Gunde Ninda Gudi Gantalu August 6th: విడిపోయిన రోహిణి, మనోజ్.. మీనా ఇంటికి బాలు.. కథలో సూపర్ ట్విస్ట్
దాదాపు రెండు మూడు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఆషాడానికి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత మీనాతో ఆమె తల్లి, చెల్లి మాట్లాడతారు. అప్పుడు ప్రభావతి అర్ధరాత్రి ఫోన్ చేసి ఆమెను తీసుకు వెళ్లమన్న విషయాన్ని బయటపెడుతుంది. దీంతో మీనా షాక్ అవుతుంది. ఆ తర్వాత అది తెలిసే నెల రోజులకు సరిపడా పనులు చేయించుకుందని వాళ్లతో మీనా చెప్తుంది. గజా మనుషులు బైక్ మీద వెళ్తూ మీనాను చూస్తారు. అందులో ఒకడు 'మీనా ఒంటరిగానే పుట్టింటికి వచ్చింది. ఆ బాలు గాడు రాలేదు అనుకుంటా. వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలి' అని వెళ్తారు. తర్వాత మీనా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది.

అనంతరం రోహిణికి ప్రభావతి దిష్టి తీస్తుంది. అంతేకాదు, మీనా, బాలుకు శోభనం అయిందని, అయినా వాళ్ల కంటే ముందే నువ్వే తల్లివి కావాలని రోహిణికి చెబుతుంది. అంతేకాదు, అవసరం అయితే గైనకాలజిస్ట్‌ను కలుద్దామని అంటుంది. దీంతో రోహిణి తెగ కంగారు పడిపోతుంది. తర్వాత బాలు వచ్చి టిఫిన్ చేయబోతే అది అస్సలు నచ్చదు. దీంతో రోహిణిని కూడా పుట్టింటికి పంపించాలి అని, లేదంటే మీనాకు తీసుకు రావాలని గొడవ చేస్తాడు. దీంతో రోహిణిని తన గదిలో పడుకోబెట్టుకుంటాను అని ప్రభావతి తీసుకెళ్తుంది. తర్వాత మీనా, బాలు ఫోన్ మాట్లాడతారు.
మంగళవారం ఎపిసోడ్‌లో.. రోహిణి తన తల్లిని తీసుకుని ఆస్పత్రికి వస్తుంది. అప్పుడు ఆమెను టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ బీపీ తక్కువగా ఉందని చెప్తాడు. అంతేకాదు, ఆమెను కూడా నీతో తీసుకు వెళ్లొచ్చుగా అని సలహా ఇస్తాడు. తర్వాత వాళ్లు ఇంటికి వస్తారు. అప్పుడు రోహిణిని మనోజ్‌కు నిజం చెప్పేయమని తల్లి అంటుంది. దీంతో ఆమెపై రోహిణి సీరియస్ అవుతుంది. తర్వాత వాళ్ల అమ్మ 'నాకు ఏదైనా అయితే వీడు ఒంటరి వాడు అయిపోతాడు కదా' అంటుంది. దీంతో రోహిణి కూల్‌గా 'నువ్వు అవేమీ ఆలోచించకు. నీకు ఏమీ కాదులే' అని సర్ధి చెబుతుంది.
తల్లితో మాట్లాడిన తర్వాత రోహిణి తన కొడుకును పిలిచి 'ఇక నుంచి నువ్వు నన్ను అత్త అని పిలవకూడదు' అని చెప్తుంది. దీంతో ఆమె తల్లి 'ఏంటే ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఆ పిలుపు నుంచి కూడా వీడిని దూరం చేద్దామని అనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో రోహిణి 'ఈ మాత్రం అయినా నేను రావాలి అనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వాలి. మా మీనా, బాలు ఎక్కడైనా కలిస్తే మీ ఇద్దరూ ఏమీ చెప్పొద్దు' అని అంటుంది. తర్వాత బాలు పెద్ద రౌడీ అని, అతడితో డేంజర్ అని నిందలు వేస్తుంది. దీంతో 'బాలు చాలా మంచివాడు. అతడిని అపార్థం చేసుకుంటున్నావు' అంటుంది. అప్పుడు కూడా తల్లిపై రోహిణి సీరియస్ అవుతుంది.
