Gunde Ninda Gudi Gantalu July 11th: తల్లికి మనోజ్ షాక్.. నిజం తెలుసుకున్న మీనా.. పోలీసు కేసు తప్పదా?
చాలా ఇండస్ట్రీలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఫైనాన్సియర్‌ను చూసి పారిపోయిన ప్రభావతి ఏం జరుగుతుందా అని దొంగతనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆయన వచ్చి ఆమెకు షాకిస్తాడు. అంతేకాదు, 'ఇంట్లో ఎవరికీ తెలియకుండా నీ ఇల్లు తాకట్టు పెట్టావా? నువ్వు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తీసుకుని నా ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టించాలి. లేకపోతే కేసు పెడతాను. మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. కోర్టు కూడా మా ఆఫీసు పక్కనే' అంటాడు. అంతేకాదు, పక్కనే ఉన్న కామాక్షితో 'నువ్వేగా సాక్షి సంతకం పెట్టావు. నిన్ను కూడా వదిలిపెట్టను' అంటాడు. దీంతో ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది.

కామాక్షి పడిపోగానే సత్యం కూడా వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు ప్రభావతికి ఏం చెప్పాలో అర్థం కాదు. దీంతో ఆమెకు దేవుడు పూనాడాని చెబుతుంది. దీంతో సత్యం 'నువ్వు పక్కన ఉండగా తన మీదకు దేవుడు ఎలా వస్తాడు' అని సెటైర్ వేస్తాడు. దీంతో ప్రభావతి 'ఈమె సంగతి నేను చూసుకుంటాను కానీ, మీరు వెళ్లండి. అక్కడ మనోజ్, రోహిణితో ముడుపు కట్టించాలి' అని చెబుతుంది. దీంతో సత్యం వెళ్లిపోతాడు. అప్పుడు కామాక్షిని తీసుకుని ప్రభావతి పక్కకు వెళ్లిపోతుంది.
ఫైనాన్సియర్ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే మీనాను అతడి దగ్గరకు వెళ్లమని బాలు చెప్తాడు. అంతేకాదు, ఆమెకు ట్రైనింగ్ కూడా ఇస్తాడు. దీంతో మీనా ఆయన దగ్గరకు వెళ్లి ఏం చెప్పాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంది. దీంతో కంగారు పడిన ఫైనాన్సియర్ బాలు అక్కడే ఉన్నది చూస్తాడు. దీంతో పక్కనే ఉన్న అసిస్టెంట్ వెళ్లి అతడిని తీసుకుని వస్తుంది. అప్పుడు ఆయన బాలును డబ్బులు అడుగుతాడు. అంతేకాదు, 'నీకు నిజం చెప్పడం తెలియదు. నీ భార్యకు అబద్ధం ఆడడం రాదు' అంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు.

చాలా సేపు డిస్కర్షన్ జరిగిన తర్వాత తన దగ్గర ఉన్న సగం డబ్బులను బాలు.. ఫైనాన్సియర్‌కు ఇస్తాడు. దీంతో మిగిలిన డబ్బులు కూడా త్వరగా ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. ఇక, వాళ్లు మాట్లాడుకుంటున్నది చూసిన ప్రభావతి, కామాక్షి ఇంటి తాకట్టు గురించే మాట్లాడుతున్నారని భయపడిపోతారు. అప్పుడు కామాక్షి 'అసలు ఈ ఇంటి గురించి నాకు ఏమీ తెలీదు. నన్ను ఇంక ఇందులో ఇన్వాల్వ్ చేయకు వదిన. ఆ బాలు గాడు వెళ్లి మా ఆయనకు చెప్పాడంటే నా పని అయిపోతుంది' అని ప్లేట్ ఫిరాయిస్తుంది. తర్వాత అంతా వెళ్లి గుడిలో దండం పెట్టుకుంటారు.
ఇంటికి వెళ్లిన తర్వాత ప్రభావతి, కామాక్షి మాట్లాడుకుంటారు. అప్పుడు ఇద్దరూ భయంతో వణికిపోతుంటారు. ముఖ్యంగా ప్రభావతి తనకు జ్వరం కూడా వచ్చిందని అంటుంది. అంతలోనే సత్యం అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీంతో ప్రభావతి అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటుంది. అంతేకాదు, ఆయనపై సీరియస్ కూడా అవుతుంది. అనంతరం కామాక్షిని వెళ్లి అసలు మీనా, బాలు గుడికి ఎందుకు వచ్చారు? ఆ ఫైనాన్సియర్‌తో ఏం మాట్లాడారు? అనేవి కనుక్కో అని చెబుతుంది. దీంతో కామాక్షి భయంగానే వెళ్తానని ఒప్పుకుంటుంది.
అనంతరం మనోజ్‌తో రోహిణి మాట్లాడుతూ.. 'అసలు నమ్మలేకపోతున్నా. మన పెళ్లి జరుగుతుందని అనుకోలేదు. ఆ బాలు ఏమైనా చేస్తాడని అనుకున్నా. ఇప్పుడు అంతా హ్యాపీ. నువ్వు ఏదో ఒక జాబ్ చేయాలి. నేను బ్యూటీ పార్లర్ డెవలప్ చేసుకుని చాలా బ్రాంచులు పెట్టాలి. తర్వాత ఇద్దరూ చెరో కారు కొనుక్కోవాలి. మనం ఎంత రిచ్‌గా మారిపోయినా మీ అమ్మగారిని కూడా మన దగ్గరే ఉంచుకోవాలి' అని అంటుంది. తర్వాత మనోజ్ 'అవును.. నువ్వు గుడిలో ఏం కోరుకున్నావు' అని అడగ్గా.. ఆమె మాత్రం చెప్పదు. దీంతో మనోజ్ ఫీల్ అయిపోతాడు.

మనోజ్‌కు కోపం రావడంతో రోహిణి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనోజ్ 'ఇంత చిన్న విషయం కూడా నాకు చెప్పకూడదా? ఏదైనా నువ్వు నా దగ్గర దాయకూడదు' అంటాడు. దీంతో రోహిణి 'ఇంత చిన్న విషయానికే ఫీల్ అవుతున్నాడు. అంటే ఆ పీఏ గాడి విషయం దాచిపెట్టానని తెలిస్తే ఎలా? వాడు నా పెళ్లి గురించి, నా బ్యాగ్రౌండ్ గురించి చెప్పేస్తే మనోజ్ ఊరుకుంటాడా' అని మనసులో అనుకుంటుంది. తర్వాత మనోజ్ 'అయినా నీ గురించి నాకు తెలియని విషయాలు ఏమున్నాయిలే' అని అంటాడు.
ప్రభావతి సూచన మేరకు కామాక్షి వెళ్లి మీనాను పలకరిస్తూ 'మేము వెళ్లిన గుడికి మీరు కూడా ఎందుకు వచ్చారు? అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా ఆయన ఎవరు' అని అడుగుతుంది. దీంతో మీనా ఎవరో తనకు తెలియదు అని అబద్ధం చెప్తుంది. ఈ విషయం ప్రభావతికి చెప్పడంతో ఆమె సంతోషిస్తుంది. తర్వాత ప్రభావతి వెళ్లి రోహిణి డబ్బులు అడుగుతుంది. దీంతో ఆమె షాక్ అవుతుంది. అప్పుడు మనోజ్, రోహిణి లేవు అని అంటారు. కానీ, గాజులు ఇస్తానని అంటుంది. కానీ, మనోజ్ వద్దంటాడు. దీంతో ప్రభావతి ఫీల్ అవుతుంది. ఇలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











