Gunde Ninda Gudi Gantalu August 8th: నిజం చెప్పిన మనోజ్.. మీనా కోసం వచ్చేసిన గజ.. బాలు ఏం చేశాడంటే!

ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 8th

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
చింటూ అత్త అని పిలవడంతో రోహిణి కోప్పడుతుంది. దీంతో ఆ బుడ్డోడు బాధపడుతూ నాకు అమ్మలేదని అందరూ ఏడిపిస్తున్నారు అని చెబుతాడు. అంతేకాదు, ఒక్కసారి వాళ్ల ముందు నిన్ను అమ్మ అని పిలుస్తా అంటాడు. దీంతో రోహిణి ఏడుస్తుంది. అనంతరం రవి కోసం శృతి రెస్టారెంట్‌కు వస్తుంది. అప్పుడు అతడు సరిగా మాట్లాడకుండా దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అతడికి ప్రపోజ్ చేసి ముద్దు పెడుతుంది. అదంతా చూసి శృతి పేరెంట్స్ కోప్పడతారు. అంతేకాదు, సురేంద్ర.. సత్యంకు ఫోన్ చేస్తాడు. కానీ, సత్యం మాత్రం సురేంద్రను లెక్కచేయడు.

మనోజ్ జాబ్ పోగొట్టుకుని నిరాశగా రోహిణి పార్లర్‌కు వస్తాడు. కానీ, అక్కడ ఆమె కనిపించదు. దీంతో ఫోన్ చేయగా అతడికి అబద్దాలు చెబుతుంది. అప్పుడు రోహిణి కంగారుగా వెళ్లిపోతుంటుంది. అప్పుడే చింటూ తన తల్లిని చూపించేందుకు ఫ్రెండ్స్‌ను రెడీ చేస్తుంటాడు. తర్వాత ఆమె వెళ్లిపోవడంతో చింటూ దిగాలుగా ఇంటికి వస్తాడు. అందరూ ఆ బుడ్డోడి మాటలు వినకుండా చులకన చేసి మాట్లాడతారు. అనంతరం బాలు, మీనా ఇంటికి వెళ్లి ఆమె వండిన చేపల కూరను తింటాడు. అప్పుడు పార్వతమ్మ.. ప్రభావతికి తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది.

గురువారం ఎపిసోడ్‌లో.. తన ఉద్యోగం పోయిన విషయాన్ని మనోజ్ తల్లి ప్రభావతికి చెప్తాడు. దీంతో ఆమె కంగారు పడిపోతూ అతడిపై అరుస్తుంది. అంతేకాదు, 'ఆ బాలు గాడికి తెలిస్తే మన కొంప కొల్లేరు అవుతుంది. వాడు మనల్ని రోడ్డు మీద పడేస్తాడు. నిన్ను నమ్ముకుని రోహిణి ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు ఆమెకు ఏం చెప్తావు? అసలే మన ఇల్లు తాకట్టులో ఉంది. వాడికి నెల నెల వడ్డీ కట్టాలి. నీ జీతంతో ఆ వడ్డీ కట్టాలి అనుకున్నాను. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. వాడు ఇంటి మీదకు వస్తే మనం ఏమైపోవాలి' అంటూ రచ్చ రచ్చ చేస్తుంది.

మనోజ్‌పై సీరియస్ అయిన తర్వాత ప్రభావతి 'నీకు ఉద్యోగం పోయిన విషయం ఎవరికీ తెలియనివ్వకు. ముఖ్యంగా రోహిణికి చెప్పకు. మనం నీ డబ్బు దొబ్బేసిన అమ్మాయిపై కేసు పెడదాం' అని అంటుంది. అంతలోనే రోహిణి అక్కడకు వచ్చి మనోజ్ ఇంత త్వరగా వచ్చేశావేంటి అని ప్రశ్నిస్తుంది. దీంతో ప్రభావతి 'ఈరోజు వీడు రెండు కార్లు అమ్మాడంట. అందుకే ఓనర్ త్వరగా పంపించాడు' అని చెప్తుంది. దీనికామె 'నాకు తెలుసు మనోజ్ టాలెంట్. అందుకే నీ మీద నమ్మకంతో ఈ ఉద్యోగం ఇప్పించాను. మన ఇద్దరి డబ్బతో అప్పు తీర్చేయొచ్చు' అని అంటుంది.

