Gunde Ninda Gudi Gantalu August 22nd: ఆ జంటను కలిపిన మీనా.. ఇంట్లో డబ్బంతా మాయం.. కథలో బిగ్ ట్విస్ట్
ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కార్ షోరూంకు వచ్చిన మనోజ్.. ఆ ఓనర్‌ను తనకు రావాల్సిన శాలరీ ఇవ్వమని అడుగుతాడు. కానీ, ఆయన మాత్రం ఇవ్వనని తేల్చేస్తాడు. దీంతో గొడవపడుతూ మనోజ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత రవికి శృతి కాల్ చేస్తుంటే అతడు లిఫ్ట్ చేయడు. దీంతో మీనాకు కాల్ చేసి రవి గురించి అడుగుతుంది. అప్పుడామె చికెన్ చేస్తున్నాను.. అయిన వెంటనే తీసుకొస్తాను అని రవితో కలిసి వెళ్తుంది. అప్పుడు మీనా గతంలో ఆపేసిన డబ్బింగ్ చెప్తుండగా.. శృతి, రవిని నిలదీస్తుంది. దీంతో అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమెకు ఐలవ్యూ అంటూ చెప్పేస్తాడు.

గురువారం ఎపిసోడ్‌లో... మనోజ్ ఇంటికి వచ్చే సరికి రోహిణి బట్టలు సర్ధుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకని మనోజ్ అడగ్గా హనీమూన్ కోసం అని సమాధానం చెప్తుంది. తర్వాత ఆమె పెట్టుకుంటున్న వస్తువులు చూసి అతడు షాక్ అవుతాడు. అనంతరం రోహిణి 'ఇంతకీ అండమాన్‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశావా' అని అడుగుతుంది. దీంతో చాలా సేపు మౌనంగా ఉన్న తర్వాత అతడు చేశానని అబద్దం చెబుతాడు. అప్పుడు రోహిణి బాగా ఉత్సాహపడుతుంటే 'నువ్వు మలేషియాలో చాలా సార్లు ఫ్లైట్ ఎక్కావు కదా' అనడంతో ఆమె కవర్ చేసుకుంటుంది.
ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా మీనాను కూడా తినమని రవి అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం బాలు వచ్చాకనే తింటా అంటుంది. అది విన్న సత్యం తన భార్య ప్రభావతిపై పంచులు వేస్తాడు. దీనికామె 'ఇప్పుడంటే మీ కోడలు వచ్చింది. అంతకు ముందు నేనే కదా అన్నీ పెట్టేదాన్ని' అంటుంది. అంతలోనే అక్కడకు బాలు వచ్చి చికెన్‌ను తన పార్టీ వాళ్లు మాత్రమే తినాలని అంటాడు. అప్పుడు ప్రభావతి 'అసలు ఈరోజు శనివారం. నువ్వు కూడా చికెన్ తినొద్దు' అని తేల్చి చెప్పేస్తుంది. దీంతో బాలు అలిగి అన్నం తినకుండానే వెళ్లిపోతాడు.

