Gunde Ninda Gudi Gantalu August 23rd: బీరువా చూసేసిన ప్రభావతి.. దొంగ అతడే అని.. వాళ్లు రావడంతో ట్విస్ట్
ఇప్పుడు ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
షోరూం ఓనర్‌తో గొడవపడి వచ్చిన మనోజ్‌తో రోహిణి హనీమూన్‌కు ఎలాగైనా టికెట్లు బుక్ చేయమని చెబుతుంది. దీంతో అతడు డబ్బు ఎలా తీసుకు రావాలని ఆలోచిస్తాడు. అప్పుడే తన తండ్రి తెచ్చిన లక్ష రూపాయలు గుర్తుకు వచ్చి.. వాటిని దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తగ్గట్లుగానే అందరూ పడుకున్న తర్వాత ఆ డబ్బు తీసుకుంటాడు. కానీ, ఆ సమయంలోనే బాలు, మీనా అక్కడకు వస్తారు. బాలు చికెన్ ఇష్టం అని వండించుకుంటే శనివారం అని ప్రభావతి తినొద్దని చెప్తుంది. అందుకే ఆ రాత్రి సమయంలో వచ్చి తింటాడు. అప్పుడు మనోజ్ దాక్కుంటాడు.

శుక్రవారం ఎపిసోడ్‌లో.. మనోజ్ డబ్బు దొంగిలించిన తర్వాత విషయం తెలియని ప్రభావతి బీరువా అంతటా వెతుకుతుంది. కానీ, అవి కనిపించవు. అప్పుడు వెంటనే కంగారు సత్యం దగ్గరకు వచ్చి 'ఏవండీ మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు కదా. మళ్లీ మీరేమైనా తీసుకున్నారా' అని అడుగుతుంది. దీంతో సత్యం కంగారుగా 'అదేంటి పెళ్లికి అయిన అప్పు తీర్చడం కోసం దాచాను అన్నావు కదా' అంటాడు. అప్పుడు ప్రభావతి కంగారుగా ఇంట్లో వాళ్లు అందరినీ పిలుస్తుంది. ఆమె సూటిగా అడగడంతో అందరూ తమకు తెలియదంటే తెలియదు అంటారు.
డబ్బు గురించి అందరూ మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన బాలు.. మనోజ్‌ను డౌట్‌గా చూస్తుంటాడు. అప్పుడు 'నాన్న నేను అప్పుడే చెప్పాను కదా. ఆ లక్షను ఎవరికీ ఇవ్వొద్దు అన్నాను కదా. అప్పుడు వీడు ఆ లక్షను ఎంత ఆశగా చూశాడో తెలుసా' అంటాడు. దీంతో రోహిణికి కోపం వస్తుంది. అప్పుడు ప్రభావతి 'సర్లే మీ గోల ఆపండి. ఇంట్లో వాళ్లు ఎవరూ ఆ డబ్బు తీయలేదు. మరి బయటి నుంచి మన ఇంట్లోకి ఎవరు వచ్చారు' అని ఆలోచిస్తుంది. అంతలోనే ఆమెకు మీనా తమ్ముడు గతంలో వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది.

కాసేపు ఆలోచించుకున్న తర్వాత మీనా దగ్గరకు వెళ్లిన ప్రభావతి 'హా.. నాకు అర్థం అయింది. బయటి వాళ్లు ఎవరూ రాలేదు. నీ తమ్ముడే వచ్చాడు. వాడే ఆ డబ్బును తీసి ఉంటాడు. వీధిలో ఉన్న బండిని తీసుకు వెళ్లిన వాడికి.. ఇంట్లో డబ్బు తీయడం ఒక లెక్కా' అంటుంది. అప్పుడు మీనా, బాలు అలా జరగదు అని చెప్పినా మనోజ్ వాళ్ల అమ్మకు సపోర్ట్ చేస్తాడు. దీంతో రవి కూడా మీనా తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు బాలు 'కాళ్లు చేతులు సరిగా ఉన్న నువ్వే నలభై లక్షలు మింగావు కదా. ఇవి కూడా నువ్వే తీసుకు వెళ్లి ఉంటాడు' అని అంటాడు.
బాలు మాటలకు రోహిణి 'బాలు తరచూ మనోజ్ మీద నిందలు వేస్తావు ఎందుకు? ఆ నలభై లక్షలు ఎవరో మోసం చేసి తీసుకు వెళ్తారు. కచ్చితంగా మీనా తమ్ముడే తీసుకు వెళ్లి ఉంటాడు' అంటుంది. అప్పుడు బాలు 'ఒక్కసారి చేస్తే ఇంక మారరా? నాకు వీడి మీదే డౌట్. నాకు ఒక కర్ర ఇచ్చి మనోజ్ గాడిని గదిలోకి పంపించండి. నిజం చెప్పిస్తాను. వీడేమైనా గతంలో పక్కింట్లో నుంచి డబ్బు తీసుకు వెళ్లాడా? ఇంట్లో నుంచే కదా. ఆ చూపు చూడండి ఎలా చూస్తున్నాడో' అంటాడు. దీంతో ప్రభావతి అనవసరంగా మనోజ్‌ను ఇందులోకి లాగొద్దు అంటుంది.

