Gunde Ninda Gudi Gantalu August 19th: తిక్క కుదిర్చిన బాలు.. మీనా తమ్ముడితో అలా.. రంజుగా నేటి ఎపిసోడ్
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పోలీసుల ద్వారా దొంగతనం గురించి తెలుసుకున్న ప్రభావతి.. మీనాను నోటికి వచ్చినట్లు తిడుతుంది. అంతేకాదు, ఆమె ఫ్యామిలీపైన కూడా చాలానే నిందలు వేస్తుంది. దీంతో మీనా ఏడుస్తూ ఇక ఆపేయమని బ్రతిమాలుతుంది. కానీ, ప్రభావతి మాత్రం అస్సలు తగ్గదు. తల్లి ఫోన్ చేయడంతో మీనా నిరాశగా మాట్లాడుతుంది. దీంతో ఆమె ఏమైందని అడగ్గా.. ఇంట్లో జరిగిన గొడవ మొత్తం వివరించి చెప్తుంది. అప్పుడే కొడుకు రావడంతో అతడిని కొట్టి విషయం చెప్తుంది. దీంతో ప్రభావతి వాళ్లకు సారీ చెప్తానని వెళ్తాడు. అక్కడ ప్రభావతి, మనోజ్ అతడిని ఘోరంగా అవమానిస్తారు.



Click it and Unblock the Notifications











