Gunde Ninda Gudi Gantalu August 16th: నిజం చెప్పిన పోలీస్.. దొరికిపోయిన మీనా.. తమ్ముడి రాకతో ట్విస్ట్

గతంలో కంటే ఇప్పుడు అభిరుచిలో మార్పులు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభావతి ఇంటికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వస్తారు. వాళ్లు వచ్చీ రాగానే బాలు ఏమైనా చేశాడా అని ప్రభావతి అడుగుతుంది. కానీ, ఆ కానిస్టేబుళ్లు మాత్రం మనోజ్‌ను పిలవమని అనడంతో అందరూ కంగారు పడిపోతారు. అప్పుడు మనోజ్ రాగానే కల్పనపై కేసు పెట్టింది మీరే కదా అని అడుగుతారు. గతంలో కల్పన.. మనోజ్‌ను ప్రేమ పేరుతో మోసం చేసి 40 లక్షలు కాజేస్తుంది. అలా హైడ్రామా నడుమ బాలు, మీనా పెళ్లి జరుగుతుంది. ఇక, మీనాను అక్కడ చూసిన ఓ కానిస్టేబుల్.. ఈ అమ్మాయి వాళ్ల తమ్ముడే బాలు బైక్ దొంగతనం చేశాడు కదా అంటూ చెప్పి షాకిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 16th

శుక్రవారం ఎపిసోడ్‌లో.. కానిస్టేబుల్ ద్వారా నిజం తెలుసుకున్న ప్రభావతి.. మీనాను, వాళ్ల ఫ్యామిలీని నిందిస్తుంటుంది. అప్పుడు సత్యం వాళ్లు చెప్పింది నిజమేనా అని మీనాను ప్రశ్నిస్తాడు. దీనికామె అవును అని చెబుతుంది. అప్పుడు ప్రభావతి మరింతగా రెచ్చిపోతుంది. అంతేకాదు, 'అది తెలియక చేసింది కాదు. కావాలనే చేశాడు. ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఇదే ఇంటికి కోడలిగా వచ్చావా? అసలు నిన్ను నమ్మి ఇల్లు ఎలా వదిలిపెట్టి వెళ్లాలి. ఎంత మాయ చేశారు? ఎంత గుట్టుచప్పుకు కాకుండా మోసం చేశారు' అని అంటుంది.

ప్రభావతి మాట్లాడిన తర్వాత మనోజ్ 'అయ్యబాబోయ్ ఆ పెళ్లి నుంచి పారిపోయి బతికిపోయాను. పూర్ ఫ్యామిలీ అనుకున్నాను కానీ.. ఇలాంటి క్రిమినల్స్ అనుకోలేదు' అంటాడు. అప్పుడు ప్రభావతి 'నిజం చెప్పిండి.. ఈ విషయం తెలిసే పెళ్లి చేశారా? అయినా మనోజ్ గాడు 40 లక్షల గురించి మాటిమాటికి మీ ముద్దుల కొడుకు మాట్లాడుతూ దొంగ అంటుంటాడు. వాడు తెలిసి తెలిసి ఒక దొంగ అక్కను ఎలా పెళ్లి చేసుకున్నాడు? మీ ముఠా నాయకురాలు మీ అమ్మేనా? మీ అమ్మ గ్యాంగ్ లీడర్ అయితే నువ్వు, మీ చెల్లి ఏం దొంగతనం చేశారు' అంటూ అవమానిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 16th

ప్రభావతి మాటలకు మీనా ఏడుస్తూ.. 'అత్తయ్య ఇంక చాలు. మీకు దండం పెడతాను. నా తమ్ముడు చేసిన తప్పు తెలుసుకున్నాడు. మంచిగా మారాడు. వాడు తెలియక చేసిన ఒక నేరాన్ని మా కుటుంబం మీద వేయడం న్యాయం కాదు' అంటుంది. అప్పుడామె 'న్యాయం గురించి నువ్వు మాట్లాడాలి. ఇలాంటి బతుకు బతకడం కంటే అడుక్కు తినడం బెటర్' అంటూ మరింతగా అవమానిస్తుంది. దీంతో మీనా ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాత వాళ్లు అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తుంటుంది. అప్పుడే సత్యం వచ్చి ఈ విషయం నాకు ముందే చెప్పాలింది అంటాడు.

