Gunde Ninda Gudi Gantalu July 25th: మీనాను చూసి బాలు షాక్.. నిలదీసిన సుమతి.. నిజం తెలుసుకోవడంతో!

ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రోహిణి ఓట్స్ ఉప్మా చేయడంతో అది తినాలో తాగాలో తెలియక మనోజ్, ప్రభావతి ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు అది చూసిన బాలు తెగ పంచులు వేస్తుంటాడు. మధ్యలో కామాక్షి అక్కడకు రావడంతో ఆమెకు రోహిణి ఉప్మా ఇస్తుంది. కానీ ఆమె తప్పించుకుంటుంది. తర్వాత రోహిణి కోసం మనోజ్ ఆమె పార్లర్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఓ కస్టమర్ వాళ్లను హనీమూన్‌కు దుబాయ్ వెళ్లమని, ఆ ఖర్చులన్నీ తానే పెట్టుకుంటానని అంటుంది. ఇక, సుమతి వచ్చి మీనాతో మాట్లాడగా.. అవన్నీ విన్న ప్రభావతి నోటికి వచ్చినట్లు తిడుతుంది. దీంతో మీనా గుడికి వెళ్లిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 25th

నిన్ను ఎవరు బాధపెట్టారు?
గుడిలో తన బాధను చెప్పుకునేందుకు మీనా తడి బట్టలతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న బాలు అక్కడకు వస్తాడు. అప్పుడు అతడిని సుమతి, పార్మతమ్మ కలిసి బాలును ఏమైందో చెప్పమని ప్రశ్నిస్తారు. దీంతో అతడు తనకేమీ తెలియదని సమాధానం ఇస్తాడు. అనంతరం ప్రదక్షిణ చేస్తున్న మీనాను బాలు అడ్డుకుంటాడు. అంతేకాదు, ఏమైందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు మీనా బాధతో అతడిని హత్తుకుని ఏడుస్తుంది. దీంతో ఆమె బాధను అర్థం చేసుకున్న బాలు 'ఏమైంది చెప్పు? నిన్ను ఎవరు బాధపెట్టారు' అని అడుగుతాడు.

మీనా గురించి తెలియదు
మీనాను బాలు ప్రశ్నిస్తున్నా ఆమె మాత్రం నిజం చెప్పదు. అంతలో పంతులు వచ్చి 'చెప్పదు బాబు. మీనాకు భూదేవి అంత ఓర్పు ఉంది. అందుకే తన బాధను తనలోనే దాచుకుంటుంది. ఎప్పుడైనా ఇంత బాధ కలిగితేనే గుడికి వచ్చి అంగ ప్రదక్షిణలు చేస్తుంది. ఇంటికి తీసుకు వెళ్లి కాస్త నిదానంగా అడిగి తెలుసుకో' అంటాడు. తర్వాత బాలు ఆమెను ఇంటికి తీసుకు వెళ్తాడు. అంతేకాదు, 'మీరు కంగారు పడకండి. ఏమైందో తెలుసుకుంటాను' అని పార్వతమ్మ వాళ్లకు చెప్తాడు. అనంతరం ఆమెను ఇంటికి తీసుకు వెళ్లే సరికి ప్రభావతి వాళ్లు సరదాగా ఉంటారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 25th

మీనాను ఏమన్నావంటూ
ఇంటికి వెళ్లి తల్లిని కోపంగా చూస్తుండడంతో ప్రభావతి 'ఏంట్రా అలా మింగేసేలా చూస్తున్నావు? నీ పెళ్లాం ఏం చెప్పింది' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బాలు 'తను ఏమీ చెప్పలేదు. అసలు నోరు విప్పలేదు. తనను ఏమన్నావు? ఎందుకు అలా బాధపడుతుంది? మీనా ఏమైనా తప్పు చేసిందా' అని నిలదీస్తాడు. దీంతో తానేమీ అనలేదని ప్రభావతి అనగా మనోజ్ వాళ్లు అన్నారా అని బాలు అడుగుతాడు. అప్పుడు మనోజ్ తను ఉందని మేము పట్టించుకోము అని బదులిస్తాడు. దీంతో 'అవును తను మనిషి అన్న విషయాన్నే మీరు పట్టించుకోరు' అని ఫైర్ అవుతాడు.

