Gunde Ninda Gudi Gantalu August 24th: మనోజ్‌ను పట్టించిన సీల్.. కథలో దిమ్మతిరిగే మలుపు
మిగిలిన అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మనోజ్ డబ్బు దొంగిలించిన తర్వాత విషయం తెలియని ప్రభావతి బీరువా అంతటా వెతుకుతుంది. కానీ, అవి కనిపించవు. దీంతో ఆమె ఇంట్లో కంగారు పడుతూ అందరినీ పిలిచి అడుగుతుంది. అలా ఇంట్లో వాళ్లందరినీ ప్రశ్నించిన తర్వాత మీనా తమ్ముడు శివ మాత్రమే బయటి వ్యక్తి వచ్చాడని, డబ్బులు కూడా అతడే తీసి ఉంటాడని నిందలు వేస్తుంది. అప్పుడు మనోజ్, రోహిణి తప్ప మిగిలిన వాళ్లంతా శివకు సపోర్ట్ చేస్తారు. దీనికితోడు బాలు కూడా మనోజ్ గురించి మాట్లాడుతూ ఎదురు తిరగడంతో ప్రభావతితో పాటు అందరూ అక్కడితో ఆ గొడవను ఆపేస్తారు.

డబ్బులు పోయిన తర్వాత ప్రభావతి ఊరుకోకుండా పార్వతమ్మకు కాల్ చేసి శివ తమ ఇంట్లో డబ్బు కాజేశాడని చెబుతుంది. అలాగే, పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరిస్తుంది. దీనికామె ఎంతగానో ఫీల్ అవుతుంది. అంతేకాదు, అప్పుడే వచ్చిన శివతో అసలు విషయం చెప్తుంది. దీంతో ఆరోజు ప్రభావతి ఇంట్లో తనకు జరిగిన అవమానం గురించి శివ తన తల్లికి వివరిస్తాడు. అంతేకాదు, అక్కడకు వెళ్లి పంచాయతీ పెట్టి తేల్చుకుందాం అని అంటాడు. ఆ వెంటనే అందరూ కలిసి ప్రభావతి ఇంటికి వెళ్తాడు. అలా వెళ్లిన తర్వాత అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది.
శివ వాళ్లను ప్రభావతి అవమానిస్తూ మాట్లాడడంతో బాలు వచ్చి రచ్చ లేపుతాడు. అంతేకాదు, చదువుకునే కుర్రాడిపై కేసులు అంటావేంటి అంటూ తల్లిపై ఎదురు తిరుగుతాడు. మీనా కూడా బాధపడుతూ ఇక వదిలేయమని అడుగుతుంది. అయినా ప్రభావతి మాత్రం అస్సలు తగ్గకుండా వాళ్లను అవమానిస్తూనే మాట్లాడుతుంది.
రాబోయే ఎపిసోడ్‌లో.. ఇంట్లో లక్ష రూపాయల గురించి పంచాయతీ జరుగుతూ ఉండగానే ఓ వ్యక్తి వచ్చి మనోజ్‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశానని కవర్ ఇస్తాడు. అయితే, అది కోర్టు సీలుతో ఉన్న కవర్ కావడంతో బాలు దాన్ని గమనిస్తాడు. అంతేకాదు, మనోజ్ ఆ డబ్బులు కాజేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడన్న నిజం అందరికీ తెలిసిపోతుంది. దీంతో వచ్చే ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











