Gunde Ninda Gudi Gantalu August 29th: మొత్తం వినేసిన రోహిణి.. మనోజ్ ఆఫీస్‌కు వెళ్లి.. కథలో బిగ్ ట్విస్ట్

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభావతి వాళ్లు చేసిన అవమానంతో బాధలో ఉన్న మీనాను బాలు ఓదార్చుతాడు. దీంతో కరిగిపోయిన ఆమె అతడిని హత్తుకుని ముద్దులు పెడుతుంది. అప్పుడు బాలు టెంప్ట్ అయిపోతాడు. అలా ఇద్దరూ మరోసారి శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తర్వాతి రోజు బాలు ఇకపై ఇంట్లో గొడవలు పెట్టొద్దని అంటాడు. అనంతరం మనోజ్ వాళ్లను లక్ష రూపాయలు అడుగుతాడు. దీంతో రోహిణి శాలరీ రాగానే ఇచ్చేస్తామని చెప్పి వెళ్లిపోతుంది. ఆ వెంటనే మనోజ్ ఆమె దగ్గరకు వెళ్లగా తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పుడు ప్రభావతి వెళ్లి అబద్దాలు చెప్పి కవర్ చేస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 29th

గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో.. రవిని కలిసేందుకు వచ్చిన శృతి 'నీకు పెళ్లి అంటే ఇష్టమా? లివింగ్ రిలేషన్‌షిప్ ఇష్టమా' అని అడుగుతుంది. తర్వాత 'నాకైతే రిలేషన్‌షిప్‌లో ఉండడమే ఇష్టం. అప్పుడైతే ఎలాంటి నిబంధనలు లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. కానీ, పెళ్లి చేసుకుంటే కండీషన్స్‌తో బతకాలి' అంటుంది. దీంతో రవి 'అంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? మీ నాన్న వాళ్లకు భయపడుతున్నావా? నాకైతే ఈ లివింగ్ రిలేషన్‌షిప్‌లు అంటే ఇష్టం ఉండదు. ప్రేమిస్తే ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సిందే' అని చెబుతాడు.

ఆ తర్వాత రవి 'నేనైతే మా నాన్నను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి' అంటాడు. దీంతో శ‌‌ృతి 'మనం అయితే మీ ఇంట్లో, మా ఇంట్లో మన బంధువులు అందరినీ ఒప్పించిన తర్వాతనే పెళ్లి చేసుకుందాం. నా మీద నమ్మకం వచ్చిందా' అని అడుగుతుంది. దీంతో రవిత తల ఊపుతాడు. మరోవైపు, ప్రభావతి, సత్యం ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా మనోజ్ వచ్చి అందరినీ పిలుస్తాడు. దీంతో కిందకు వచ్చిన బాలు 'నీ ఉద్యోగం పోయిందా? నీ జాతకం నిజం అయిపోయిందా' అంటూ అతడిపై పంచులు వేస్తాడు. అప్పుడు రోహిణికి బాగా కోపం వస్తుంది.

బాలు చేస్తున్న హడావిడితో మనోజ్ 'నేను నాన్న డబ్బులు వాడుకున్నా అని అన్నారు కదా. ఇప్పుడు ఆ డబ్బును మీ అందరి ముందు నాన్నకు ఇవ్వబోతున్నాను' అని చెబుతాడు. దీంతో ప్రభావతి షాక్ అవగా.. బాలు మాత్రం 'అన్నయ్య నువ్వు ఎంత ఎదిగిపోయావు' అంటూ సెటైర్లు వేస్తాడు. దీనికి ప్రభావతి వెటకారాలు ఆపండి అంటుంది. అప్పుడు బాలు 'అన్నయ్యా.. ఆ నలభై లక్షలు ఎక్కడా? ఓ నలభై ఒక్క లక్ష కదా. మీనా వెళ్లి ఆ బ్యాగ్ తీసుకురా' అంటాడు. దీంతో మనోజ్ 'ఆ నలభై లక్షలు అని నేనెప్పుడు చెప్పాను' అంటూ సమాధానం చెబుతాడు.

