Gunde Ninda Gudi Gantalu August 27th: మామకు షాకిచ్చిన మీనా.. మనోజ్‌‌కు బడిత పూజ.. రోహిణి ఏం చేసిందంటే!

ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
లక్ష రూపాయల గురించి తనకు తెలియదని శివ చెబుతున్నా ప్రభావతి మాత్రం వినదు. దీంతో అతడు 'బైక్ దొంగిలించడంతో మా నాన్నను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత మారిపోయాను' అని ఏడుస్తాడు. అయినా ఆమె మాత్రం అనుమానపడుతూనే ఉంటుంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశానని, మిగిలిన డబ్బు ఇదిగో అంటూ మనోజ్‌కు ఇస్తాడు. ఆ కవర్ చూసి గుర్తు పట్టిన బాలు.. అసలు దొంగ మనోజ్ అని కనిపెడతాడు. దీంతో ప్రభావతి యాక్టింగ్ చేస్తూ మనోజ్‌కు తానే డబ్బు ఇచ్చానని అంటుంది. తర్వాత పార్వతమ్మ వాళ్లకు క్షమాపణలు చెప్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 27th

మంగళవారం ఎపిసోడ్‌లో... ప్రభావతి చెప్పిన మాటలకు బాలు వెరైటీగా సెటైర్లు వేస్తుంటాడు. అప్పుడు సత్యం 'దాని లైఫ్‌లో తొలిసారి తప్పు చేసి.. తప్పు చేశానని ఒప్పుకుందిరా. ఎందుకురా చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపుతావు' అని అంటాడు. దీనికి బాలు 'అమ్మ పాము కాదు నాన్న అనకొండ' అంటాడు. దీంతో సత్యం 'ఇంకెందుకురా.. ఈ బాబు తప్పు చేయలేదని తేలిపోయింది. ఇంకెప్పుడూ తప్పు చేయదు. చేస్తే నా చేతిలోనే చచ్చిపోతుంది. అమ్మా పార్వతమ్మ మా కుటుంబం తరపున మీ కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాను' అంటాడు.

పార్వతమ్మను క్షమాపణ అడిగిన తర్వాత సత్యం అందరికీ కాఫీ ఇవ్వమని అంటాడు. దీంతో మీనా 'వద్దు మామయ్య. నేను కాఫీ ఇస్తే వాళ్లు తాగే సమయంలో ఇక్కడ ఏమైనా పోతే వాళ్ల మీదే నిందలు వేస్తారు' అంటుంది. దీనికి సుమతి కూడా సపోర్ట్ చేయడంతో బాలు వచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. దీంతో పార్వతమ్మ వాళ్లు వెళ్లిపోతారు. అనంతరం బాలు 'ఏం నాటకం ఆడావు తల్లి. ఇంటి గుట్టును ఇంట్లోనే బొందపెట్టింది ఈ బంగారు తల్లి' అని వెళ్లిపోతాడు. ఆ వెంటనే రోహిణి కూడా అసహ్యించుకుంటూ వెళ్లిపోతుంది. దీంతో మనోజ్, ప్రభావతి మిగిలిపోతారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 27th

ఆ వెంటనే ప్రభావతి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే మనోజ్ కూడా వస్తాడు. అప్పుడు అతడిని తలుపులు వేయమని సైగలు చేస్తుంది. అలా తలుపులు మూసిన వెంటనే మనోజ్‌ను ప్రభావతి పిచ్చ కొట్టుడు కొడుతుంది. అంతేకాదు, 'ఎంత పని చేశావురా? ఎన్ని తల వంపులు తెచ్చావురా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను. అందరి ముందు నా పరువు తీస్తావా' అని అంటుంది. దీంతో మనోజ్ 'ఏం చేయమంటావు అమ్మా? రోహిణి హనీమూన్‌ కోసం బట్టలు సర్థుకుంటుంది. ఉద్యోగం కూడా లేదు. నేను ఏం చేయాలి' అని అంటాడు.

