Gunde Ninda Gudi Gantalu August 28th: శారీరకంగా ఒక్కటైన బాలు, మీనా.. రోహిణి నిజం కనిపెట్టేసిందా?

ఆడియెన్స్ టేస్ట్ అంతకంతకూ మారిపోతూనే ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభావతి తప్పు చేసిందని తెలిసిన తర్వాత మీనా అసహనంగా ఉంటుంది. అందుకే అందరికీ కాఫీ ఇవ్వమన్నా ఆమె వద్దని తన ఫ్యామిలీ వాళ్లను పంపించేస్తుంది. తర్వాత బాలు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ, మీనా మాత్రం తమను చులకనగా చూడడం బాధగా ఉందని అంటుంది. ఇక, మనోజ్ దొంగతనం గురించి తెలుసుకున్న ప్రభావతి.. అతడిని గదిలో పెట్టి యమా కొట్టుడు కొడుతుంది. దీంతో తాను మారతానని అంటాడు. తర్వాత తమ గదిలోకి వెళ్లగానే రోహిణి.. మనోజ్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో అతడు తనను ఏమీ అడగొద్దని చెప్పి వెళ్లిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 28th

బుధవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో.. బాలు 'నాకు తిట్టడం, అరవడం, ఎగతాళి చేయడం తప్ప ఇలాంటి మంచి మాటలు వస్తాయని నాకు కూడా తెలియదు. ఎందుకు ఇంకా బాధపడుతున్నావు' అని మీనాను హత్తుకుంటాడు. అప్పుడామె 'లేదండీ. నా గుండెల్లో ఉన్న బాధ అంతా పోయింది. మీరు ఇలా ధైర్యాన్ని ఇస్తే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చు అని నమ్మకం నాకు కలిగింది. ఈ భరోసా కోసమే నేను ఇంత కాలం ఎదురు చూశాను' అని ఏడుస్తుంది. ఆ వెంటనే బాలు బుగ్గపై మీనా ముద్దు పెడుతుంది. దీంతో అతడు షాక్ అయిపోతాడు.

మీనా ముద్దు పెట్టి హగ్ చేసుకోవడంతో బాలు కూడా టెంప్ట్ అయిపోతాడు. ఆ వెంటనే ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఇక, ఉదయాన్నే బాలు రూమ్‌లో నుంచి బయటకు వస్తూ.. 'అమ్మో.. జరగరానివి అన్నీ జరిగిపోతున్నాయి. కొంపదీసి ఆ పంతులు చెప్పినవి అన్నీ జరిగిపోయేలా ఉన్నాయి. అదే జరిగితే నలుగురు పిల్లలు పుట్టడం ఖాయం అనుకుంటా' అని భయపడిపోతాడు. ఆ వెంటనే అందరినీ పిలుస్తూ గట్టిగట్టిగా అరుస్తుంటాడు. దీంతో అందరూ వస్తాడు. అప్పుడు మీనా 'ఏమైందండీ.. ఎందుకు పిలిచారు' అని అడుగుతుంది.

బాలును అందరూ ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. అప్పుడతను 'ఇక నుంచి ఈ ఇంట్లో గొడవలు జరగడానికి వీలు లేదు. ఎందుకంటే వీటి వల్లే ఏదేదో జరిగిపోతుంది. అంతా తప్పు తప్పుగా జరుగుతోంది' అని అంటాడు. దీంతో ప్రభావతి 'వీడికి దెయ్యమో, భూతమో పట్టినట్లు ఉంది' అని చెప్తుంది. అప్పుడు బాలు 'నువ్వు ఉండగా దెయ్యాలు ఎలా వస్తాయి. అంతా వీడి పిండమూన్ వల్లే జరిగింది' అంటాడు. దీనికి అతడి చెల్లి 'అది పిండమూన్ కాదు.. హనీమూన్' అంటుంది. దీంతో రోహిణి 'మా హనీమూన్ గురించి మీకు ఎందుకు' అని అంటుంది.

