావతి కోపంగా ఉంటుంది. వెంటనే పార్వతమ్మకు కాల్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు మీనా తీసుకుని బాలును తన అమ్మ పిలవలేదని, ఆయనే ఉండిపోయాడని చెబుతుంది. అంతేకాదు, ఏమైనా అడగాలంటే బాలుకే కాల్ చేయమని చెబుతుంది. అనంతరం మీనా కోసం ఇంటి ముందు వేచి చూస్తున్న గజ.. డాబా మీదకు వెళ్లి చూస్తాడు. అక్కడ బాలు ఉండడంతో షాక్ అవుతాడు. వెంటనే అతడితో బాలు ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు పక్కన ఇళ్ల వాళ్లు కూడా వచ్చి గజకు వార్నింగ్ ఇవ్వడంతో వెళ్లిపోతాడు.

గజ వెళ్లిపోయిన వెంటనే బాలు అసలు ఎందుకు ఉన్నానో అత్తగారికి వివరిస్తాడు. దీంతో మీనా తన తల్లికి అతడి గురించి గొప్పగా చెబుతుంది. అనంతరం సత్యం తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తుంటే సత్యేంద్ర తన భార్యతో కలిసి వస్తాడు. అప్పుడు ఆయన తన కూతురితో రవి తిరుగుతున్నాడని సత్యేంద్ర, సత్యానికి చెప్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత సత్యం నేరుగా రవి దగ్గరకు వెళ్లి ఇకపై శృతిని కలవొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో రవి తనలో తాను కుమిలిపోతాడు. కానీ, తండ్రితో మాత్రం ఓకే అని చెబుతాడు.
బాలు తన అత్తగారి ఇంటికి వెళ్లి ఉండడంతో ప్రభావతి కోపంగా ఉంటుంది. తన భర్త సత్యంతో ఆమె ఈ విషయంపై మాట్లాడుతుంది. ఆషాడంలో భార్యభర్తలు కలిసి ఉండకూడదు అనే కదా వాళ్లను దూరంగా ఉంచింది. మరి వాడు వెళ్లి అక్కడ ఉండడం ఏంటి అని మాట్లాడుతుంది. అప్పుడే బాలు అక్కడకు వచ్చి తన తల్లికి పంచుల మీద పంచులు వేస్తాడు. అంతేకాదు, ఎక్కువగా మాట్లాడితే ఇంటి నుంచి వెళ్లిపోయి పర్మినెంట్‌గా తన అత్తగారి ఇంట్లోనే ఉండిపోతానని చెప్పేస్తాడు.
ఇక రాబోయే ఎపిసోడ్‌లో... బాలు, మీనా కారులో వెళ్తుండగా రోహిణి తల్లి రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసి ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తారు. అంతేకాదు, ఆమెతోనే ఉన్న చింటూను మీనా ఎత్తుకుని తమ ఇంటికి తీసుకు వస్తుంది. అప్పుడు ప్రభావతి ఆమెపై సీరియస్ అవుతుంది. అంతేకాదు, ఆ పిల్లాడి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో రోహిణి కోపంగా అరుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