కంగారుగా ఇంటికి వచ్చిన సత్యం.. బాలుకు వంట చేయలేదని ప్రభావతిపై సీరియస్ అవుతాడు. అప్పుడే బాలుకు ఆయన ఫోన్ చేస్తాడు. అప్పుడతడు మీనా ఇంట్లో మంచిగా భోజనం చేసినట్లు చెప్తాడు. అది ప్రభావతి వాళ్లు వినేస్తారు. అప్పుడు మనోజ్ 'మమ్మల్ని విడగొట్టి వాడు వెళ్లి తన అత్తగారింట్లో ఉంటున్నాడా' అని మనోజ్ అంటాడు. తర్వాత బాలు తన తండ్రి సత్యంను కూడా అక్కడకు వచ్చి తినమని చెప్తాడు. అంతేకాదు, ఎక్కువగా మాట్లాడితే ఆషాడ మాసం మొత్తం ఇక్కడే ఉంటానని అంటాడు. దీంతో ప్రభావతి వాళ్లతో పాటు పార్వతమ్మ కూడా షాక్ అవుతుంది.

బాలు తమ ఇంటికి రావడంతో పార్వతమ్మ భయపడుతూనే ఉంటుంది. ప్రభావతి తమను ఏమంటుందో అని టెన్షన్ పడుతూ ఈ విషయాన్ని మీనాతో అంటుంది. అంతేకాదు, బాలును వెళ్లిపోమని చెప్తుంది. కానీ, మీనా మాత్రం అలా చెప్పనని అంటుంది. తర్వాత బాలుకు క్యాబ్‌కు రావాలని ఫోన్ వస్తుంది. దీంతో అతడు బయలుదేరేందుకు రెడీ అవుతాడు. అప్పుడే అక్కడ గజ మనుషులను చూస్తాడు. దీంతో బాలు కారులో వెళ్తున్నట్లు నటించడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోతారు. తర్వాత బాలు కారు పని చేయడం లేదని వంక చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చేస్తాడు.

బాలు మళ్లీ ఇంట్లోకి రావడంతో పార్వతమ్మ టెన్షన్ పడుతుంటుంది. అప్పుడే అక్కడకు కొందరు ఆడవాళ్లు వస్తారు. వచ్చీ రాగానే బాలును చూసి 'ఇక్కడే ఉన్నావా బాలు? నువ్వు ఆషాడం వచ్చినా భార్య వెనకాలే వచ్చాయి. అదే మా భర్తలు అయితే మేము ఎప్పుడు పుట్టింటికి వెళ్తామా అని ఎదురు చూస్తుంటారు' అని అంటారు. అలా కాసేపు బాలును పొగుడుతూ ఉంటారు. అంతేకాదు, 'నువ్వు రానంత వరకూ ఆ గజ గాడు అప్పు పేరుతో ఏదో ఒకటి తీసుకెళ్లేవాడు. నువ్వు రావడంతో వాడు ఇటువైపే రావట్లేదు' అని చెప్పడంతో వాళ్లకు బాలు ఒక కథ చెప్తాడు.

అనంతరం గజ తన మనుషులతో మీనా ఇంటికి వస్తాడు. అప్పుడు అతడి అనుచరులు బాలు వెళ్లిపోయాడని చెబుతారు. దీంతో మీనాపై పగ తీర్చుకుంటానని అతడు అంటాడు. మరోవైపు బాలు భోజనం చేసి అక్కడే పడుకుంటానని చెప్తాడు. దీంతో పార్వతమ్మ మరింత భయపడుతుంది. కానీ, మీనా మాత్రం ఆమెకు సర్ధిచెప్తుంది. తర్వాత గజ తన మనుషులతో 'ఆ బాలు గాడు కారు రిపేర్ వస్తే చేయిచుకున్నాడు. మరి వాడి భార్యను పాడు చేస్తే ఏం చేస్తాడు' అంటాడు. తర్వాత బాలు, మీనా డాబాపై మాట్లాడుకుంటుంటారు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X