రోహిణి మాటలకు బాలు 'మీరు హనీమూన్‌కు వెళ్లాలంటే మీ డబ్బులతో వెళ్లండి. మా నాన్న డబ్బులతో కాదు. నేను జాతరకు వెళ్లినా నా సొంత డబ్బుతో తీసుకు వెళ్తాను. కావాలంటే నువ్వు, నాన్న వెళ్లండి' అని ప్రభావతితో అంటాడు. దీనికామె 'ఈ డ్రైవర్‌తో హనీమూన్ కూడానా? ఈయన ఫ్రీ బస్ పాస్‌తో నాలుగు ఇళ్లకు తిప్పాడు' అని వెటకారంగా చెప్తుంది. అప్పుడు బాలు 'మీనా నీకు కూడా హనీమూన్‌కు వెళ్లాలని ఉందా' అని అడగడంతో ఆమె కూడా ఉంది అంటుంది. తర్వాత బాలు తన తండ్రి డబ్బులతో అందరికీ టికెట్లు బుక్ చేయమని అంటాడు.

బాలు అన్న మాటతో రవి 'లక్ష రూపాయలకు రెండు టికెట్లు మాత్రమే వస్తాయి అన్నయ్య' అని చెప్తాడు. దీనికతడు 'మా నాన్న డబ్బుతో నువ్వు వెళ్లడం కుదరదు' అనడంతో రోహిణి 'మనోజ్ శాలరీ రాగానే ఆ డబ్బు ఇచ్చేస్తాడు' అని చెప్తుంది. అప్పుడు సత్యం అతడికి సర్ధి చెప్పబోతాడు. దీంతో బాలు 'వాడికి లక్ష ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఇవ్వు. లేదంటే అమ్మ గాజులు అమ్మేసేయ్' అంటాడు. అలా అతడు గొడవ చేస్తుండడంతో రోహిణి 'ఆ డబ్బుతో నేను హనీమూన్‌కు రాను. ట్రిప్ క్యాన్సిల్ చెయ్' అని వెళ్లిపోతుంది. దీంతో ఈ గొడవ సర్ధుమణుగుతుంది.

బాలు చేసిన రచ్చతో కోపంగా గదిలోకి వచ్చిన రోహిణి.. మనోజ్ రాగానే 'నువ్వు అక్కడే దులిపేసుకుని వచ్చావా? బాలు గురించి నీకు తెలుసు కదా? ఇక్కడి దాకా ఎందుకు తీసుకు వచ్చావు? బాలు అన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్‌గా ఎందుకు వచ్చావు? అయినా అంత పెద్ద ఎమౌంట్ ఇచ్చి అత్తయ్య గారు ఎలా మర్చిపోయారు? మీనా వాళ్ల తమ్ముడిని పిలిచి అంత గొడవ చేసేదాకా గుర్తు రాలేదా? నిజం చెప్పు నీకు అంతా తెలుసు. మీరు ఏదో దాస్తున్నారు' అని అంటుంది. అంతలో ప్రభావతి వచ్చి మనోజ్‌కు సపోర్టుగా మాట్లాడుతుంది.

మనోజ్‌ను కాపాడాలని ప్రభావతి 'నా మైండ్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. కానీ, బాలు గాడు చేసిన రచ్చ వల్ల మర్చిపోయాను' అంటూ కవర్ చేస్తుంది. అప్పుడు రోహిణి నమ్మేస్తుంది. మరోవైపు శివ కాలేజ్‌కు వెళ్తుండగా బైక్ దొంగతనం చేసిన అతడి ఫ్రెండ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి అన్న మాటలను అతడు గుర్తు చేసుకుని జరిగింది మొత్తం చెబుతాడు. అనంతరం శృతి రెస్టారెంట్‌కు వచ్చి రవిని హగ్ చేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ మాట్లాడుతూ రొమాంటిక్‌గా చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X