Gunde Ninda Gudi Gantalu August 9th: అర్ధరాత్రి డ్రామా.. గజకు షాకిచ్చిన బాలు.. రవి గురించి తెలిసిన నిజం

రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తన ఉద్యోగం పోయిన విషయాన్ని మనోజ్ తల్లి ప్రభావతికి చెప్తాడు. దీంతో ఆమె కంగారు పడిపోతూ అతడిపై అరుస్తుంది. తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సలహాలు ఇస్తుంది. అప్పుడే కంగారుగా ఇంటికి వచ్చిన సత్యం.. బాలుకు వంట చేయలేదని ప్రభావతిపై సీరియస్ అవుతాడు. ఆ వెంటనే బాలుకు కాల్ చేయగా అతడు అత్తగారింట్లో ఉన్న విషయం చెప్తాడు. దీంతో ప్రభావతి కంగారు పడిపోతుంది. అనంతరం బాలు ఇంటికి వెళ్లబోతూ మీనా ఇంటి ముందు గజ మనుషులను చూసి ఆగిపోతాడు. కానీ, పార్వతమ్మ మాత్రం ప్రభావతి గురించి భయపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 9th

మీనా ఇంటికి బాలు వెళ్లిపోవడంతో ప్రభావతి కోపంగా ఉంటుంది. అంతేకాదు 'అసలు ఆ పూలు అమ్మేదాన్ని ఆ ఇంటికి ఎందుకు పంపించాను? అదేదో ప్యాలెస్ అయినట్లు వీడు అక్కడకు వెళ్లి ఎందుకు ఉండాలి' అనుకుంటూ పార్వతమ్మకు కాల్ చేస్తుంది. అప్పుడామె తెగ భయపడిపోతుంది. దీంతో మీనా ముందు కాల్ లిఫ్ట్ చేయమని అంటుంది. అలా ఫోన్ ఎత్తగానే 'అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆషాడం అని తెలిసి కూడా అల్లుడిని ఎలా రాణిస్తావు? బాలు అక్కడకు వస్తే మీనాను నేను పంపించడం దేనికి' అంటూ ఫైర్ అవుతుంది.

ప్రభావతి మాటలకు పార్వతమ్మ 'వదిన గారు.. అల్లుడు గారిని మేము రమ్మని పిలవలేదు' అని చెబుతుంది. అయినా ఆమె కోప్పడుతూనే ఉంటుంది. ప్రభావతి తన తల్లిపై సీరియస్ అవుతుండడంతో మీనా ఫోన్ తీసుకుని 'అత్తయ్యా.. ఆయన ఇక్కడ ఉన్నా మేము కలిసి పడుకోవడం లేదు' అని సమాధానం చెప్తుంది. అప్పుడామె 'నువ్వు ఏం చేస్తున్నావో నేను కెమెరాలు పెట్టి చూస్తున్నానా? అయినా ఇక్కడ ఇల్లు లేదా' అని అంటుంది. దీంతో మీనా 'మా అమ్మ ఆయనను ఉండమన్నదా? వచ్చింది ఆయన.. ఆయననే అడగండి' అని కాల్ కట్ చేస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 9th

అనంతరం అందరూ ఇంట్లో పడుకుని ఉంటారు. అప్పుడు మీనా వాళ్లు జోకులు చేసుకుంటూ ఉంటారు. దీంతో పార్వతమ్మ తనకు చాలా భయంగా ఉందని, ప్రభావతి ఏమైనా అంటుందేమో అని టెన్షన్‌గా ఉందని చెబుతుంది. మరోవైపు, ఇంటి ముందు వెయిట్ చేస్తున్న గజ తన మనుషులను తీసుకుని డాబా మీదకు వెళ్తాడు. తర్వాత వాళ్లను అక్కడే ఉండమని మీనా అనుకుని పడుకున్న బాలు దుప్పటిని తీస్తాడు. అప్పుడు బాలు 'నీ కోసమే వెయిట్ చేస్తున్నా రారా. ఆషాడం కదా అందంగా రెడీ చేయించి సీమంతం చేసి పంపిస్తాను' అంటూ షాక్ ఇస్తాడు.

బాలు మాటలకు గజ 'రారా చూసుకుందాం. నీ మీద కూడా చాలా రోజులుగా కోపంతో ఉన్నాను' అంటూ మీదకు వెళ్తాడు. దీంతో ఇద్దరూ ఫైటింగ్ చేసుకుంటారు. అప్పుడు గజ కిందకు వస్తాడు. అది చూసిన అతడి మనషులు బాలుతో ఫైట్ చేస్తుంటారు. అదంతా చూసిన మీనా తమ్ముడు అందరినీ నిద్రలేపుతాడు. అప్పుడే పక్కింటి వాళ్లు కూడా అక్కడు వచ్చి ఏమైందని అడుగుతారు. దీంతో బాలు 'వీడు మీనాను అల్లరి పెట్టేందుకు వచ్చాడు. వీళ్ల మనుషులను చూసి నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండిపోయాను' అంటూ అక్కడ ఉన్న వాళ్లకు చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 9th

గజను కొట్టిన తర్వాత అక్కడ ఉన్న ఒక మహిళ అతడి పరువు తీసేలా మాట్లాడుతుంది. అప్పుడు బాలు ఆమెను ఆపి 'మీనా నా భార్యరా. మరోసారి మీనా మీద చేయి వేయాలని చూస్తే అన్నం తినడానికి చేయి ఉండదు. మరోసారి కన్నెత్తి చూశావంటే చూడ్డానికి కళ్లు కూడా ఉండవు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మా జోలికి రాకు. నీ ప్రతి కదలిక కనిపెడుతూనే ఉంటాను' అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో గజ 'ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటాను' అని బాలుతో అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి ఏంట్రా నువ్వు తీసుకునేది అనడంతో గజ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 9th

గజ వెళ్లిన తర్వాత అందరూ బాలును పొగుడుతూ మాట్లాడతారు. మీనా కూడా తన తల్లికి ధైర్యం చెప్తుంది. అనంతరం సత్యం తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తుంటే సత్యేంద్ర తన భార్యతో కలిసి వస్తాడు. అప్పుడు ఆయన తన కూతురితో రవి తిరుగుతున్నాడని సత్యేంద్ర, సత్యానికి చెప్తాడు. కానీ, ఆయన మా రవి అలాంటి వాడు కాదు అని చెబుతాడు. అయినా సత్యేంద్ర వినిపించుకోడు. ఆయన భార్య కూడా నోటికోచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు సత్యం ఫ్రెండ్ నచ్చజెప్పినా వినకుండా వార్నింగ్ ఇస్తాడు. దీంతో నీ కూతురిని అదుపులో పెట్టుకో అంటాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode August 9th

సత్యేంద్ర వార్నింగ్ ఇచ్చిన తర్వాత సత్యం నేరుగా రవి దగ్గరకు వచ్చి నిలదీస్తాడు. దీంతో శృతి తన ఫ్రెండ్ అని చెబుతాడు. దీనికి సత్యం 'నిన్ను ఎప్పుడూ అది చెయ్ ఇది చెయ్ అని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా.. సత్యేంద్ర కూతురితో ఫ్రెండ్‌షిప్ కట్ చెయ్' అంటాడు. తర్వాత ఫ్రెండేనా ఇంకేమైనా ముందుకు వెళ్లారా అని అడిగి.. ఇంకెప్పుడూ ఆమెతో మాట్లాడకు అని చెప్తాడు. తర్వాత ఈ విషయం బాలుకు చెప్పొద్దని సూచిస్తాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X