సిగ్గులేని జన్మలు అంటూ
ఆ తర్వాత బాలు 'మీనా మనిషి అన్నది గుర్తించరు. కానీ, తను వండింది మాత్రం బర్రెలు తిన్నట్లు తింటారు. సిగ్గులేని జన్మలు. చూడు.. మీనా ఏదైనా తప్పు చేసుంటే నేను ఉన్నాను నాతో చెప్పు. అడగాలి అనుకుంటే నా ముందు అడుగు. అంతేకానీ భర్త లేని సమయంలో భార్యను అనే హక్కు ఎవరికీ లేదు' అంటాడు. దీంతో ప్రభావతి 'ఏయ్.. మా మీద ఏం చెప్పావు' అని అడుగుతుంది. అప్పుడు బాలు 'తను ఏమీ చెప్పలేదు. నోరు విప్పడం లేదని, ఏమన్నా పడుతుందని ఏమన్నా అన్నావని తెలిస్తే కన్న తల్లి అయినా క్షమించను' అని వార్నింగ్ ఇస్తాడు.

నీరసంగా ఉన్నా పనులు
బాలు అడిగినా మీనా చెప్పదు. పైగా నీరసంగా ఉందని అనడంతో బాలు వెళ్లిపోతాడు. అప్పుడు ప్రభావతి వాళ్లు షాపింగ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ, మీనా వంట చేయలేదని గమనించి.. పడుకున్న ఆమెను కిందకు పిలుచుకు వచ్చి వంట చేయమంటుంది. ఆమెకు నీరసంగా ఉన్నా ప్రభావతి మాత్రం వదలదు. రోహిణి వద్దని చెబుతున్నా మనోజ్ షాపింగ్‌కు వెళ్దాం అంటాడు. అనంతరం మీనా వంట చేయగా ప్రభావతి వాళ్లు షాపింగ్‌కు వెళ్తారు. అనంతరం వాళ్లు వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ కనిపించరు. అప్పుడు ప్రభావతి వచ్చి పడుకున్న మీనాపై ఫైర్ అవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 25th

ఇంట్లో వాళ్లపై బాలు ఫైర్
ప్రభావతి, మనోజ్, రోహిణిలు తింటుండగా బాలు వచ్చి మీనా గురించి అడుగుతాడు. అప్పుడామె నీరసంగా ఉందని అంటుంది. అప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లిన బాలు 'అసలు మీరు మనుషులేనా? అక్కడ ఒకరు ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా? పైగా తనతో వంట చేయించుకుని తింటారా? మీరు అసలు మనుషులేనా' అని ఫైర్ అవుతాడు. తర్వాత మీనా కోసం కషాయం చేయడం కోసం వచ్చి ఏం చేయాలో అని రవికి కాల్ చేసి అడుగుతాడు. తర్వాత అతడు చెప్పినవి అన్నీ వేసి ఆమె కోసం కషాయం తయారు చేసి ఇచ్చేస్తాడు.

మీనాకు తినిపించిన బాలు
కషాయం చేసిన తర్వాత మీనా కోసం బాలు అన్నం పెట్టుకుని తన గదిలోకి వెళ్లబోతాడు. అప్పుడు ప్రభావతి ఏదో అనడంతో అతడికి కోపం వస్తుంది. దీంతో 'ఒక మనిషి ఆరోగ్యం బాలేకుండా ఉంటే సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు' అని తిడతాడు. దీంతో రోహిణి బాధపడుతుంది. అనంతరం బాలు.. మీనాకు అన్నం తినిపిస్తాడు. ఆ సమయంలో బాలు 'నీకు నీరసం కాదు. మా అమ్మ ఏదో అని ఉంటుంది. ఆవిడ సంగతి తెలిసిందే కదా. ఏదైనా అంటే నాతో చెప్పు ఇలా చేయకు' అని తిడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X