Gunde Ninda Gudi Gantalu July 27th: రోహిణితో ప్రభావతి ప్లాన్.. పిల్లల గురించి నిజం తెలుస్తుందా?
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బయట వర్షం పడుతుండడంతో బాలు టెంప్ట్ అయిపోతాడు. దీంతో మీనాతో తొలిసారి రొమాన్స్ చేస్తాడు. ఇది ప్రభావతికి కలలా వస్తుంది. దీంతో వాళ్ల మధ్య అంతా జరిగిపోయిందని ఆమె కంగారు పడుతుంటుంది. ఆమె అనుకున్నట్లుగానే మీనా ఉదయాన్నే లేవగానే యమా జోష్‌తో కనిపిస్తుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. బాలుకు నలుగురు పిల్లలు పుట్టినట్లుగా కల వస్తుంది. దీంతో అతడు కంగారు పడిపోయి లేస్తాడు. తర్వాత మీనా సంతోషంగా ఉందని ఉడుక్కుంటున్న ప్రభావతికి సత్యం సెటైర్లు వేస్తాడు. ఇలా ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగిపోయింది.
రాబోయే ఎపిసోడ్‌లో బాలు కంగారుగా బయటకు వచ్చి 'మీనా మీకు ఏమైనా చెప్పిందా' అని అడుగుతాడు. దీంతో వాళ్లంతా ఏమీ చెప్పలేదని అంటారు. అప్పుడు పక్కనే ఉన్న మీనా కవర్ చేస్తూ అతడిని పక్కకు తీసుకు వెళ్లిపోతుంది. ఇక, మరోవైపు ప్రభావతి.. రోహిణితో 'ఎలాగైనా నువ్వే ముందు తల్లివి కావాలి. ఆ మీనా అస్సలు తల్లి కాకూడదు' అని ప్లాన్ చెబుతుంది. మరి రోహిణి అప్పటికే తల్లి అయిన విషయం చెప్తుందా? దాస్తుందా? అన్నది ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











