Gunde Ninda Gudi Gantalu August 30th: ప్రభావతి ఇంటికి గూండాలు.. చూసేసిన బాలు, మీనా.. వర్ధన్ కాల్ చేయడంతో!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తన కోసం వచ్చిన శృతితో అందరూ ఒప్పుకుంటనే పెళ్లి చేసుకుంటాను అని రవి తేల్చి చెప్పేస్తాడు. దీనికామె కూడా ఓకే అంటుంది. అనంతరం మనోజ్ వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. అంతేకాదు, టికెట్లు క్యాన్సిల్ చేశానని, ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్తాడు. దీంతో బాలు అతడిని ఓ ఆట ఆడుకుంటాడు. ఆ తర్వాత అతడిని అవమానిస్తూ మాట్లాడడంతో రోహిణి కోపం వస్తుంది. అనంతరం రూమ్‌లోకి వచ్చిన మనోజ్‌పై ఫైర్ అవుతుంది. తర్వాత మనోజ్ గురించి బాలు వాళ్లు మాట్లాడుకునేది విన్న రోహిణి.. నేరుగా అతడి ఆఫీస్‌కు వెళ్తుంది. కానీ, అతడు అక్కడ ఉండడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 30th

శుక్రవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో.... రోహిణి కాల్ చేయడంతో మనోజ్ అబద్ధాలు చెప్పి ఆమెను పంపించే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆమె మాత్రం అక్కడే వెయిట్ చేస్తానని అంటుంది. దీంతో మనోజ్ 'ఇక్కడ చాలా మంది వీఐపీలు ఉన్నారు. రావడం చాలా లేట్ అవుతుంది. అందుకే నువ్వు వెళ్లి పార్లర్‌లో ఉండు. నేను వచ్చి కలుస్తాను' అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మనోజ్ 'ఎన్ని రోజులు ఇలా అబద్దాలు చెప్పి తప్పించుకోవాలో' అని అనుకుంటాడు. అంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి 'మీ ఇంట్లో నిజాలు తెలిసే వరకు' అనడంతో షాక్ అవుతాడు.

ప్రభావతికి కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి మలేషియా నుంచి కాల్ చేస్తున్నా అంటాడు. అంతేకాదు, రోహిణిని కూడా అడుగుతాడు. దీంతో ప్రభావతి 'అయ్యో మలేషియా నుంచా? అంటే అన్నయ్య గారా? అన్నయ్య గారు మీకోసం రోహిణి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. మొన్న ఫాదర్స్ డే రోజున కూడా మిమ్మల్ని ఊహించుకుని బాధపడింది' అని వరదలా మాట్లాడుతుంది. అప్పుడు ఫోన్ చేసిన వర్ధన్ (రోహిణిని ఏడిపించే వ్యక్తి) 'నేను రోహిణి తండ్రిని కాదు.. మేనమామను' అని చెప్తాడు. దీంతో ప్రభావతి ఉసూరుమంటూ మీరు మేనమామనా వాళ్ల నాన్నగారు కాదా అంటుంది.

కోమాలో నుంచి బయటకు వచ్చిన వర్ధన్.. రోహిణిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభావతికి కాల్ చేసి 'రోహిణి వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు' అని చెప్తాడు. దీంతో అయితే 'మా మనోజ్‌కు, రోహిణికి ఫ్లైట్ టికెట్లు వేయించండి. వీళ్లు అక్కడకు వచ్చి చూసుకుంటారు' అని అంటుంది. దీంతో వర్ధన్ 'ఆయనను చూసుకోడానికి నేనున్నా. మీరు ఈ విషయం చెప్పండి చాలు' అని కాల్ కట్ చేస్తాడు. ఇక ప్రభావతి తన కొడుకుకు కోట్లు కలిసి వచ్చాయని సంబరపడుతుంటుంది. వర్షన్ మాత్రం రోహిణి అవమానం గుర్తు చేసుకుంటాడు.