మనోజ్ 'అరెయ్ నేను ఇస్తానన్నది హనీమూన్ టికెట్ల కోసం తీసుకున్న లక్ష. ఇప్పుడు టికెట్లు క్యాన్సిల్ చేసి అవి తీసుకు వచ్చాను' అని చెప్తాడు. దీంతో సత్యం 'ఎందుకురా టికెట్లు క్యాన్సిల్ చేశావు? పాపం రోహిణిని అండమాన్ తీసుకెళ్తా అన్నావుగా' అంటాడు. దీంతో బాలు 'అండమాన్‌లో జైలు ఉంటుందని, అక్కడి వాళ్లు చూసి వీడిని అరెస్ట్ చేస్తారని భయం వేసి ఉంటుంది' అంటాడు. దీనికి రోహిణికి కోపం వచ్చి 'బాలు ఎందుకు ఏదేదో మాట్లాడతావు. మీ అన్నయ్య డబ్బు ఇచ్చాడు కదా. అయినా మనోజ్ నా మాట విన్నాడు సరిపోయింది కదా' అంటాడు.

రోహిణి మాటలకు మీనా 'ఎక్కడ సరిపోతుంది? అనవసరంగా ఏ పాపం తెలియని మా తమ్ముడిని దొంగను చేశారు కదా. తీసుకున్న బావగారు బానే ఉన్నారు.. ఇచ్చిన అత్తగారు మార్చిపోయారు. మధ్యలో వాడిని బలి చేశారు కదా. దానికి ఎవరు సమాధానం చెబుతారు' అని అంటుంది. దీనికి ప్రభావతి 'అయిపోయిన దాన్ని ఎందుకు లాగుతారు? అందుకే కదా నేను మీ వాళ్లకు సారీ చెప్పాను' అంటుంది. అనంతరం మనోజ్ డబ్బులు ఇవ్వగా దాన్ని బాలు లాక్కుంటాడు. అందులో నాలుగు వేలు తక్కువ ఉండడంతో మనోజ్‌ను బాలు అవమానిస్తాడు.

బాలు మాటలకు రోహిణి ఫీల్ అవుతుంది. దీంతో మీనా 'ఇప్పుడు నీకు బాధ తెలుస్తుందా? నన్ను బావగారు, నువ్వు అవమానించినప్పుడు నేనూ బాధపడ్డాను. నాకు కోపం వస్తుంది ఎందుకంటే ఈ ఇంటిని పోషించేది మా ఆయనే' అంటుంది. అప్పుడు రోహిణి 'ఇప్పుడేంటి ఆ నాలుగు వేలు ఇవ్వాలా? ఏంటి మనోజ్ శాలరీ వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పలేవా? అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా' అని తిట్టి డబ్బు తీసుకు వచ్చి బాలుకు ఇస్తుంది. ఇక, సత్యం చెప్పడంతో ఆ లక్ష రూపాయలను బాలు తన తల్లికి ఇస్తాడు.

అనంతరం బాలు ఇంట్లోకి రాగానే మీనా కోపంగా ఉంటుంది. ఏమైందని అడిగిన బాలుతో 'హనీమూన్‌కు తీసుకు వెళ్తానని చెప్పి మీరు మాట ఎందుకు మార్చారు' అంటూ కోప్పడుతుంది. దీంతో బాలు ఆమెను బుజ్జగిస్తాడు. ఆ తర్వాత మనోజ్ దొంగతనం చేశాడని తనకు డౌట్ ఉందని బాలు.. మీనాతో చెప్తాడు. అదంతా రోహిణి వింటుంది. అది మీనాకు తెలుస్తుంది. ఆ తర్వాత బాలు పార్కులో పడుకుని ఉంటాడు. కాసేపటికి నిద్ర లేచి ప్రభావతికి కాల్ చేస్తాడు. అప్పుడామె 'నువ్వు ఉద్యోగం చేయకుండా పార్కుల్లో ఉంటున్నావు ఎంత కాలం ఇలా' అంటుంది.

తల్లితో మాట్లాడిన తర్వాత మనోజ్ పార్కులో కూర్చుని భోజనం చేస్తాడు. అతడిలానే అందరూ అక్కడ భోజనం చేస్తుండగా చూసి మనోజ్ నవ్వుకుంటాడు. అనంతరం అతడు పడుకోగా రోహిణి మనోజ్ పని చేసే షోరూం ముందుకు వచ్చి ఫోన్ చేస్తుంది. అంతేకాదు, లోపలికి వస్తున్నానని చెబుతుంది. దీంతో షాకైన మనోజ్ తాను వేరే షోరూంలో ఉన్నానని అబద్దం చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X