Gunde Ninda Gudi Gantalu July 18th: అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతి కొత్త అవతారంతో ట్విస్ట్

గతంలో కంటే ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్‌లో మార్పు వచ్చినా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తాగి వచ్చి రచ్చ చేసిన బాలు ముందు మీనా తన బాధనంతా వెల్లగక్కుతుంది. నా కన్నతల్లి ముందే నా మీద చేయి ఎత్తారు. చెప్పుకోడానికి తండ్రి కూడా లేడు. తను ఎంత తల్లడిల్లి ఉంటుంది అంటూ ఏడుస్తుంది. రోహిణి ముందు సంస్కారంగా ఉండాలి కదా అంటుంది. కానీ, బాలు సైలెంట్‌గానే ఉంటాడు. అప్పుడు సత్యం వచ్చి బాలును ఆలోచించేలా మాట్లాడతాడు. తర్వాత పార్వతమ్మ, సుమతిని డ్రాప్ చేసిన బాలు.. మీనాను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. అనంతరం శృతి, రవి కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆమె తల్లిదండ్రులు వాళ్లను ఫాలో అవుతారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 18th

మీనా బాధగా.. వాళ్లు హ్యాపీగా
ఒకవైపు బాలు, మరోవైపు ప్రభావతి తనను అవమానించేలా అన్న మాటలను తలచుకుని మీనా బాధపడుతుంటుంది. కానీ, మరోవైపు మనోజ్, రోహిణి మాత్రం ఫుల్ జోష్‌తో కనిపిస్తారు. ఆమె ఫోన్‌లో రోహిణి చిన్నప్పటి ఫొటోలను చూస్తూ మనోజ్ మురిసిపోతుంటాడు. ఆ తర్వాత ఏమైందని ప్రభావతి అడగడంతో ఆ ఫొటోలను ఆమెకు కూడా చూపిస్తాడు. అవన్నీ చూసిన తర్వాత 'నువ్వు చిన్నప్పుడు మలేషియాలోనే ఉన్నావు కదా. మరి ఈ ఫొటోలు అన్నీ ఇక్కడే దిగినట్లుగా ఉన్నాయేంటి' అని ప్రభావతికి డౌట్ వస్తుంది. కానీ, రోహిణి అబద్దం చెప్పి కవర్ చేస్తుంది.

డ్యాన్స్ చేయమన్న రోహిణి
రోహిణితో మాట్లాడుతున్న సమయంలో ప్రభావతి 'నేను ఈ బస్ డ్రైవర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. చిన్నప్పుడు నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండేది. కానీ పెళ్లి తర్వాత అదంతా మర్చిపోయాను' అని చెప్తుంది. దీంతో రోహిణి 'మీరు ఇప్పుడు కూడా యంగ్‌గానే ఉన్నారు. కాబట్టి మళ్లీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఇక్కడే మీ టాలెంట్ నాకు చూపించండి' అంటుంది. దీంతో ప్రభావతి.. మీనాను పిలిచి హాల్ మొత్తం ఖాళీ చేయమని ఆర్డర్ ఇస్తుంది. దీంతో మీనా అక్కడ ఉన్న ఫర్నీచర్ మొత్తం తీసేస్తుంది.

అత్త తాగి.. కోడలేమో ఇలా
రోహిణి కోరగానే ప్రభావతి 'మొన్న మా అత్తగారేమో తాగి నాతో డ్యాన్స్ చేయించింది. ఇప్పుడు కోడలు మళ్లీ నాతో ఈ పని చేయిస్తుంది' అంటుంది. తర్వాత రోహిణి ఇక మొదలుపెడదామా అని అడగడంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ షురూ చేస్తారు. వాళ్లను మీనా అలా చూస్తూ ఉంటుంది. తర్వాత రోహిణి తన మొబైల్‌లో ఓ పాట పెట్టగా.. దానికి కూడా ప్రభావతి డ్యాన్స్ చేస్తుంది. అది చూసిన తర్వాత కోడళ్లు ఇద్దరూ చప్పట్లు కొడతారు. తర్వాత ప్రభావతి 'ఏంటి అలా చూస్తున్నావు' అనగా.. 'మీరు డ్యాన్స్ బాగా చేస్తున్నారు' అంటుంది. దీంతో ప్రభావతి పొంగిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 18th

