Gunde Ninda Gudi Gantalu August 1st: కేసు గెలిచిన సత్యం.. డీఎంకు డబుల్ షాక్.. శృతి ఇంట్లో రవిని చూడడంతో!
గతంలో కంటే ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్ మారుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
అనుకోకుండా జరిగిపోయిన శోభనం గురించి ఆలోచిస్తూ బాలు టెన్షన్ పడుతుంటాడు. తర్వాత అతడి స్నేహితులు వచ్చి ఏమైందని అడగ్గా.. అతడు తిక్క తిక్క సమాధానాలు చెబుతుంటాడు. మరీ ముఖ్యంగా తన స్నేహితులను బాలు మీకు పిల్లలు పెళ్లైన ఎన్నేళ్లకు పుట్టారు అని ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్లు చెప్పిన సమాధానాలకు కంగు తింటాడు. తర్వాత 'దేవుడా.. నా అప్పులన్నీ తిరిపోయాక.. తిప్పలన్నీ అయిపోయిన తర్వాత.. అప్పుడు ఇయ్యవయ్యా పిల్లల్ని' అని మనసులోనే కోరుకుంటాడు. అతడి తీరును చూసి పక్కన ఉన్న వాళ్లంతా షాక్ అవుతుంటారు.

తన పెన్షన్ ఆపేయడంపై సత్యం గతంలోనే కోర్టులో కేసు వేస్తాడు. దానిపై ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి అసలు ఏం జరిగిందో చెప్పమని సత్యంను అడుగుతారు. దీనికాయన 'నేను సర్వీస్ పూర్తి చేసిన తర్వాత నాకు రావాల్సిన పెన్షన్‌ను ఈ డీఎం గారు ఆపేశారు సార్' అని చెబుతాడు.
అప్పుడు ఆ డీఎం మాట్లాడుతుంటే జడ్జ్ ఆయనపై సీరియస్ అవుతారు. అప్పుడు అసలు ఏమైందని ఆయన అడగ్గా.. 'నా రిటైర్మెంట్ ఫంక్షన్‌తో ఈ డీఎం గారు నన్ను తక్కువ చేసి మాట్లాడడంతో నా కొడుకు ఆయన కాలర్ పట్టుకున్నాడు. అది మనసులో పెట్టుకునే ఆయన నా పెన్షన్ నాకు రాకుండా ఆపేశారు' అని వివరిస్తాడు. అంతలోనే బాలు వచ్చి గోల గోల చేస్తాడు. అప్పుడు జడ్జ్ మందలించడంతో కాస్త తక్కువ వాయిస్‌తోనే తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి న్యాయమూర్తికి వివరిస్తాడు. దీంతో అక్కడే ఉన్న డీఎం రగిలిపోతుంటాడు.
సత్యం తరపున వాదన విన్న తర్వాత డీఎంను పిలిచి అతడి వెర్షన్ చెప్పమని జడ్జ్ అడుగుతారు. దీనికాయన 'వీళ్ల ఫ్యామిలీ చాలా రూడ్‌గా ఉంటుంది సార్. ఈయన డ్యూటీలో ఉండగానే ఒకరి హత్యకు కారణం అయ్యాడు' అని చెబుతాడు. అప్పుడు సత్యం 'సార్.. నేను డ్యూటీలో ఉండగా ఒకరు చనిపోయింది నిజమే. కానీ, ఆ చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా మీరు చూడొచ్చు సార్' అని అంటాడు. అప్పుడు బాలు కలుగజేసుకుని నేను మాట్లాడొచ్చా సార్ అనగా.. జడ్జ్ నీకు పర్మీషన్ తీసుకోవడం కూడా తెలుసా అంటాడు.
అనంతరం బాలు 'సార్.. మా నాన్న దేవుడు. ఆయన వల్ల కాకపోయినా ఒక వ్యక్తి చనిపోవడంతో వాళ్ల ఫ్యామిలీకి అన్యాయం జరగకుండా చేశారు. వాళ్ల అమ్మాయినే నాకు ఇచ్చి పెళ్లి చేశారు' అని చెప్తాడు. దీంతో న్యాయమూర్తి కూడా కరిగిపోతాడు. వెంటనే 'సత్యం పెన్షన్‌ను డీఎం కక్షపూరితంగానే ఆపేశారని కోర్టు నమ్ముతోంది. కాబట్టి ఏ నెల నుంచి పెన్షన్ రాకుండా ఆపారో, ఆ బకాయిని చెల్లించడంతో పాటు ప్రతి నెలా పెన్షన్ వచ్చేలా చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. అలాగే డీఎంను సత్యం వాళ్లకు చెల్లించవలసిందిగా ఆదేశిస్తున్నా' అంటారు.
కోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎం 'అంత డబ్బు నేను కట్టలేను సార్' అంటాడు. దీంతో న్యామూర్తి 'కోర్టు తీర్పును దిక్కరించినందుకు మరో యాభై వేలు జరిమానా విధిస్తున్నాను. కాబట్టి మొత్తం లక్ష రూపాయలను పది రోజుల్లో చెల్లించాలని ఆదేశిస్తున్నా' అని న్యాయమూర్తి చెబుతారు. దీంతో సత్యం, బాలు సంతోషించగా.. డీఎం షాక్ అవుతాడు. అంతేకాదు, 'ఇది ఇక్కడితో పోయేది కాదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను' అని అంటాడు. దీంతో బాలు వెక్కిరిస్తాడు.
తర్వాత శృతిని, బాలు బైక్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు అతడిని లోపలికి రమ్మని ఆమె బలవంతం చేస్తుంది. దీంతో అతడు ఇంట్లోకి వెళ్తాడు. అప్పటికే ఇంట్లో ఉన్న డీఎం అదే శృతి తండ్రి కేసు ఓడిపోయిన విషయంలో రగిలిపోతూ ఉంటాడు. అతడి భార్య కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. అంతేకాదు, ఒక డ్రైవర్ మీ మీద గెలిచాడు అని రెచ్చగొడుతుంది. అప్పుడు డీఎం 'ఇప్పటి నుంచి నాకు ఎవరైనా శత్రువు ఉన్నాడంటే ఆ సత్యం గాడు ఒక్కడే' అంటాడు. అంతలోనే రవిని తీసుకుని శృతి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది.
ఇంట్లోకి వచ్చిన తర్వాత శృతి.. రవిని ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తుంది. అప్పుడు డీఎం 'నువ్వు సత్యం కొడువుకు కదా. ఆ మధ్య మా అమ్మాయిని డబ్బింగ్ స్టూడియో దగ్గర డ్రాప్ చేసింది నువ్వే కదా' అంటాడు. దీంతో రవి అవును అనడంతో డీఎం 'మీ నాన్న నా కింద పని చేసే డ్రైవర్. నువ్వు వంటలు చేసుకుంటున్నావు కదూ' అంటాడు. దీనికి రవి 'నేను హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. రెస్టారెంట్ పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నా. అప్పటి వరకూ చెఫ్‌గా చేస్తున్నా' అనడంతో ఆయన చులకన చేసి మాట్లాడుతుంటాడు. దీంతో రవి ఆయనకు అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. ఇలా బుధవారం ఎపిసోడ్ పూర్తైంది. ఇక, గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మీనా, బాలు గదిలో కొట్టుకుంటూ ఉంటారు. అదంతా వేరే అని ప్రభావతి అనుకుంటుంది.


Click it and Unblock the Notifications