అనంతరం శృతి దగ్గరకు రవి వస్తాడు. అప్పుడామె అతడు ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతుంది. దీంతో తన మొబైల్ ఇవ్వమని అడుగుతాడు. దీనికి శృతి 'ఓహో మొబైల్ కోసం వచ్చావా? అంటే నాతో మాట్లాడడానికి రాలేదా' అంటుంది. అప్పుడు రవి 'నేను ఒక రెస్టారెంట్‌లో వంట చేసుకునే వంటవాడిని. మీ స్థాయిని నేను ఎంత? నీకు కోటీశ్వరుల సంబంధాలు వస్తున్నాయి. నువ్వు నాతో తిరుగుతున్నావు అని తెలిస్తే నీకు ఇబ్బంది అవుతుంది' అని అంటాడు. తర్వాత తనను ఇంటికి వస్తే ఎలా అవమానించారో రవి ఆమెకు వివరిస్తాడు.
రవి మాటలకు శృతి 'మా నాన్న మీ నాన్న గురించి చాలానే చెప్పారు' అని అంటుంది. దీంతో రవి అసలు ఏం జరిగిందో మొత్తం వివరిస్తాడు. అంతేకాదు, బాలుకు ఈ విషయం తెలిస్తే ఇంకా గొడవలు అవుతాయని అంటాడు. అప్పుడు శృతి 'నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నిన్న మొత్తం ఏమీ తినలేదు' అని చెబుతుంది. దీంతో రవి వెంటనే ఆమెను రెస్టారెంట్‌కు తీసుకు వెళ్తాడు. మరోవైపు, బాలు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రికి ఫోన్ చేస్తే హోటల్‌లో తినమని చెప్తాడు.
ఆకలికి తట్టుకోలేకపోతున్న బాలు.. మీనాకు ఫోన్ చేస్తాడు. అప్పుడామెకు ఆకలి అవుతుంది అని చెబుతాడు. దీనికామె మా ఇంటికి రండి వంటి చేస్తాను అని అంటుంది. అప్పుడు బాలు 'భార్య జేబు చూస్తుంది.. తల్లి కడుపు చూస్తుంది అంటారు. కానీ, మన ఇంట్లో మాత్రం ఇదంతా వేరుగా ఉంది. నువ్వు కడుపు చూస్తావు. ఆమె మాత్రం జేబే చూస్తుంది' అంటాడు. అనంతరం మనోజ్ షోరూంలోని కార్లతో సెల్ఫీలు దిగుతుంటాడు. అప్పుడు మరో ఎంప్లాయి వచ్చి తిడతాడు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఒక్క కారైనా అమ్మావా అని ప్రశ్నిస్తాడు.
తర్వాత ఒకరు కారు కొనేందుకు వస్తారు. వాళ్లను మనోజ్ టెస్ట్ డ్రైవ్‌కు తీసుకు వెళ్తానని అంటాడు. దీంతో ఒనర్ ఇష్టం లేకుండానే ఒప్పుకుంటాడు. అనంతరం ఆ కస్టమర్‌ను మనోజ్ టెస్ట్ డ్రైవ్‌కు తీసుకు వెళ్తాడు. ఆయన కారు ఆపేసి మటన్ తీసుకు రమ్మని మనోజ్‌కు చెప్తాడు. కానీ, అతడు అలా చేయనని అంటాడు. ఆ తర్వాత మనోజ్ షోరూంకు రావడంతో అతడిపై ఓనర్ సీరియస్ అవుతాడు. 'నీ వల్ల 2 కోట్లు నష్టం. వాడు మా ఫ్రెండ్. 8 కార్లు ఆర్డర్ ఇస్తానని వచ్చాడు. ఇప్పుడు నువ్వు చేసినదానికి వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు' అని చెప్పి ఉద్యోగం తీసేస్తాడు.
శృతిని రవి బైక్‌పై రెస్టారెంట్‌కు తీసుకువెళ్తుంటాడు. అప్పుడామె వాళ్లిద్దరూ మొదటిసారి కలుసుకున్న ప్లేస్‌లో బైక్‌ను ఆపమంటుంది. ఏదైనా గుర్తుకు వచ్చిందా అని కూడా అడుగుతుంది. రవి మాత్రం తనకేమీ గుర్తు లేదని చెప్తాడు. అనంతరం రవిని తాను అంటే ఇష్టం ఉందా లేదా అని నిలదీస్తుంది. అలా ఇద్దరి మధ్యన డిస్కర్షన్ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











