Gunde Ninda Gudi Gantalu August 12th: మీనాతో బాలు రీఎంట్రీ.. చీటీ చూడడంతో రచ్చ.. భర్తకు రోహిణి షాక్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీనా ఇంటికి బాలు వెళ్లిపోవడంతో ప్రభావతి కోపంగా ఉంటుంది. వెంటనే పార్వతమ్మకు కాల్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు మీనా ఏమైనా అడగాలంటే బాలుకే కాల్ చేయమని చెబుతుంది. అనంతరం మీనా కోసం ఇంటి ముందు వేచి చూస్తున్న గజ.. డాబా మీదకు వెళ్లి చూస్తాడు. అక్కడ బాలు ఉండడంతో షాక్ అవుతాడు. వెంటనే అతడితో బాలు ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు పక్కన ఇళ్ల వాళ్లు కూడా వచ్చి గజకు వార్నింగ్ ఇవ్వడంతో వెళ్లిపోతాడు. తర్వాత సత్యాన్ని కలిసి సురేంద్ర నిజం చెప్పడంతో ఇకపై శృతిని కలవొద్దని రవికి ఆర్డర్ ఇస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 12th

బాలును అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేయమని ఫోన్ చేయమని ప్రభావతి తన భర్త సత్యంతో చెప్తుంది. అంతలోనే అక్కడకు బాలు వచ్చి నేను వచ్చేశాను అని అంటాడు. అప్పుడు ప్రభావతి 'నీ పెళ్లాం నిన్ను బాగానే పంపించిందే' అని అంటుంది. దీంతో బాలు 'పంపించలేదు.. నాతో పాటు వచ్చింది' అని షాకిస్తాడు. అప్పుడు ప్రభావతి 'ఏంటే వాడు రమ్మంటే వచ్చేయడమేనా? మీ ఇంట్లో నిన్ను ఒక నెల కూడా పోషించే గతి లేదా' అంటూ నోటికొచ్చినట్లు తిడుతుంది. అప్పుడు ఆమెకు బాలు పంచ్‌లు వేస్తాడు. దీంతో సత్యం ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతాడు.

సత్యం అడగ్గానే బాలు 'ఆమె సమస్య కాదు.. నా సమస్య. అందుకే తీసుకు వచ్చాను. ఇక్కడ ఉంటే నేను ఆకలితో అలమటించిపోతున్నా. ఆ పార్లరమ్మ వంట చేయదు. ఈమె ఏమో ఉప్మాతో నన్ను చంపేయాలని చూసింది' అంటాడు. దీంతో ప్రభావతి 'ఒక్కరోజు వండలేదు. దానికే తీసుకు వచ్చేస్తావా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బాలు 'అమ్మలా మీనా వాళ్ల అమ్మ ఖాళీగా ఉండకుండా పని చేస్తుంది కదా. మీనా వాళ్ల చెల్లి, తమ్ముడు కాలేజ్‌కు వెళ్లిపోతారు. అప్పుడు మీనా ఒంటరిగా ఉండాలి. నేను ఆకలితో అలమటించాలి' అని చెప్పడంతో తండ్రి సపోర్ట్ చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 12th

లోపలికి వెళ్లిన తర్వాత మీనా 'సెలవు పెట్టి వెళ్లిన పనిమనిషిని ఇంటికి తీసుకు వచ్చినట్లు మళ్లీ తీసుకు వచ్చారు. ఇప్పుడు మీ అమ్మగారు చూశారా ఎలా తిడుతున్నారో' అంటూ ఫైర్ అవుతుంది. దీంతో 'నిన్ను ఆమె అందుకు అనట్లేదు. దానికి వేరే కారణం ఉంది' అంటాడు. దీనికి మీనా మురిసిపోతూ ఆ కారణం ఏంటో చెప్పమని అడుగుతుంది. ఆ తర్వాత 'గజ ఏమైనా చేస్తాడేమో అని తీసుకు వచ్చాను. మీ అమ్మ వాళ్లకు ఏమీ కాకుండా అక్కడి గూర్ఖాకు డబ్బులు ఇచ్చి చూడమని చెప్పాను' అంటాడు. దీంతో మీనా సంతోషిస్తుంది.