భర్తతో నాట్యం చేస్తుందని
మీనాను జ్యూస్ తీసుకు రమ్మని ప్రభావతి పంపుతుంది. అప్పుడు రోహిణి మళ్లీ డ్యాన్స్ చేద్దాం అంటుంది. దీంతో ఆమె మళ్లీ ఆడడం మొదలుపెడుతుంది. అప్పుడే సత్యం అక్కడకు వస్తాడు. అతడిని చూసిన రోహిణి.. ప్రభావతితో చెబుతుంది. దీంతో ఆమె డ్యాన్స్ వేయడం ఆపేసి బూజు దులుపుతున్నట్లు నటిస్తుంది. తర్వాత సత్యం తన భార్యపై పంచులు వేస్తుంటాడు. అప్పుడు రోహిణి 'అత్తయ్య గారితో ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం' అంటుంది. దీంతో సత్యం 'మరి ఆ స్టేజ్ ముందు కూడా ఎవరైనా ఉండాలి కదమ్మా' అంటూ మరోసారి సెటైర్ వేస్తాడు.

తొక్కలో జాబ్ పీకట్లేదంటూ
బాలు ఓ కస్టమర్‌ను కారులో దించుతాడు. అప్పుడే అక్కడ మనోజ్ ఫోన్‌లో 'తొక్కలో జాబ్.. నేను ఏమి చేసినా ఆ ఓనర్ గాడు నన్ను పీకడం లేదు. పెళ్లాం రికమండేషన్ మీద చేయడం అంటే ఇబ్బందే' అంటాడు. అతడిని చూసి డౌట్ పడిన బాలు.. వెంటనే ఆ షోరూంలోకి వెళ్తాడు. అతడిని చూసి మనోజ్ కారు పక్కన దాక్కుంటాడు. కానీ, చూడనట్లుగా నటిస్తూ మనోజ్‌కు కొడుతుంటాడు. అప్పుడు ఫ్రెండ్ కారు కోసం వచ్చాను అని అబద్దం చెప్తాడు. కానీ, బాలు మాత్రం 'నువ్వు నన్ను చూసి దాక్కున్నట్లుగా ఉన్నావే' అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 18th

కస్టమర్ రావడంతో బుక్
బాలుతో మాట్లాడుతున్న సమయంలోనే ఓ కస్టమర్ వచ్చి కారు గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు మనోజ్ అతడికి కారులో ఉన్న ప్రత్యేకతలు అన్నీ వివరిస్తాడు. దీంతో బాలుకు మళ్లీ డౌట్ వస్తుంది. కానీ, మనోజ్ అతడిని నమ్మించేలా మాట్లాడతాడు. దీంతో బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం శృతి షూట్ చేస్తుండగా తన తల్లిదండ్రులు వచ్చి టిఫిన్ ఇస్తారు. వెంటనే బైక్ మీద తీసుకొచ్చిన ఆ అబ్బాయి ఎవరు అని ప్రశ్నిస్తారు. దీంతో తల్లిదండ్రులపై శృతి ఫైర్ అవుతుంది. వర్క్ చేస్తున్న దగ్గరకు వచ్చి ఎలా అడుగుతారని వాళ్లతో గొడవ పడుతుంది.

ప్రభావతి కొత్త అవతారం
డ్యాన్స్ చేయాలని నిర్ణయించుకున్న ప్రభావతి యోగా చేసేందుకు డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆమెను చూసి రోహిణి అవాక్కవుతుంది. ఆ తర్వాత ఆసనాలు ఎలా చేయాలో చూపిస్తుంది. కానీ, అవి చేసేందుకు ప్రభావతి తెగ ఇబ్బంది పడుతుంది. తర్వాత చేయలేక కింద పడిపోతుంది. అప్పుడామెను చూసిన సత్యం 'ఈ జంతువు ఏదో నా భార్యలా ఉందే' అని అంటాడు. దీంతో ప్రభావతి 'నేనేమీ జంతువును కాదు. నా కోడలు నాకు యోగాసనాలు నేర్పిస్తుంది' అని బదులిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X