Gunde Ninda Gudi Gantalu August 31st: ప్రభావతికి శివ కోలుకోలేని షాక్.. మీనా చూసింది ఆమెనేనా?

డిఫరెంట్ కంటెంట్‌తో షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఆఫీస్ దగ్గరకు వెళ్లిన రోహిణి.. మనోజ్‌కు కాల్ చేయగా అతడు పార్కులో ఉన్నా ఓ మీటింగ్‌లో ఉన్నానని అబద్దం చెప్తాడు. అతడి మాటలను నమ్మేసిన ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే ప్రభావతికి వర్ధన్ కాల్ చేసి రోహిణి మేనమామను అంటూ మాట్లాడతాడు. మలేషియా నుంచి తనకు కాల్ వచ్చిందని నమ్మేసిన ప్రభావతి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తర్వాత ఇదే విషయాన్ని ప్రభావతి.. రోహిణికి కాల్ చేసి చెప్పగా ఆమె షాక్ అవుతుంది. వెంటనే అత్తగారిని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది. తర్వాత కాల్ చేసింది ఎవరా అని ఆలోచిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 31st

మలేషియా నుంచి కోట్లు వచ్చేస్తాయని ప్రభావతి ఆనందంలో మునిగిపోతుంది. అప్పుడే అక్కడకు వడ్డీ కట్టించుకునే గూండాలు వస్తారు. వచ్చిన వెంటనే డబ్బులు కట్టమని గొడవ చేస్తారు. దీంతో తన భర్తకు నిజం తెలియదని వాళ్లను ప్రాధేయపడిన ప్రభావతి.. నేరుగా తీసుకు వచ్చి కడతానని చెబుతుంది. అప్పుడు వాళ్లు వెళ్లిపోతారు.

ఆ సమయంలోనే సత్యం వాళ్ల గురించి ఎంక్వైరీ చేయగా ఆమె అబద్దాలు చెబుతుంది. మరోవైపు, అవమానంతో వెళ్లిపోయిన తన తల్లి వాళ్లను కలిసేందుకు మీనా ఇంటికి వెళ్తానంటుంది. దీంతో బాలు ఆమెను తీసుకెళ్తానంటాడు. తర్వాత ప్రభావతి నడుచుకుంటూ వెళ్తుండగా బాలు వాళ్లు చూసి ఎక్కించుకుంటామంటే ఆమె రానని చెబుతుంది. దీంతో వాళ్లు కారులో వెళ్లిపోతారు.

రాబోయే ఎపిసోడ్‌లో... ప్రభావతి మీద కోపంగా ఉన్న శివకు ఆమె ఆటోలో నుంచి దిగి రోడ్డు మీద కనిపిస్తుంది. అప్పుడు ఆమె గురించి తన స్నేహితుడికి చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ కలిసి ప్రభావతి తీసుకు వెళ్తున్న లక్ష రూపాయలను దొంగతనం చేస్తారు. అనంతరం ఈ విషయాన్ని ఫైనాన్సియర్ దగ్గరకు వెళ్లి ప్రభావతి చెప్తుంది. కానీ, ఆయన నమ్మకపోగా గదిలో బంధించమని చెప్తాడు. అలా ఆమెను గదిలో పెట్టగా అప్పుడే అక్కడకు మీనా వస్తుంది. మరి అత్తగారిని ఆమె చూసిందా? లేదా? అన్నది వచ్చే ఎపిసోడ్‌లోనే చూడాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X