Gunde Ninda Gudi Gantalu August 17th: నిజం చెప్పేసిన మీనా.. బాలు రాకతో ఒక్కసారిగా మారిన స్టోరీ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' తాజాగా ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పోలీసుల ద్వారా దొంగతనం గురించి తెలుసుకున్న ప్రభావతి.. మీనాను నోటికి వచ్చినట్లు తిడుతుంది. అంతేకాదు, ఆమె ఫ్యామిలీపైన కూడా చాలానే నిందలు వేస్తుంది. దీంతో మీనా ఏడుస్తూ ఇక ఆపేయమని బ్రతిమాలుతుంది. కానీ, ప్రభావతి మాత్రం అస్సలు తగ్గదు. ఆ తర్వాత మీనా ఒంటరిగా కూర్చుని ఏడుస్తుండగా సత్యం వెళ్లి తనకైనా ఈ విషయం చెప్పాల్సింది అని అంటాడు. దీంతో మీనా మరింతగా బాధపడుతుంది. అప్పుడే పార్వతమ్మ ఆమెకు కాల్ చేస్తుంది. కానీ, బాధలో ఉన్న మీనా కాల్ లిఫ్ట్ చేయదు. దీంతో పార్వతమ్మ కంగారుగా మళ్లీ చేస్తుంది.

తల్లి ఫోన్ చేయడంతో మీనా నిరాశగా మాట్లాడుతుంది. దీంతో ఆమె ఏమైందని అడగ్గా.. ఇంట్లో జరిగిన గొడవ మొత్తం వివరించి చెప్తుంది. దీంతో పార్వతమ్మ మరింతగా కృంగిపోతూ ఉంటుంది. అప్పుడే ఆమె కొడుకు అక్కడకు వస్తాడు. దీంతో అతడిని పార్వతమ్మ బాగా కొట్టడంతో నేరుగా వెళ్లి ప్రభావతికి క్షమాపణ చెప్తానని అంటాడు.
దీనికి తల్లి ఒప్పుకోవడంతో వెంటనే మీనా ఇంటికి వెళ్తాడు. అక్కడ మీనా కోసం ఒక గదిలోకి వెళ్లగా ప్రభావతి చూసి దొంగతనం చేయడానికి వచ్చాడని రచ్చ చేస్తుంది. అప్పుడు మనోజ్ వచ్చి అతడి బ్యాగ్ చెక్ చేస్తూ మరింత అవమానిస్తాడు. మనోజ్ అతడి బ్యాగ్ చెక్ చేసి అవమానిస్తోన్న సమయంలో మీనా తమ్ముడు అతడి కాలర్ పట్టుకుంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తి అయింది.
రాబోయే ఎపిసోడ్‌లో... మనోజ్ కాలర్‌ను మీనా తమ్ముడు పట్టుకోవడంతో రోహిణి వచ్చి కొడుతుంది. అప్పుడు రచ్చ జరుగుతుండగా బాలు అక్కడకు వస్తాడు. అప్పుడు అతడికి మీనా జరిగింది మొత్తం వివరించి చెప్తుంది. దీంతో బాలు రెచ్చిపోయి మనోజ్‌పై చేయి చేసుకుంటాడు. అంతేకాదు, అతడి మెడ పట్టుకోమని మీనా తమ్ముడితో అంటాడు. అదే సమయంలో రోహిణి మీదకు వెళ్లి తనదైన రీతిలో కౌంటర్లు ఇస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications










