Gunde Ninda Gudi Gantalu July 10th: దొరికిపోయిన ప్రభావతి.. పోలీస్ కేసుతో షాక్.. బాలు తల పగలగొట్టిన గజ

ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రోహిణి తెచ్చిన జ్యూస్ తాగలేక ప్రభావతి ఇబ్బంది పడుతుంది. అప్పుడు బాలు ఆమెతో వెటకారంగా మాట్లాడతాడు. కానీ, రోహిణి అడగ్గానే ప్రభావతి జ్యూస్ బాగుందని అంటుంది. కానీ, వాళ్ల ఇబ్బందిని గమనించిన మీనా.. 'అత్తయ్య మీ ఇద్దరి కోసం పూరీ చేయమంటారా' అని అడుగుతుంది. అప్పుడు మనోజ్ రెడీ అవగా రోహిణి 'ఆల్రెడీ చెప్పాను కదా. పూరీలు తినకూడదు అని. ఈ జ్యూస్ హెల్త్‌కు మంచిది' అని అంటుంది. అప్పుడు బాలు కూడా ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడడంతో పాటు వాళ్లిద్దరూ మొత్తం ఆ జ్యూస్ తాగేలా చేయమని రోహిణితో చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 10th

బాలు మాటలు విన్న తర్వాత రోహిణి 'అత్తయ్యా.. బాలుకు మీ హెల్త్ అంటే జాగ్రత్త ఎక్కువే అనుకుంటా కదా' అంటుంది. దీంతో ప్రభావతి 'వాడి బొంద.. వాడికి పెద్దగా ఏమీ ఉండదు. నా గురించి మనోజే ఎక్కువగా శ్రద్ద చూపిస్తాడు. అందుకే నాకు మీరంటేనే ఇష్టం. మీ పెళ్లైన తర్వాత గుడికి తీసుకు వచ్చి ముడుపు కట్టిస్తానని మొక్కుకున్నా. అందుకే వెళ్లాలి. మీనా నువ్వు వెళ్లి అంట్లు తోము' అని అంటుంది. అప్పుడు మనోజ్ గుడికి వెళ్దామా అని అడుగుతాడు. దీంతో ప్రభావతి 'మీ నానమ్మ ఊరు వెళ్తుంది కదా. ఆమె వెళ్లాకే మనం కూడా వెళ్దాము' అంటుంది.

అనంతరం సుశీల తన ఇంటికి వెళ్లిపోతుంటే ప్రభావతి ఆమెను ఆగమంటుంది. అంతేకాదు, ఓ చీరను తీసుకొచ్చి 'పెళ్లిలో పెట్టాలని అనుకుంటే కుదరలేదు. తీసుకోండి' అంటుంది. దీంతో సత్యం 'అలా అడుక్కునే వాళ్లకు ఇచ్చినట్లు ఇస్తున్నావే' అని ఫైర్ అవుతాడు. దీంతో ప్రభావతి 'ఆమె ఏమైనా నిండు ముత్తైదువా? బొట్టు పెట్టి ఇవ్వడానికి' అని బదులిస్తుంది. తర్వాత ఆ చీర తనకు వద్దని సుశీల బాధపడుతుంది. అనంతరం సుశీలను పట్టుకుని మీనా ఏడుస్తుంటే ప్రభావతి వద్దు అని అంటుంది. దీంతో బాలు వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ముందుగా అనుకున్నట్లుగానే మనోజ్, రోహిణిని ప్రభావతి గుడికి తీసుకు వస్తుంది. అంతలోనే అక్కడ కామాక్షి కొబ్బరి చిప్పలు తింటూ కనిపిస్తుంది. దీంతో ఆమెను అవి పక్కన పెట్టేయమని ప్రభావతి చెప్తుంది. తర్వాత మనోజ్ వాళ్లు రాగానే 'మీ పెళ్లి అయితే ఈ గుడికి తీసుకు వస్తానని వదిన ఎప్పుడో మొక్కుకుంది. ఏమ్మా నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా' అని రోహిణిని కామాక్షి అడుగుతుంది. దీనికామె 'చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య నన్ను అమ్మలాగే చూసుకుంటోంది' అని బదులిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 10th

