Gunde Ninda Gudi Gantalu August 13th: సుగుణమ్మను కాపాడిన బాలు.. మీనా దగ్గరకు చింటూ.. రోహిణికి బిగ్ షాక్
ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బాలును అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేయమని ఫోన్ చేయమని ప్రభావతి తన భర్త సత్యంతో చెప్తుంది. అంతలోనే అక్కడకు బాలు వచ్చి నేను వచ్చేశాను అని అంటాడు. అంతేకాదు, తనతో వచ్చిన భార్యను కూడా చూపిస్తాడు. దీంతో ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. ఆ సమయంలోనే ఇంటికి ఓ కుర్రాడు సరుకులు తీసుకు వస్తాడు. వాటి బిల్లు 30 వేలు అవ్వడంతో బాలు నానా రభస చేస్తాడు. దీంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు రోహిణి కోపంగా తీసుకు వచ్చి డబ్బులు ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఇకపై మనోజ్ మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతాడని చెబుతుంది.

బాలు చేసిన రచ్చతో రోహిణి బాగా ఫీల్ అవుతుంది. అప్పుడు ప్రభావతి రావడంతో 'ఆ బాలు అన్ని మాటలు అంటుంటే నేనే వచ్చే నెల నుంచి డబ్బులు ఇస్తాను అని మనోజ్ ఎందుకు అనట్లేదు అత్తయ్య. నెక్ట్స్ మంత్ నుంచి మనోజ్ తన శాలరీని ఖర్చు చేయకపోతే అస్సలు ఊరుకోను' అని తేల్చేస్తుంది. అప్పుడు మనోజ్ భయపడుతూ డ్యూటీకి వెళ్తున్నాను అని అంటాడు. అది అబద్దం అని తెలిసిన ప్రభావతి కవర్ చేసి చెబుతుంది. దీంతో రోహిణి వాళ్ల మాటలు నమ్మి పంపుతుంది.
మీనా కోసం చీర కొనడానికి బాలు ఆమెను కారులో తీసుకు వెళ్తుంటాడు. కానీ, ఆమె మాత్రం డబ్బులు వేస్ట్ ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడు బాలు 'నేను ఒక్కడినే ఆదాయం తీసుకు వస్తుంటే వాళ్లంతా పంచుతున్నారు. నీకు ఒక్క చీర కొనిస్తే తప్పేంటి' అంటాడు. అప్పుడు మీనా 'మీరు సరుకుల కోసం అన్ని మాటలు అనడం బాలేదు. రోహిణి చాలా ఫీల్ అయింది' అంటుంది. అప్పుడు బాలు 'అయితే అవనివ్వు. అలా అయినా డబ్బులు తీసుకు వచ్చి ఇస్తుంది. అప్పుడు నాకు భారం తగ్గుతుంది' అంటాడు.
ఆరోగ్యం బాలేకపోవడంతో చింటూను తీసుకుని వేరే ఇంటికి వెళ్లేందుకు రోహిణి అమ్మ వస్తుంటుంది. అప్పుడు ఆ చిన్నారి అత్త దగ్గరకు వెళ్తున్నామా అని అడగ్గా కాదని చెబుతుంది. ఆ సమయంలోనే చింటూ 'అత్త ఇప్పుడు మీనా అత్త వాళ్ల ఇంట్లో ఉందా? రోహిణి అత్తకు పెళ్లి అయిందా? మనం ఎందుకు పెళ్లికి వెళ్లలేదు' అని అడగడంతో ఆమె షాక్ అవుతుంది. వెంటనే 'అదేమి లేదు. కొద్ది రోజులు ఉండటానికి వెళ్లింది' అని అబద్ధం చెప్తుంది. అలా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా రోహిణి తల్లి కళ్లు తిరిగి పడిపోతుంది.
రోహిణి తల్లి కింద పడిపోవడం అటుగా వెళ్లున్న మీనా, బాలు చూస్తారు. వెంటనే కారును ఆపిన బాలు.. చింటూ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. అప్పుడామె పరిస్థితి చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకు వస్తారు. దీంతో ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్ ఆమె పరిస్థితి బాలేదని, ఏదైనా తేడా జరిగితే కోమాలోకి వెళ్లిపోతుందని, అందుకే 24 గంటలు గడిచే వరకూ ఏమీ చెప్పలేమని అంటుంది. ఆ సమయంలో చింటూను కొన్ని వివరాలు అడుగుతారు. కానీ, ఆ బాలుడు చెప్పడు. దీంతో చేసేదేం లేక చింటూను మీనా, బాలు ఇంటికి తీసుకు వెళ్తారు.
చింటూను బాలు, మీనా ఇంటికి తీసుకు రావడంతో ప్రభావతి వాళ్లపై సీరియస్ అవుతుంది. దీంతో మీనా 'వాళ్ల అమ్మమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. అందుకే బాబును ఇంటికి తీసుకు వచ్చాం' అంటుంది. దీంతో ప్రభావతి 'దారినపోయే వాళ్లను తీసుకొస్తే ఆమెకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి. వెంటనే వీడిని తీసుకు వెళ్లి ఇచ్చేసి రండి' అంటుంది. దీనికి బాలు 'ఇలా మాట్లాడడానికి మనసెలా ఒప్పింది. మానవత్వం ఏమీ లేదా' అని అంటాడు. దీంతో ప్రభావతి 'ఎవడికో పుట్టిన వాడిని తీసుకొచ్చి మీరు తల్లడిల్లిపోతాడా? వాడేమైనా మీ పిల్లాడా' అని ప్రశ్నిస్తుంది.
ప్రభావతి మాటలకు బాలు 'ఇదేమైనా నీ ఇల్లా' అని తల్లిని ప్రశ్నిస్తాడు. దీనికామె నా ఇల్లే అంటుంది. దీంతో బాలు 'నీ ఇల్లు అయితే ఇంటి పత్రాలు తీసుకు వచ్చి చూపించు' అంటాడు. అప్పుడు ప్రభావతి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. తర్వాత రోహిణి ఆస్పత్రికి వెళ్లాలని బయలుదేరుతుంటే ప్రభావతి అడుగుతుంది. దీంతో పార్లర్‌కు వెళ్తున్నా అంటుంది. అప్పుడు సుగుణమ్మ గురించి మర్యాద లేకుండా మాట్లాడడంతో రోహిణి సీరియస్ అవుతుంది. తర్వాత చింటూ నిద్రల లేస్తే మీనా అన్నం పెడుతుంది.
రోహిణి ఆస్పత్రికి వెళ్లి తన తల్లిని పలకరిస్తుంది. అప్పుడామె 'నీకు ఫోన్ చేద్దామని అనుకున్నా అంతలో ఇలా జరిగిపోయింది' అని అంటుంది. దీంతో రోహిణి 'నువ్వు ఏం చేయాలని అనుకున్నా నా మెడకే చుట్టుకుంటుంది. ఆ చింటూను మీనా వాళ్లు మా ఇంటికే తీసుకు వచ్చారు' అని అంటుంది. దీనికి సుగుణమ్మ 'దేవుడు వాడిని ఎక్కడికి చేర్చాలో అక్కడకు చేర్చాడు' అంటుంది. దీంతో రోహిణి 'ఈ నిజం కూడా తెలిస్తే మళ్లీ పెళ్లి పెటాకులు అవుతుంది' అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