అంతేకాదు, శివ మీద కేసు పెడతానని ప్రభావతి అంటుంది. అప్పుడు బాలు 'చిన్న వయసులోనే పోలీసు కేసులు పెడితే వాళ్ల లైఫ్ ఎలా అవుతుందో నాకు తెలుసు నాన్నకు తెలుసు' అంటాడు. అప్పుడు రవి 'మా వెయిటర్ వాళ్ల నాన్న అంజనం వేసి ఎవరు దొంగిలించారో చూపిస్తారంట. ఒకసారి చూపిద్దాం' అంటాడు. దీంతో అందరూ వెళ్లిపోతారు. కానీ, ప్రభావతి మాత్రం శివనే ఆ డబ్బు తీశాడని అనుకుంటుంది. ఆ వెంటనే పార్వతమ్మకు కాల్ చేసి 'ఊరికనే వచ్చిన డబ్బులు కదా. ఏ టూర్ వెళ్లడానికి ప్లాన్ చేశారు' అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.
ఆ తర్వాత ప్రభావతి 'నీ కొడుకు నా ఇంటికి వచ్చి బీరువాలో నుంచి లక్ష రూపాయలు తీసుకు వెళ్లాడు' అంటుంది. దీంతో పార్వతమ్మ 'నా కొడుకు చచ్చినా అలా చేయడు' అని అంటుంది. దీంతో ప్రభావతి 'మర్యాదగా నీ కొడుకు ఎత్తుకొచ్చిన లక్ష తీసుకు వచ్చి ఇవ్వండి. లేదంటే పోలీసులు మీ ఇంటికి వస్తారు' అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడు పార్వతమ్మ.. శివను పిలిచి విషయం చెప్తుంది. దీంతో గతంలో తనకు ఇంట్లో జరిగిన అవమానం గురించి చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి అక్కడకు వెళ్లి తేల్చేద్దాం అని పార్వతమ్మ చెప్పి పిల్లల్నీ తీసుకుని వెళ్తుంది.

పార్వతమ్మ వాళ్లు రాగానే మీనా వచ్చి వెళ్లిపోమంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్లను ఇంకా అవమానిస్తుంది. అంతేకాదు, 'ఇలాంటి పనులు చేసి బతకండి కంటే చావడం నయం' అంటుంది. దీంతో పార్వతమ్మ కూడా సీరియస్ అవుతూ 'నా కొడుకును చావమని అనడానికి మీరు ఎవరండి. మీనాను మీరు అంటున్నారు అని తట్టుకోలేక వచ్చాడు' అని ఏడుస్తుంది. అంతలోనే బాలు, సత్యం వచ్చి ఏమైందని అడుగుతారు. అప్పుడు కూడా ప్రభావతి తగ్గకుండా 'నేనే రమ్మన్నాను. అది నా డబ్బు' అంటుంది. దీంతో బాలు అది మా నాన్న డబ్బు అంటాడు.
తర్వాత ప్రభావతి ఇంకా పార్వతమ్మ వాళ్లను అవమానిస్తుంది. దీంతో సత్యం ఆమెపై సీరియస్ అవుతాడు. అప్పుడు ప్రభావతి 'మర్యాదగా తీసిన డబ్బు ఇస్తే సరే సరి. లేకపోతే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను' అంటుంది. దీంతో మీనా 'అత్తయ్యా వీడు చదువుకుంటోన్న కుర్రాడు. మా ఆశలన్నీ వీడి మీదనే పెట్టుకుంది. మీరు కేసు అంటే వీడి భవిష్యత్ సర్వనాశనం అవుతుంది' అంటుంది. అప్పుడు శివ కూడా నేనేమీ తప్పు చేయలేదని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు బాలు అతడిని ఓదార్చుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











