Gunde Ninda Gudi Gantalu July 26th: తొలిసారి మీనా, బాలు రొమాన్స్.. నలుగురు పిల్లలు పుట్టడంతో ట్విస్ట్

చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీనా గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా వెళ్లిన బాలును పార్వతమ్మ, సుమతి ప్రశ్నిస్తారు. దీంతో బాలు మీనాను అడ్డుకుని ఏమైందని అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మాట్లాడదు. అప్పుడు పంతులు వచ్చి మీనాకు చాలా బాధ ఉందని చెప్తాడు. దీంతో బాలు ఆమెను ఇంటికి తీసుకెళ్తి తల్లికి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత బాలు లేని సమయంలో ప్రభావతి.. మీనాను వంట చేయమని తిడుతుంది. ఇక, మీనా నీరసంగా పడుకున్నా ప్రభావతి ఇబ్బంది పెట్టడంతో బాలు వచ్చి ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత భార్యకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 26th

బాలు, మీనా మధ్యన రొమాన్స్

నీరసంగా ఉన్న మీనాకు అన్నం తినిపించిన తర్వాత బాలు ఏదో పని చేస్తుంటాడు. అంతలో అక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మీనా 'వర్షం పడుతుంది కదా బట్టలు తీసి వస్తాను' అంటుంది. దీంతో బాలు 'ఏమీ వద్దు. కింద కొంత మంది పీకల దాక తిని కూర్చున్నారు కదా. వాళ్లు తీసుకుంటారు' అంటాడు. తర్వాత కరెంట్ పోవడం, ఉరుములు రావడంతో మీనా భయంతో బాలు హగ్ చేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ తొలిసారిగా రొమాన్స్ చేస్తారు. అయితే, ఇదంతా ప్రభావతి కంటున్న కల అని కొద్ది సేపటి తర్వాతనే అర్థం అవుతుంది.

కచ్చితంగా ఏదో జరుగుతుంది
మీనా, బాలు రొమాన్స్ చేసుకుంటున్నట్లు కల రావడంతో ప్రభావతి భయంగా నిద్ర లేస్తుంది. దీంతో పక్కనే ఉన్న సత్యం ఏమైందని అడగ్గా అబద్దాలు చెబుతుంది. దీంతో అతడు ఆమెపై పంచులు వేస్తాడు. అప్పుడు ప్రభావతి 'కచ్చితంగా నన్ను దెబ్బకొట్టేలా ఏదో జరగబోతుంది' అంటుంది. ఇక, తెల్లారగానే మీనా నిజంగానే బాలు మీద పడుకుని ఉంటుంది. ఆమెకు మెళకువ వచ్చి చూసుకుని మురిసిపోతుంది. మంచం మీద నుంచి పైకి లేవబోతుంటే బాలు ఆమె పైటను పట్టుకుని లాగుతాడు. దీంతో భర్తను చూస్తూ మీనా ఆనందంతో పొంగిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 26th

మీనా జోష్.. ప్రభావతి షాక్‌లో

ఆ తర్వాత మీనా మంచిగా రెడీ అయి ఫుల్ జోష్‌తో మెట్లు దిగుతూ ఉంటుంది. అప్పుడు ఆమెను చూసిన ప్రభావతి 'ఇదేంటి రాత్రంతా మూలుగుతూ కనిపించింది. ఆ పిచ్చోడేమో మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు ఇది లేడి పిల్లలా చెంగు చెంగున గెంతుకుంటూ వస్తుంది' అనుకుంటుంది. వెంటనే మీనాను ఆపుతుంది. అప్పుడామె నేను దేవుడికి దండం పెట్టుకోడానికి వెళ్తున్నా అంటుంది. కానీ, ప్రభావతి మాత్రం తలస్నానం చేసిన తర్వాత అలా చేయకూడదు అంటూ ఏదో చెప్తుంది. కానీ, మీనా మాత్రం ఆమెకు ఎదురు సమాధానం చెప్తుంది.