రోహిణి మాటలతో కామాక్షి 'ఎందుకు చూసుకోదు.. మీ మలేషియా తండ్రి కోట్లు కుమ్మరిస్తాడని ఆశపడుతుందిగా' అని మనసులో అనుకుంటుంది. తర్వాత ప్రభావతి అడగ్గానే ఏమీ లేదని కవర్ చేసుకుంటుంది. తర్వాత సుశీల తనపై పెత్తనం చేసిందని ప్రభావతి చెప్తుంది. దీంతో రోహిణి 'నాకు అలాంటి బాధ ఏమీ లేదు. మా అత్తయ్య బంగారం' అంటుంది. అనంతరం కామాక్షి 'నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి ఏంట్రా? రేపు ఉద్యోగం వస్తే త్వరగా లేవాల్సి ఉంటుంది' అంటుంది. దీంతో ప్రభావతి 'మనోజ్‌కు మంచి ఉద్యోగం రావాలని మొక్కుకుందాం' అని తీసుకెళ్తుంది.

బాలు హడావిడిగా ఇంటికి వచ్చి నానమ్మ గురించి అడుగుతాడు. అనంతరం బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుని వస్తే మీనాను బయటకు తీసుకు వెళ్తానని చెబుతాడు. దీంతో ఆమె తెగ సంతోషపడుతుంది. అనంతరం 'అత్తయ్య గారు నన్ను ఇంట్లోనే ఉండమన్నారు. ఇప్పుడు వెళ్తే ఎలా' అని అడుగుతుంది. దీంతో బాలు 'నువ్వేమీ ఈ ఇంటి వాచ్‌మన్‌వు కాదు. అయినా నీ అంతట నువ్వు వెళ్లడం లేదు కదా. నేనే తీసుకు వెళ్తున్నాను' అంటాడు. తర్వాత మీనా అతడిని వరుసగా ప్రశ్నలు అడుగుతుంది. దీంతో బాలు కారులో వెళ్తూ అన్నీ చెప్తానని చెప్తాడు.

తన కారు వాయిదా కట్టడానికే గుడికి వెళ్తున్నామని బాలు అసలు విషయం మీనాకు చెప్తాడు. అంతేకాదు, ఆయన గుడిలో అంగ ప్రదక్షిణ చేసే సమయంలో సగం డబ్బులు ఇచ్చినా తీసుకుంటాడు అని చెబుతాడు. అంతేకాదు, ఆయనతో ఎలా మాట్లాడాలో మీనాకు ట్రైనింగ్ కూడా ఇస్తాడు. మరోవైపు, గుడిలో మనోజ్, రోహిణి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆ సమయంలో ఆమె బావ అని పిలవగానే మురిసిపోతాడు. తర్వాత తనకు బిజినెస్‌మ్యాన్ అవ్వాలని ఉందని మనోజ్ చెబుతాడు. రోహిణి మాత్రం కొద్ది రోజులు జాబ్ చేయమని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 10th

బాలు డబ్బులు కడదామని చూస్తున్న ఫైనాన్సియర్‌కు అందరూ నమస్కారం చేస్తుండడంతో ఆయన స్వామిజీ అని ప్రభావతి దండం పెట్టడానికి వెళ్తుంది. అప్పుడు ఆయన తన ఇంటిని తాకట్టు పెట్టిన వ్యక్తి అని గుర్తించి పారిపోతుంది. తర్వాత సత్యం అక్కడకు రావడంతో నిజం తెలుస్తుందని ఆయనను పక్కకు తీసుకు వెళ్తుంది. దీంతో ఫైనాన్సియర్ వెతుక్కుంటూ వచ్చి కామాక్షి దగ్గరకు వస్తాడు. అప్పుడు అతడికి ఆమె నిజం చెప్తుంది. దీంతో ఆయన ఫైర్ అవుతూ ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తాడు. ఇలా మంగళవారం ఎపిసోడ్ పూర్తైంది.

ఇక, బుధవారం ఎపిసోడ్‌లో బాలు కారును సీజ్ చేయడానికి కారణం అయిన వాళ్లు కనిపిస్తారు. దీంతో వాళ్లతో అతడు ఫైట్ చేస్తాడు. అప్పుడు ఆ రౌడీలు దీనికి కారణం గజనే అని చెప్తారు. అప్పుడు బాలు అతడి దగ్గరకు వెళ్లి ఫైట్ చేస్తాడు. అప్పుడు ఆ గజ బాలు తలపగలగొడతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X