Gunde Ninda Gudi Gantalu August 2nd: మీనాకు వాంతులు.. ఆస్తి మొత్తం బాలు పిల్లలకే.. ప్రభావతికి షాక్
ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
శృతి ఇంటికి వచ్చిన రవిని డీఎం వాళ్లు అవమానించినట్లుగా మాట్లాడతారు. దీంతో అతడు ఎదురుతిరిగి మరీ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత అతడు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే శృతి అక్కడకు రావడంతో ఆమెను రవితో తిరగొద్దని తల్లి చెబుతుంది. దీంతో ఆమె ఎదురు తిరుగుతుంది. అప్పుడు తండ్రి పక్కకు తీసుకు వెళ్లి రవి ఫ్యామిలీతో తమకు శత్రుత్వం ఉందని చెబుతాడు. అప్పుడు శృతి 'వాళ్ల నాన్నకు పెన్షన్ రాకుండా చేసింది నువ్వు. తప్పంతా నీదే అని నాకు అర్థం అయింది' అంటూ తల్లిదండ్రులకు పెద్ద షాక్‌నే ఇస్తుంది.

కోర్టులో కేసు గెలిచిన తర్వాత సత్యం, బాలు సంతోషంగా ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్లు కంగారుగా ఇంట్లోకి వెళ్లబోతున్న బాలును సత్యం ఆపుతాడు. అంతేకాదు, మీనాను పిలిచి 'అమ్మా.. ఉదయాన్నే నువ్వే నాకు ఎదురు వచ్చావు. వెళ్లిన పని అయిపోయింది' అని చెప్తాడు. దీంతో ఆమె సంతోషిస్తుంది. అనంతరం సత్యానికి దిష్టి తీయించమని బాలు అందరికీ చెప్తాడు. అందుకు తగ్గట్లుగానే మీనా వాళ్లు దిష్టి తీసి పిలుస్తారు. అప్పుడు ప్రభావతి.. సత్యంపై సెటైర్లు వేస్తుంటుంది. దీంతో బాలు వచ్చి ఆమెకు దిమ్మతిరిగే పంచులు వేస్తుంటాడు.
ప్రభావతి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండడంతో సత్యం వచ్చి 'నేను మా డీఎం మీద వేసిన కేసును గెలిచాను ప్రభావతి. అంతేకాదు, ఆయన నష్టపరిహారంగా నాకు లక్ష రూపాయలు జరిమానా ఇవ్వాలని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది' అని చెబుతాడు. దీంతో ప్రభావతి సంతోషిస్తుంది. అప్పుడు తన వల్ల, రోహిణి వల్లే ఈ కేసు గెలిచామని అంటుంది. కానీ, సత్యం మాత్రం ఉదయాన్నే కోర్టుకు వెళ్లే ముందు తనకు మీనా ఎదురు వచ్చిందని, అందుకే కేసు గెలిచామని అంటాడు. తర్వాత బాలు, ప్రభావతి మధ్య వాగ్వాదం జరుగుతుంది.

తర్వాత ప్రభావతి.. మనోజ్, రోహిణి బాగా సంపాదిస్తున్నారని అంటుంది. అప్పుడు బాలు పంచులు వేయగా రోహిణి సీరియస్ అవుతుంది. 'ఏంటి అత్తయ్యా ఇదీ.. ఎవరు అన్నా మర్యాద లేదు' అంటాడు. అప్పుడు మనోజ్ కూడా మాట్లాడడంతో బాలు వెళ్లి అతడి కాలర్ పట్టుకుంటాడు. దీంతో సత్యం అందరి మీద అరుస్తాడు. అంతేకాదు, 'రోహిణి నీకు వదిన అవుతుంది. ఆమెకు నువ్వు మర్యాద ఇవ్వాల్సిందే' అని బాలుకు తేల్చి చెప్తాడు. అప్పుడు మీనా కూడా రోహిణికి సపోర్ట్ చేస్తుంది. దీంతో ప్రభావతికి కోపం వస్తుంది.
ఆ గొడవ జరిగిన తర్వాత కేసు గెలిచిన శుభవార్తను సుశీలకు చెప్పమని సత్యానికి చెప్తుంది. దీంతో ఆయన వెంటనే కాల్ చేస్తాడు. అప్పుడామె మీనా, బాలు గురించే అడగడంతో ప్రభావతికి కోపం వస్తుంది. అనంతరం సత్యం కోర్టులో కేసు గెలిచిన విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పుడామె కూడా మీనానే పొగుడుతూ మాట్లాడుతుంది. తర్వాత మీనా, బాలు సంతోషంగా ఉన్నారని, త్వరలోనే నలుగురు పిల్లల్నీ కనాలని అంటుంది. ఇక, కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా తన దగ్గర ఉన్న పొలం, బంగారం ఇస్తానని అందరి ముందే సుశీలమ్మ చెబుతుంది.
సుశీలతో ఫోన్ మాట్లాడిన వెంటనే మీనాకు వాంతులు అవుతాయి. అది చూసిన ప్రభావతి 'అప్పుడే కడుపు వచ్చిందా' అని అనుకుంటుంది. తర్వాత కంగారు పడుతున్న బాలు కూడా ఏమైందని ఆమెను అడుగుతాడు. దీంతో 'ఉదయం ఏదో కొత్త వంటకం చేసి నాకు పెట్టారు. అప్పటి నుంచి కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వాంతులు అయ్యాయి' అని అంటుంది. దీంతో బాలు ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత మీనా, బాలు గదిలో సరదాగా గొడవ పడతారు. ఆ సౌండ్లు విని ప్రభావతి కుళ్లుకుంటుంది. ఇలా గురువారం ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