మనోజ్‌కు కోట్లు కలిసి వచ్చాయని సంతోషిస్తున్న ప్రభావతి 'రాజమాత శివగామిలా మారిపోవచ్చు. వెంటనే ఈ శుభవార్తను యువరాణి రోహిణి దేవికి చేరవేయాలి' అంటూ ఆమెకు కాల్ చేస్తుంది. అంతేకాదు, ఆమెతో వింత వింతగా మాట్లాడుతుంది. ఆ వెంటనే ప్రభావతి 'నాకు ఈరోజు మీ మేనమామ మలేషియా నుంచి కాల్ చేశారు' అని చెబుతుంది. దీంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ప్రభావతి 'నువ్వు, నేను, మనోజ్ గాడు మలేషియా వెళ్లి చూడకపోతే ఎలా' అంటుంది. దీంతో రోహిణి 'మీరు ఆ నెంబర్ నాకు పంపండి' అని అంటుంది.

రోహిణి నెంబర్ అడగ్గానే ప్రభావతి 'అదేంటి మీ మామయ్య నెంబర్ నీ దగ్గర లేదా? అయినా అందులో నెంబర్ రాలేదు ప్రైవేట్ కాల్ అని వచ్చింది. అయినా మీ వాళ్లను ఎందుకు దూరం పెడుతున్నావు' అని అంటుంది. దీంతో రోహిణి పని ఉందని కాల్ కట్ చేస్తుంది. అప్పటి నుంచి ఎవరు కాల్ చేసి ఉంటారని ఆలోచిస్తుంటుంది. ఇక, ప్రభావతి ఫుల్ జోష్‌లో ఉండగానే వాళ్ల ఇంటికి ఇద్దరు గూండాలు వస్తారు. వాళ్లను మలేషియా నుంచి వచ్చారని అడుగుతుంది. దీంతో వాళ్లు 'వడ్డీ వసూలు చేయడానికి వచ్చాం' అంటూ అసలు విషయం చెబుతారు.

వడ్డీ కోసం వచ్చిన వాళ్లను పక్కకు తీసుకు వెళ్లిన ప్రభావతి 'ఇదంతా మా ఇంట్లో వాళ్లకు తెలియదు. నేను డబ్బు తీసుకు వచ్చి ఇస్తాను. ఈ ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్నే గెంటేస్తారు' అని చెబుతుంది. దీంతో వాళ్లు వాటర్ కావాలని అడుగుతారు. ప్రభావతి ఇవ్వనని అనడంతో బెదిరిస్తారు. ఇక, లోపలికి వచ్చిన ప్రభావతిని వాళ్లు ఎవరని అడుగుతాడు. దీంతో ప్రభావతి అబద్దం చెబుతుంది. తర్వాత వాళ్లు వెళ్లిపోతూ తొందరగా అని అరుస్తారు. దీంతో సత్యం 'ప్రభా ఆగు.. వాళ్లేంటి పెళ్లాన్ని పిలిచినట్లు తొందరగా రా అని అంటున్నారు' అని అడగ్గా అబద్ధం చెప్తుంది.

బాలు డబ్బు లెక్కబెట్టుకుంటూ ఉండగా మీనా వచ్చి రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. అప్పుడు కంగారు పడిన బాలు ఏంటని అడగ్గా 'నన్ను మా అమ్మ వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. వాళ్లు గొడవపడి వెళ్లిన తర్వాత ఒకసారి కలుద్దాం అనుకున్నా' అని అంటుంది. అప్పుడే ప్రభావతి బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటుంది. ఆమె వెనకాలే బాలు, మీనా కారులో వెళ్తారు. ఆమెను ఎక్కించుకుందామని చూస్తే ప్రభావతి వచ్చి ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అని అడుగుతుంది. దీంతో నిన్ను డ్రాప్ చేయడానికి అడిగానని బాలు అంటాడు.

బాలు అడిగినా ప్రభావతి మాత్రం ఎక్కను అని చెబుతుంది. అప్పుడు మీనాను చూసి పని చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావని ప్రభావతి అడుగుతుంది. ఆమె తన అమ్మగారి ఇంటికి వెళ్తున్నా అని చెబుతుంది. అలా కారు వెళ్లిపోతుంది. మరోవైపు, శివను అతడి ఫ్రెండ్ కలిసి ప్రభావతి చేసిన గొడవను గుర్తు చేస్తాడు. అప్పుడే అక్కడ ప్రభావతి కనిపిస్తుంది. అది శివ తన ఫ్రెండ్‌కు చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X