Gunde Ninda Gudi Gantalu August 3rd: విడిపోయిన బాలు, మీనా.. రోహిణిని తల్లిని చేయాలని.. శృతికి రవి షాక్

ఇప్పుడు చాలా కార్యక్రమాలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
భార్యతో తొలిసారి శోభనం జరిగిపోయిన తర్వాత బాలు పిల్లలు పుడతారేమో అని చాలా భయపడుతుంటాడు. దీంతో మీనా పక్కన కూడా పడుకోడానికి ఇష్టపడడు. దీంతో ఇద్దరి మధ్య గదిలో గిల్లికజ్జాలు జరుగుతాయి. వాళ్ల డోర్ ముందు నిల్చున్న ప్రభావతి 'దేవుడా ఏం మందు పెట్టిందో. తాగి వచ్చేవాడు కూడా తాగి రావడంలేదు. వీళ్లను ఎలాగైనా విడగొట్టాలి' అనుకుంటూ కామాక్షికి కాల్ చేస్తుంది. అప్పుడామె 'ఇది ఆషాడమాసం కదా.. అదే కారణం చెప్పి అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండొద్దని మీనాను పంపించు వదినా' అంటూ సలహా ఇస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 3rd

కామాక్షి చెప్పడంతో ప్రభావతి ఆ వెంటనే కామాక్షికి కాల్ చేస్తుంది. దీంతో నిద్రలో ఉన్న వాళ్లు కంగారు పడిపోతారు. అలా భయంతో కాల్ లిఫ్ట్ చేయగానే ప్రభావతి 'బుద్ధి, బాధ్యత ఉందా? ఆషాడంలో కూతురిని పుట్టింటికి తీసుకుని వెళ్లాలని కూడా తెలియదా? రేపు మీరు రావాలి. బాలు వద్దు అన్నా సరే మీనాను తీసుకుని వెళ్లాలి' అని చెప్పి తనలో తానే తెగ సంబరపడిపోతుంది. ఎలాగో మీనా వెళ్లిపోతుందని అనుకున్న ప్రభావతి ఆమె లేచినప్పటి నుంచి పనులన్నీ చేయిస్తుంది. దీంతో మీనా 'ఏంటి అత్తయ్యా ఇంత పని చెబుతారు. నేను ఖాళీగా ఉండొద్దా' అంటుంది.

మీనా అలా అడగ్గానే ప్రభావతి కోపంతో రగలిపోతూ ఆమెపై ఫైర్ అవుతుంది. కానీ, మనసులోనేమో 'నెల రోజు ఆ పనులన్నీ ఎవరు చేయాలి? అందుకే చేయించి పంపించాలి' అనుకుంటుంది. అలా మొత్తం ఇంటి పని అంతా చేయిస్తుంది. కానీ, పార్వతమ్మ, సుమతి రాబోతున్నారని మీనాకు మాత్రం చెప్పదు. కొద్దిసేపటి తర్వాత పార్వతమ్మ, సుమతి అక్కడకు వస్తారు. అంతేకాదు, 'మీనాను నెల రోజలు పాటు పుట్టింటికి తీసుకుని వెళ్తాం' అనడంతో మీనా షాక్ అవుతుంది. అప్పుడు ప్రభావతి.. నువ్వు వెళ్లాల్సిందే అని సీరియస్ అవడంతో మీనా రెడీ అవుతుంది.

బాలు ఇంటికి రాగానే పార్వతమ్మ వాళ్లను చూసి పలకరిస్తాడు. అప్పుడు వాళ్లు మీనాను ఆషాడానికి తీసుకు వెళ్లేందుకు వచ్చామని చెబుతారు. దీంతో బాలు ఇవన్నీ అవసరమా అంటాడు. ఆ సమయంలో పార్వతమ్మ.. రోహిణి ఆషాడానికి వెళ్లడం లేదా అని అడుగుతుంది. అప్పుడాపై ప్రభావతి ఫైర్ అవుతుంది. అనంతరం కిందకు వచ్చిన మీనాను ఇంక వెళ్లిపో అని ప్రభావతి అరుస్తుంది. దీనికామె 'నేను వెళ్లను అత్తయ్యా.. నాకు వెళ్లాలని లేదు. నేను వెళ్తే ఆయనకు ఇక్కడ భోజనానికి ఇబ్బంది అవుతుంది' అంటుంది.

మీనా మాటలకు ప్రభావతి 'నువ్వు ఆషాడంలో కూడా ఇక్కడే ఉంటే నేను పుటుక్కుమని చస్తాను పర్వాలేదా?' అంటుంది. అప్పుడు బాలు 'అలాంటివేం జరగవు కానీ.. మీనా వెళ్లను అంటోంది కదా ఉండనివ్వు' అంటాడు. కానీ ప్రభావతి మాత్రం కుదరదు అంటుంది. అప్పుడు సత్యం 'కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. అమ్మాయి వెళ్లను అంటోంది కదా. నువ్వు ఆగు ప్రభా' అంటాడు. అంతలో సుమతి 'అక్కా నీకు ప్రశాంతంగా ఉంటుంది సెలవులు దొరికాయని అనుకుని పదా' అంటుంది. దీంతో ప్రభావతి 'హేయ్ ఏం అన్నావే' అంటుంది.

ప్రభావతి కోప్పడడంతో సుమతి 'పెళ్లి అయ్యాక మొదటి ఆషాడానికే పంపిస్తారండీ అందుకే అన్నాను' అంటుంది. అప్పుడు రవి కూడా వదిన నీకే మంచిది సంతోషంగా వెళ్లు అంటాడు. దీంతో బాలు కూడా 'సర్లే వెళ్లు మీనా. మా అమ్మ చస్తా అంటోంది కదా. పిచ్చిదో మంచిదో మా అమ్మ బతికే ఉండాలి' అంటాడు. అప్పుడు మీనా 'సరే మీరు జాగ్రత్త. టైమ్‌కు భోజనం చేయండి. తినకుండా వెళ్లకండి' అంటుంది. దీంతో బాలు 'అవన్నీ నేను చూసుకుంటానులే. అక్కడికి వెళ్లి కూడా పని చేయకు. ఇది నీ దగ్గర ఉంచు' అని కొంత డబ్బు చేతిలో పెట్టి సాగనంపుతాడు.

మీనా మాత్రం భర్తను విడిచి వెళ్లలేకపోతుంది. బాలు కూడా పంపడం ఇష్టం లేకపోయినా పంపుతుంటాడు. కానీ, ప్రభావతి మాత్రం మనసులో మురిసిపోతుంటుంది. ఈ సీన్ అంతా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మరోవైపు, రవి తన రెస్టారెంట్‌లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు శృతి అతడికి కాల్ చేస్తుంటుంది. కానీ, రవి మాత్రం లిఫ్ట్ చేయకుండా కావాలనే వదిలేస్తాడు. దీంతో రవి చేస్తున్న రెస్టారెంట్‌కు శృతి కాల్ చేస్తుంది. ఇలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

రాబోయే ఎపిసోడ్లలో మాత్రం సీరియల్ రంజుగా సాగబోతుంది. తాజాగా వదిలిన ప్రోమోలో బాలుకు తన భార్య మీనా పదే పదే గుర్తుకు వస్తుంటుంది. దీంతో అతడు అల్లాడిపోతుంటాడు. కానీ, ప్రభావతి మాత్రం మీనా, బాలు విడిపోయి ఉన్న ఈ నెల రోజుల్లోనే రోహిణి తల్లి కావాలి. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X