Gunde Ninda Gudi Gantalu August 20th: బాలుకు తెలిసిన నిజం.. తొలిసారి మీనా అలా.. మనోజ్‌కు రోహిణి షాక్
భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మనోజ్ జేబులు చెక్ చేస్తున్న సమయంలో శివ పొరపాటున అతడి కాలర్ పట్టుకుంటాడు. దీంతో రోహిణి వచ్చి శివను కొడుతుంది. తర్వాత అతడిని గెంటేయబోతుంటే బాలు వస్తాడు. వచ్చీ రావడమే అతడిని వెనక్కి తీసుకు వచ్చి అందరికీ క్లాస్ పీకుతాడు. తర్వాత వాడిని ఏమైనా అంటే మనోజ్ మీద కేసు పెడతానని అంటాడు. అనంతరం శివకు అన్నం పెట్టి పంపించమని మీనాకు చెప్తాడు. ఇక, రవిని కొట్టడానికి సురేంద్ర రౌడీలను పంపిస్తాడు. అతడు వాళ్లతో కలబడుతూ ఉండగా బాలు చూసి ఆ రౌడీలను కొడతాడు. తర్వాత సురేంద్ర ఇంటికి కోపంగా వెళ్తాడు.

మంగళవారం ఎపిసోడ్‌లో.. రవి మీదకు సురేంద్ర రౌడీలను పంపించాడని తెలుసుకున్న వెంటనే బాలు వాళ్ల ఇంటికి కోపంగా వెళ్తాడు. అంతేకాదు, సురేంద్ర చెంపలను వాయిస్తూ రెచ్చిపోతాడు. అప్పుడు ఆయన భార్య ఆపే ప్రయత్నం చేసినా అస్సలు తగ్గడు. పైగా 'మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్‌లో నీ కాలర్ పట్టుకున్నది నేను. ఏదైనా చేయాలంటే నన్ను చెయ్. అంతేకానీ అభం శుభం తెలియని మా తమ్ముడి మీదకు రౌడీలను పంపిస్తావా' అంటూ మళ్లీ కొడుతుంటాడు. అప్పుడు సురేంద్ర భార్య ఇలా చేస్తే పోలీసులను పిలుస్తానని బాలుకు వార్నింగ్ ఇస్తుంది.

సురేంద్ర భార్య బెదిరించడంతో బాలు 'పిలువమ్మా.. పిలిస్తే ఈ దరిద్రుడినే తీసుకుపోతారు. నా తమ్ముడి మీదకు రౌడీలను పంపించాడు కదా. ఎంత ధైర్యంరా నీకు? డబ్బు ఉంది కదా అని రౌడీలను పంపిస్తే ఊరుకుంటామా' అని బదులిస్తాడు. అప్పుడు సురేంద్ర భార్య శృతి లవ్ స్టోరీ గురించి చెప్తుంది. దీంతో బాలు 'నా తమ్ముడికి అలాంటి బుద్దులు లేవు. వాడు ఎప్పటికీ అలాంటి తప్పులు చేయడు. మీరు నా మీద పగ పెంచుకుని మీ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఇలా చేస్తున్నారు' అంటాడు. అప్పుడు బాలు.. రవిని అడగ్గా అతడేమో సైలెంట్‌గా ఉంటాడు.