రాత్రి నిద్రపోనివ్వలేదంటూ
మీనా తీరు చూసి రాత్రి ఏదో జరిగింది అని అనుమానం పెంచుకుంటున్న ప్రభావతి బయటకు వెళ్లి చూసి ముగ్గు పెట్టలేదని అడుగుతుంది. దీంతో మీనా 'నేను ఇప్పుడే నిద్ర లేచాను. రాత్రి మీ అబ్బాయి అసలు పడుకోనిస్తేనే కదా' అంటుంది. అప్పుడు ప్రభావతి 'నువ్వు ఈరోజు దేవుడి దగ్గరకు వెళ్లొద్దు. రోహిణి వచ్చి దీపం పెడుతుంది. నువ్వు అందరికీ టిఫిన్ చెయ్' అంటుంది. అంతలోనే రోహిణి బ్రష్ చేసుకుంటూ వస్తుంది. అది చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. అప్పుడు తప్పక మీనాను దేవుడి ముందు దీపం పెట్టమని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 26th

మీనాకు నలుగురు పిల్లలు

కట్ చేస్తే.. మీనాకు డెలివరీ అయినట్లు బాలుకు కల వస్తుంది. అంతేకాదు, ఆమెకు ఏకంగా నలుగురు పిల్లలు పుట్టినట్లు అందులో కనిపిస్తుంది. దాని తర్వాత బాలు 'అమ్మో నలుగురు పిల్లలా? నాకు వద్దు' అని అరుస్తుంటాడు. దీంతో మీనా, సత్యం వచ్చి ఏమైందని అడుగుతారు. అప్పుడు బాలు 'అసలే నీకు పెన్షన్ రావడం లేదు. నా కారు ఈఎంఐలు కట్టాలి. ఇప్పుడు ఈ పిల్లలను ఎలా పోషించాలి' అని కలవరిస్తుంటాడు. దీంతో సత్యం అతడిని లేపుతాడు. తర్వాత బాలు 'మీనా రాత్రి ఏదో అలా జరిగింది. ఇంకెప్పుడూ అలా జరగనివ్వను' అని వెళ్లిపోతాడు.

నా మీదే జోకులు వేస్తావా?
ఆ తర్వాత మీనా మరోసారి ఫుల్ ఖుషీగా కిందకు వస్తుంటుంది. అది చూసిన ప్రభావతి 'ఆ బాలు గాడికి ఎస్సై ఉద్యోగం వచ్చిందన్నా నమ్ముతాను కానీ, కాపురం చేశాడంటే నమ్మను. ఇదేంటి ఇంత జోష్‌గా ఉంది? వాడేమో రాత్రంతా ఏదో పని చేసినట్లు ఇంకా నిద్ర లేవలేదు. కొంపదీసి రాత్రి నేను అనుకున్నదే జరిగిందా' అని అనుకుంటుంది. తర్వాత మీనాను పిలిచి కాఫీ పెట్టమని చెబుతుంది. అప్పుడామె పని చేసుకుంటూనే రాత్రి జరిగింది మొత్తం ఊహించుకుంటుంది. ఇక, బాలు మాత్రం బాత్రూంలో ఉండి రాత్రి తప్పు జరిగిపోయిందని అనుకుని ఫీల్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 26th

మీనా సంతోషంగా ఉంది

ఇక, మీనా కాఫీ తీసుకు రాలేదని ప్రభావతి కోపంగా ఉంటుంది. అప్పుడు సత్యం వచ్చి ఆమెపై పంచులు వేస్తుంటాడు. అంతేకాదు, 'మీనా సంతోషంగా ఉంది. అందుకే నువ్వు ఇలా ఉడుక్కుంటున్నావు' అంటాడు. దీనికి వాళ్ల కూతురు కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత రవి వచ్చి మీనాను పొగుడుతుంటాడు. అప్పుడు ఆ కాఫీలో మీనా షుగర్ ఎక్కువ వేసిందని తెలుస్తుంది. దీంతో అది తాగిన వాళ్లంతా షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X