Gunde Ninda Gudi Gantalu August 21st: దొంగతనం చేస్తూ దొరికిన మనోజ్.. కథలో ఊహించని ట్విస్ట్
జనరేషన్లు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రవిపైకి రౌడీలను పంపించడంతో బాలు నేరుగా సురేంద్ర ఇంటికి వెళ్లి ఆయనను కొడతాడు. ఆ సమయంలో సురేంద్ర వాళ్లు రవి తమ అమ్మాయి వెంట పడుతున్నాడని చెబుతారు. దీనికి రవి మౌనంగా ఉండడంతో బాలుకు విషయం అర్థం అవుతుంది. అనంతరం అదే కోపంతో ఇంటికి వచ్చిన అతడు మీనాపై అరుస్తాడు. తర్వాత ఆమె అలగడంతో బుజ్జగిస్తాడు. ఇక, మనోజ్ జాబ్ పోవడంతో బాధగా ఉంటాడు. అప్పుడు రోహిణి అతడిని ఇంకా టెన్షన్ పెట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత మనోజ్ తన పాత కార్ షోరూంకు వెళ్లి ఉద్యోగం అడిగే ప్రయత్నం చేస్తాడు.



Click it and Unblock the Notifications