ఎంత అడిగినా రవి చెప్పకపోవడంతో సురేంద్ర భార్య 'ఎలా చెప్తాడు? అది నిజం కాబట్టే సైలెంట్‌గా ఉన్నాడు. మీ తమ్ముడు మా అమ్మాయిని నేరుగా మా ఇంటికి బైక్ మీద తీసుకు వచ్చాడు' అని అంటుంది. అప్పుడు బాలును రవి బలవంతంగా బయటకు తీసుకు వస్తాడు. అప్పుడు బాలు 'నాన్నను ఎంతలా అవమానించాడో తెలిసి కూడా వాళ్ల అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావా? అసలు స్నేహమేనా? లవ్ కూడా ఉందా' అని అడుగుతాడు. అప్పుడు రవి 'అసలు ఆ అమ్మాయి చాలా మంచిది. నిన్ను కేసు నుంచి విడిపించింది కూడా శృతినే' అని చెబుతాడు.
రవి మాటలకు కరగని బాలు 'ఇంకెప్పుడూ ఆమెతో మాట్లాడొద్దు. కలవొద్దు. నాన్నకు ఈ విషయం అస్సలు తెలియకూడదు' అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మీనా 'ట్రిప్ లేదా? తొందరగా వచ్చేశారేంటి. ఏమైంది అలా ఉన్నారు. ఏదో జరిగింది అదేంటో చెప్పండి' అంటూ విసిగిస్తుంది. దీనికి ఆమెపై బాలు ఓ రేంజ్‌లో సీరియస్ అవుతూ అరుస్తాడు. అప్పుడామె ఏడుస్తూ వెళ్లిపోతుంది. కాసేపటికి తేరుకున్న బాలు ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆమె మాత్రం అలిగి వెళ్లిపోతుంది.
మీనా వెళ్లిపోవడంతో బాలునే అన్నం పెట్టుకుని తింటుంటాడు. అప్పుడు సత్యం అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీంతో ఆమె అలిగిందని చెబుతాడు. అప్పుడు సత్యం 'పెళ్లాం అలిగితే బుజ్జగించాలి' అని అంటాడు. దీనికి బాలు 'పెళ్లాం అలిగిందని బ్రతిమాలుకుంటూ వెళ్తే.. వాళ్లు చీటికి మాటికి అలుగుతారు. ఏ ఇది నిజం కాదా' అని అంటాడు. దీంతో సత్యం 'నిజమే అనుకో. మీనా లాంటి సర్ధుకుపోయే భార్య దగ్గర తగ్గితే తప్పే లేదురా. శ్రీకృష్ణుడు వంటి వాళ్లకే తప్పలేదు' అంటాడు. అప్పుడు బాలు ఆమెను బుజ్జగించేందుకు వెళ్తాడు.

కోపంతో ఉన్న మీనాను బాలు బుజ్జగిస్తుండగా ఆమె అన్నీ పగలగొడుతుంది. అంతలో సత్యం అక్కడకు వచ్చి 'ఎందుకు ఆగావు విసిరెయ్' అంటాడు. దీంతో మీనా మందు బాటిల్ విసరబోతుంటే బాలు ఆపడంతో పాటు చివరకు తన మాటలకు ఆమెను నవ్విస్తాడు. మరోవైపు ఉదయాన్నే మనోజ్ రెడీ అవుతూ.. 'కింగ్‌లా బతకాల్సిన వాడివి దొంగలా బతుకున్నావు. ఎన్ని రోజులు లేని జాబ్‌ను ఉన్నట్లు నటిస్తావు' అనుకుంటాడు. అంతలో రోహిణి వచ్చి అతడితో మంచిగా మాట్లాడుతుంది. అంతేకాదు, ఇంకా ఎక్కువ కష్టపడి బాగా డబ్బు సంపదించాలంటుంది.
మంచిగా సంపాదించి హ్యాపీగా ఉంటే హనీమూన్‌కు వెళ్దామని రోహిణి చెబుతుంది. తర్వాత మనోజ్ అక్కడి నుంచి వెళ్తుండగా బాలు చికెన్ తీసుకుని ఎదురు వస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఫన్నీగా గొడవ జరుగుతుంది. అప్పుడు బాలు 'ఆయిల్ ఎక్కువగా వేసి వండు. అలా ఉంటే ఎవరూ తినరు' అంటాడు. దీంతో మనోజ్ వెళ్లిపోతాడు. తర్వాత అతడు నేరుగా కార్ షోరూంకు వెళ్తాడు. ఆ షోరూం ఓనర్ మనోజ్‌ను అవమానిస్తూ మాట్లాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











