Gunde Ninda Gudi Gantalu August 14th: ఆస్పత్రి నుంచి సుగుణమ్మ మిస్సింగ్.. మనోజ్ మాటలు వినేసిన రోహిణి

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బాలు చేసిన రచ్చతో రోహిణి బాగా ఫీల్ అవుతుంది. అప్పుడు మనోజ్‌ ఎలాగైనా జీతం తీసుకు వచ్చి ఇవ్వాలని తేల్చి చెప్తుంది. దీంతో ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు. మీనా కోసం చీర కొనడానికి బాలు ఆమెను కారులో తీసుకు వెళ్తుంటాడు. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న సుగుణమ్మ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అది చూసిన బాలు వాళ్లు ఆమెను ఆస్పత్రిలో చేర్చుతారు. అనంతరం చింటూను ఇంటికి తీసుకు వెళ్తారు. దీంతో ప్రభావతి.. మీనా, బాలుపై సీరియస్ అవుతుంది. అదంతా చూసిన రోహిణి.. వెంటనే తల్లి కోసం ఆస్పత్రికి చేరుకుంటుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 14th

బుధవారం ఎపిసోడ్‌లో... ఆస్పత్రికి వచ్చిన రోహిణి తన తల్లిని తిడుతుంటుంది. అంతేకాదు, అసలు చింటూను వాళ్లతో ఎందుకు పంపించావు అని నిందిస్తుంది. అప్పుడు అక్కడకు వచ్చిన ఓ నర్స్ మందులు తీసుకు రావాలని చెబుతుంది. అంతేకాదు, మీరు పేషెంట్‌కు ఏమవుతారని అడుగుతుంది. దీనికి రోహిణి 'ఆమెను నేను బంధువును అవుతాను' అని చెబుతుంది. దీంతో సుగుణమ్మ గుండె తల్లడిల్లిపోతుంది. అప్పుడే బాలు, మీనా అక్కడకు వస్తుంటారు. అది చూసిన రోహిణి వాళ్ల అమ్మకు విషయం చెప్పి పక్కకు వెళ్లిపోతానని అంటుంది.

సుగుణమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత బాలు, మీనా ఆమె ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తారు. అనంతరం బాలు 'మీ అమ్మాయి నెంబర్ ఇవ్వండి. ఆమెను ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడకు రమ్మని అడుగుతాను' అంటాడు. దీంతో సుగుణమ్మ షాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది. అప్పుడు మీనా 'మీ అమ్మాయి నెంబర్ అడిగితే ఆలోచిస్తున్నారేంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'నాకు నెంబర్ తెలియదమ్మా. ఫోన్‌లో ఉంది. ఇప్పుడు అది కూడా పాడైపోయింది' అని చెబుతుంది. అప్పుడు బాలు 'పోనీ మీ అమ్మాయి అడ్రెస్ చెప్పండి' అంటాడు.

బాలు అడిగిన దానికి సుగుణమ్మ చాలా సేపు ఆలోచించుకున్న తర్వాత 'నా కూతురు ఇక్కడ లేదు బాబు. దుబాయ్ వెళ్లిపోయింది. ఆ విషయం తెలియకనే ఇక్కడకు వచ్చాను. అది తెలిసిన తర్వాత ఇలా జరిగిపోయింది' అంటుంది. దీంతో మీనా 'మరి మీ అల్లుడు నెంబర్ అయినా చెప్పండి.. ఓహో మీ సెల్ పాడైపోయింది కదా' అంటుంది. అప్పుడు బాలు 'సరే మీరు బాగయ్యే వరకూ మా ఇంట్లో ఉందురుగానీ రండి' అంటాడు. కానీ, సుగుణమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు. అప్పుడే డాక్టర్ బిల్ ఇవ్వడంతో బాలు కడతానని అనగా సుగుణమ్మ వద్దు అంటుంది.

బాలు బిల్ కడతానని వెళ్లగానే మీనా 'మీరు ఆమెను ఎందుకు అంత గుడ్డిగా నమ్ముతున్నారు. ఆమె ఏది అడిగినా అబద్దమే చెబుతున్నట్లు అనిపిస్తుంది' అంటుంది. దీంతో 'నువ్వు కూడా మా అమ్మలా తయారయ్యావేంటి' అని బాలు అంటాడు. తర్వాత రోహిణి అక్కడకు వచ్చి వాళ్లు రాకముందే వెళ్లిపోదాం బిల్ కట్టేసి తీసుకు వెళ్తుంది. తర్వాత బాలు వాళ్లు అక్కడకు వచ్చి చూసి షాక్ అవుతారు. అప్పుడు అక్కడి వాళ్లను అడగడంతో 'వాళ్ల రిలేటివ్ అంట ఒకామె వచ్చి బిల్ కట్టేసి ఆమెను తీసుకు వెళ్లిపోయింది' అని చెబుతారు.

సుగుణమ్మ వెళ్లిపోయిన తర్వాత మీనా 'ఇప్పటికీ మీకు ఏమీ అర్థం కావడం లేదా? ఆమె తనకు ఎవరూ లేరని చెప్పింది. మరి ఇప్పుడు వాళ్ల రిలేటివ్ ఎలా వచ్చింది? ఈమె దగ్గర ఫోన్ కూడా లేదు. మరి ఆమెకు విషయం ఎలా తెలిసింది? ఆ చింటూ కూడా ఏమి అడిగినా సైలెంట్‌గానే ఉన్నాడు' అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దీంతో బాలు 'ఆమె ఏమైనా చేసుకోని. మనం సాయం చేశాం. ఆమె కోలుకుంది' అంటాడు. తర్వాత సుగుణమ్మ, చింటూను రోహిణి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకు వస్తుంది. అంతేకాదు, చింటూకు కొన్ని జాగ్రత్తలు చెబుతుంది.

రోహిణి మాట్లాడుతుంటే చింటూ 'నువ్వు నా ఫ్రెండ్స్‌ను కలుస్తానని చెప్పి ఎందుకు వెళ్లిపోయావు? మీనా అత్తే మంచిది' అంటాడు. దీంతో చింటూను కొట్టేందుకు రోహిణి చేయి లేపుతుంది. తర్వాత చింటూ వెళ్లిపోగానే తల్లికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అంతేకాదు, మీనా, బాలు మంచి వాళ్లు అని అంటుంది. దీంతో రోహిణి 'నువ్వు బయటి దానికి కాబట్టి నీకు మంచి వాళ్లులా అనిపిస్తారు. కానీ, ఇంట్లో ఉంటున్నది నేను. ఆ బాలు వల్లే మా ఇంట్లో ఎన్నో గొడవలు. ఆ రోహిణికి కూడా ఇప్పుడు డౌట్ వచ్చింది. నువ్వు వాళ్లతో మాట్లాడకు' అని చెప్పి వెళ్లిపోతుంది.

ఉద్యోగం పోవడం.. రోహిణి అన్న మాటలను గుర్తు చేసుకుని మనోజ్ తల పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడు ప్రభావతి వచ్చి బాగా తిడుతుంది. దీంతో మనోజ్ 'నేను పడే కష్టం తెలుసా? రోజూ రెడీ అయి పార్కులోకి వెళ్లి పడుకోవాల్సి వస్తుంది. అందుకే రోహిణి చెప్పేద్దాం అనుకుంటున్నా' అంటాడు. దీంతో ప్రభావతి తొందరపడి నిజం చెప్పొద్దు అని చెబుతుంది. అంతలో అక్కడకు వచ్చిన రోహిణి 'ఉద్యోగం చూసుకోమంటున్నారు ఏంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్, ప్రభావతి అబద్దం చెబుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X