రోహిణి ఫ్లైట్ టికెట్ల గురించి అడగడం, దానికి అబద్దం చెప్పడాన్ని మనోజ్ పదే పదే గుర్తు చేసుకుంటూ.. 'ఇప్పుడెలా జీతం రాదు. డబ్బులు లేవు. టికెట్లు బుక్ చేశానని అబద్ధం చెప్పాను. ఈ నిజం తెలిస్తే రోహిణి ఊరుకోదు. బాలుకు నా ఉద్యోగం పోయిందని తెలిస్తే నా పరువు తీసేస్తాడు. అమ్మను అడుగుదాం అనుకుంటే వడ్డీకే డబ్బులు లేవని బాధపడుతుందే' అని అనుకుంటాడు. అంతలోనే సత్యం.. ప్రభావతికి ఇచ్చిన డబ్బు గురించి మనోజ్‌కు గుర్తు వస్తుంది. దీంతో ఆ డబ్బులను ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేసుకుంటాడు.
తర్వాత 'డబ్బులు ఎందుకు లేవు.. నాన్న లక్ష రూపాయలు తెచ్చాడుగా. అవి ఎలాగైనా తీసుకుని టికెట్లు బుక్ చేయాలి. రోహిణి ముందు పరువు నిలబెట్టుకోవాలి. తర్వాత సంగతి తర్వాత' అనుకుంటూ ప్రభావతి గదిలోకి వెళ్లబోతాడు. మరోవైపు బాలు శనివారం చికెన్ తినొద్దని అనడంతో 12 గంటలు ఎప్పుడు అవుతుందా అని గడియారం వైపు చూస్తూ ఉంటాడు. ఇక, శనివారం పోయి ఆదివారం రావడంతో సంతోషంగా మీనాను నిద్ర లేపుతాడు. కానీ, ఆమె మాత్రం రొమాన్స్ చేయడం కోసం నిద్ర లేపుతున్నాడని అనుకుని పిల్లల గురించి మాట్లాడుతుంది.
మీనా మాటలకు బాలు 'చికెన్ తింటే పిల్లలు పుడతారా' అని అంటాడు. దీనికామె 'పిల్లలైతే వద్దు కానీ చికెన్ అయితే కావాలి' అంటూ అతడికి వడ్డించేందుకు వెళ్తుంది. అదే సమయంలో మనోజ్.. ప్రభావతి, సత్యం పడుకున్న గదిలోకి వెళ్తాడు. అప్పుడు బీరువా పైన తాళాలు లేవని గుర్తించిన మనోజ్.. ప్రభావతి వేసుకున్న పిల్లో కింద చేయి పెట్టి చూస్తాడు. అక్కడ అతడికి బీరువా తాళాలు కనిపిస్తాయి. అవి తీసుకుందామని మనోజ్ చేయి పెట్టగానే ప్రభావతి తిరుగుతుంది. దీంతో మనోజ్ చేయి పిల్లో కింద ఇరుక్కుని ఉంటుంది. అప్పుడతను ఎంతో టెన్షన్ పడతాడు.

కాసేపు చేయి తీయకుండా అలాగే ఉన్న మనోజ్.. ప్రభావతి మరో పక్కకు తిరగడంతో తాళాలు తీసుకుని బీరువాను ఓపెన్ చేస్తాడు. అలాగే, అందులో ఉన్న డబ్బులను తీసుకుని వెళ్లబోతుంటే ప్రభావతి నిద్రలో 'ఒరేయ్ మనోజ్ ఆగరా. నిన్నేరా ఆగు. రేయ్ మనోజ్ ఎప్పుడురా నువ్వు కోటీశ్వరుడివి అయిపోతావు. చెప్పరా చెప్పు' అంటూ కలవరిస్తుంది. దీంతో సత్యం నిద్ర లేచి ఆమెకు మెళకువ వచ్చేలా చేస్తాడు. తర్వాత ప్రభావతి వాళ్లు నిద్రపోగానే మనోజ్ అక్కడి నుంచి జారుకుంటాడు. అంతలోనే అక్కడకు బాలు, మీనా కలిసి వస్తుంటారు. దీంతో మనోజ్ దాక్కుంటాడు.
అనంతరం బాలుకు మీనా అన్నం వడ్డిస్తుంది. దీంతో మనోజ్ చిన్నగా ఫ్రిడ్జ్ పక్కకు వచ్చి దాక్కుంటాడు. అప్పుడు ఏదో సౌండ్ రావడంతో మీనా వెళ్లి చూడబోతుంది. అది గమనించిన మనోజ్ పిల్లిలా అరుస్తాడు. దీంతో బాలు గ్లాస్ విసిరేయడంతో అది వెళ్లి మనోజ్ తలపై తగులుతుంది. అన్నం తినేసిన తర్వాత బాలు, మీనా తమ గదిలోకి వెళ్లిపోతారు. అప్పుడు మనోజ్ బయటకు వచ్చి గదిలోకి వెళ్తాడు. ఇక, ఉదయం కాగానే ప్రభావతికి ఫైనాన్సియర్ కాల్ చేసి వడ్డీ డబ్బులు అడుగుతాడు. దీంతో ఆమె బీరువా ఓపెన్ చేసి చూడగా డబ్బు ఉండదు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