బాలు తన తండ్రితో కలిసి కూర్చుని ఉండగా సరుకులు తీసుకుని ఓ వ్యక్తి వస్తాడు. అప్పుడు వాటికి 30 వేలు బిల్ అవడంతో చూసి బాలు షాక్ అవుతాడు. అంతేకాదు, మనోజ్ వాళ్లను పిలిచి రచ్చ చేస్తాడు. దీంతో ప్రభావతి 'గొడవ చేయొద్దు. రోహిణి బాధపడుతుంది' అంటాడు. దీనికి సత్యం 'మోసేవాడికే బరువు తెలుస్తుంది. సర్లేరా ఇంక వచ్చేశాయి కదా. మళ్లీ రిటర్న్ ఇస్తే బాగోదేమో' అంటాడు. ప్రభావతి కూడా అదే మాట అనడంతో బాలు 'అయితే బిల్లు నువ్వైనా కట్టు. లేదంటే నీ కొడుకును కట్టమను' అంటూ రచ్చ రచ్చ చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 12th

ఆ తర్వాత బాలు 'ఇన్ని రోజుల నుంచి మీనా లిస్ట్ ఇస్తుంది. ఏ రోజైనా లెక్క ఎక్కువ తక్కువ అయిందా? ఇంటికి వచ్చిన వెంటనే డోర్ వేసుకుని లోపల కూర్చుంటే వీటి గురించి ఎలా తెలుస్తుంది? ఏ నెలలో అయినా డబ్బులు మిగుల్చుకుని నిన్ను ఆస్పత్రిలో చూపిద్దామని అనుకుంటున్నా. కానీ, ఒక్క నెల అయినా ఖర్చు తగ్గుతుందా' అని తండ్రితో చెబుతాడు. అలా అలా గొడవ జరుగుతుంటే రోహిణి తట్టుకోలేదు. అప్పుడామె 'బాలు ఆగుతావా నీకు దండం పెడతాను' అంటుంది. వెంటనే వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకు వచ్చి బాలుకు ఇస్తుంది.

బాలు డబ్బులు తీసుకున్న తర్వాత రోహిణి 'బాలు ఈ నెల నుంచి నువ్వు ఇంటికి ఏమీ ఖర్చు చేయనవసరం లేదు. మనోజ్‌కు 1వ తేదీన శాలరీ వస్తుంది. ఇక నుంచి ఇంటికి కావాల్సినవి అన్నీ మేమే కొంటాము. మనోజ్.. మీ తమ్ముడు ఖర్చుతో ఏమి తెచ్చినా నేను వాడను' అంటుంది. అప్పుడు బాలు 'నువ్వు అంటున్నావు కానీ వాడు శాలరీ ఇస్తాను అని అంటున్నాడా' అని అంటాడు. తర్వాత బాలుపై మీనా సీరియస్ అవుతుంది. అదే సమయంలో మనోజ్‌పై రోహిణి కూడా సీరియస్ అవుతుంది. అంతేకాదు, ఇష్టం వచ్చినట్లు తిడుతుంది.

రోహిణి ఎంత తిట్టినా మనోజ్ మాత్రం పట్టించుకోడు. అంతలోనే ప్రభావతి అక్కడకు వచ్చి 'అమ్మా.. ఆ బాలు గాడు నోరు అంతే. మనోజ్ ఏం చేస్తాడు' అని అంటుంది. దీంతో రోహిణి 'ఉద్యోగం చేస్తున్నాడు కదా అత్తయ్యా. నేను డబ్బులు తీసుకు వచ్చి ఇస్తానని ఎందుకు అనట్లేదు' అని ఫైర్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X