మీనా ఇంటికి వెళ్లిపోవడంతో పార్వతమ్మ భయంగా ఉంటుంది. అప్పుడు సుమతి ఆమెకు ధైర్యం చెప్తుంది. తర్వాత మీనాకు కాల్ చేయగా.. ఆమె జరిగింది మొత్తం తల్లికి చెబుతుంది. 'అసలు నా బతుకు ఏంటమ్మా? ఎప్పుడూ నేను ఏడవలేదు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ, ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకున్నా గొంతులోనే ఆగిపోతుంది. అమ్మా పెళ్లి అయిపోతే ఆత్మాభిమానం చచ్చిపోవాలా? అత్తగారి ఇంట్లో గొంతు విప్పే అధికారమే లేదా' అంటూ ఏడుస్తుంది. దీంతో పార్వతమ్మ కంగారు పడుతూ అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 16th

పార్వతమ్మ అడగడంతో 'ఎప్పుడో తమ్ముడు చేసిన దొంగతనం గురించి ఇప్పుడు అత్తగారి ఇంట్లో తెలిసిపోయింది. అంతా మర్చిపోయారని అనుకున్నా. కానీ, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మా అత్తగారు నన్ను, మిమ్మల్ని దొంగలు అంటుంది. మనం కావాలని దాచిపెట్టాం అంటుంది. ఈ నింద నా కాపురంలో ఎన్ని గొడవలు తెచ్చిపెడుతుందో భయంగా ఉంది. ఈ నిందను నేను జీవితాంతం మోయాల్సి వచ్చేలా ఉంది. అంతా నా ఖర్మ' అంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పుడు పార్వతమ్మ దేవుడి ముందు తన బాధను చెప్పుకుంటూ బాధపడుతుంది.

పార్వతమ్మ ఏడుస్తుండగా వాళ్ల కొడుకు వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడామె అతడిని కొడుతుంది. దీంతో నేనేం చేశానని అంటాడు. దీంతో పార్వతమ్మ 'మొత్తం నువ్వే చేశావు. నువ్వు చేసిన దొంగతనమే మీ నాన్నను మనకి లేకుండా చేసింది. ఇప్పుడు మీనాను కష్టపెడుతుంది. ఎందుకురా తోడబుట్టిన వాళ్ల ఉసురు తీసుకుంటున్నావు' అని తిడుతుంది. అప్పుడు వాళ్ల కొడుకు సారీ చెప్తాను అని అంటాడు. దీంతో పార్వతమ్మ వెళ్లమని చెబుతుంది. ఆ వెంటనే మీనా దగ్గరకు వాళ్ల తమ్ముడు వెళ్తాడు. అప్పుడు ఎవరూ పలకకపోవడంతో గదిలోకి వెళ్లబోతాడు.

మీనా తమ్ముడిని చూసిన ప్రభావతి కోపంగా అరుస్తుంది. అంతేకాదు, దొంగతనం చేయడానికి వచ్చావా అని నిందిస్తుంది. దీంతో మీనా అతడిని తిట్టి ఇంకెప్పుడూ రావొద్దని అంటుంది. అయినా ప్రభావతి అస్సలు తగ్గకుండా అతడిని తిడుతూనే ఉంటుంది. తర్వాత మనోజ్ వచ్చి ఇంకా అవమానిస్తూ అతడి బ్యాగ్ చెక్ చేస్తాడు. అప్పుడు అతడి బ్యాగ్‌లో ఉన్న ఫుడ్‌తో పాటు బుక్స్ కింద పడిపోతాయి. తర్వాత ఆ కుర్రాడు మనోజ్ కాలర్‌ను పొరపాటున పట్టుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X