మనోజ్ మాటలకు ప్రభావతి 'నీవల్ల ఈ ప్రభావతి ముందు నిలబడడానికి కూడా గడగడలాడిపోయే వాళ్ల ముందు మాటలు పడ్డాను కదా. నీవల్ల ఎందుకూ పనికి రాని వాళ్ల ముందు తల దించుకుని నిలబడ్డాను కదా. నువ్వు గానీ దొరికిపోతే అందరి ముందు నిన్ను బజారున పడేసేవాడు. ఇప్పుడు ఏ ఒక్కరైనా నాకు విలువను ఇస్తారా? నిన్ను ఇంత ప్రేమగా పెంచినందుకు నీ వల్ల నాకు ఏమి దక్కిందిరా' అని నిలదీస్తుంది. దీంతో మనోజ్ 'ఇంకెప్పుడూ నీకు తలవంపులు తెచ్చే పని చేయనమ్మా' అంటూ ఏడుస్తాడు. దీంతో ప్రభావతి కూడా ఏడుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 27th

మనోజ్‌తో ప్రభావతి 'ముందు నువ్వు ఏదో ఒక ఉద్యోగం చూసుకోరా. సంపాదన లేని వాడిని పెళ్లాం కూడా చేతకాని వాడిలా చూస్తుంది' అని అంటుంది. దీంతో మనోజ్ జాబ్ చూసుకుంటాను అని చెబుతాడు. తల్లితో మాట్లాడిన తర్వాత మనోజ్ తన గదిలోకి వస్తాడు. అప్పుడు రోహిణి కోపంగా ఉంటుంది. అంతేకాదు 'నీకు కన్నీళ్లు ఎందుకు వచ్చాయి' అని అడుగుతుంది. దీంతో మనోజ్ 'అమ్మ మనకు డబ్బులు ఇచ్చి మర్చిపోయి అందరి ముందు దోషిగా నిలబడినందుకు బాధగా అనిపించింది' అంటాడు. దీంతో రోహిణి ప్రశ్నలు వేయగా మనోజ్ వెళ్లిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 27th

తన తమ్ముడితో ప్రభావతి మాట్లాడిన తీరును గుర్తు చేసుకుని మీనా.. శివకు ఫోన్ చేస్తుంది. అప్పుడు తన అత్త తరపున సారీ చెప్తుంది. దీంతో శివ దీనంగా మాట్లాడతాడు. అప్పుడు మీనా 'నువ్వు అప్పుడెప్పుడో చేసిన తప్పుకు నాన్నను కోల్పోయాం. ఇప్పుడు ఈ నిందలు పడుతున్నాయి. ఒక్కసారి తప్పు చేస్తే ఎప్పటికీ ఇలాగే అవమానాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మా అత్తగారు లాంటి వాళ్ల నుంచి ఇలా వస్తుంటాయి. నువ్వు మంచిగా చదువుకుని గొప్పవాడివి అవ్వాలి. నువ్వు బయట తిరగకుండా ఇంటికి వెళ్లి అమ్మను, చెల్లిని ఓదార్చు' అని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 27th

బాలు వచ్చేసరికి మీనా డల్‌గా ఉండడంతో 'ఆ లక్షలు మింగిన వాడి తల్లి ఏమైనా అనిందా' అని అంటాడు. దీంతో మీనా 'అందరి మీద నిందలు వేశారు. ఈ లోకంలో లేని మా నాన్నను కూడా వదల్లేదు. మేము పేదవాళ్లం అనే కదా చీప్‌గా చూస్తున్నారు' అని ఏడుస్తుంది. దీంతో బాలు 'అవును మరి మాది కోటీశ్వరుల ఫ్యామిలీ' అంటాడు. అప్పుడు మీనా 'మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను ఏమి సుఖపడ్డాను' అని అడుగుతుంది. అలా ఆమె బాధపడగా బాలు తనదైన రీతిలో ఓదార్చుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X