Gunde Ninda Gudi Gantalu July 29th: హీరోలా మారిపోయిన బాలు.. మీనా చేసిన పనితో షాక్.. తల్లివి కావాలంటూ!
చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బయట వర్షం పడుతుండడంతో బాలు టెంప్ట్ అయిపోతాడు. దీంతో మీనాతో తొలిసారి రొమాన్స్ చేస్తాడు. ఇది ప్రభావతికి కలలా వస్తుంది. దీంతో వాళ్ల మధ్య అంతా జరిగిపోయిందని ఆమె కంగారు పడుతుంటుంది. ఆమె అనుకున్నట్లుగానే మీనా ఉదయాన్నే లేవగానే యమా జోష్‌తో కనిపిస్తుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. బాలుకు నలుగురు పిల్లలు పుట్టినట్లుగా కల వస్తుంది. దీంతో అతడు కంగారు పడిపోయి లేస్తాడు. తర్వాత మీనా సంతోషంగా ఉందని ఉడుక్కుంటున్న ప్రభావతికి సత్యం సెటైర్లు వేస్తాడు. ఇలా ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగిపోయింది.

వాళ్లంతా అబద్దం చెప్పారు
మీనా సంతోషంలో కాఫీలో షుగర్ ఎక్కువగా వేసి తీసుకు వస్తుంది. దీంతో ప్రభావతి దాన్ని పెద్ద సీన్ చేస్తుంది. అప్పుడు సత్యాన్ని ప్రశ్నించగా.. 'కాఫీలో షుగర్ బాగానే ఉంది. చాలా బాగుంది' అని అబద్ధం చెప్తాడు. ఆ వెంటనే రవి కూడా చాలా బాగుందని అంటాడు. వాళ్లతో పాటు రవి చెల్లెలు కూడా తాగకుండానే బాగుంది అంటుంది. దీంతో ప్రభావతి 'నువ్వు ఎందుకు అబద్దం చెబుతున్నావే' అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె 'ఇద్దరు చెప్పారంటే నిజమే అయి ఉంటుందని చెప్పా' అంటుంది. తర్వాత వచ్చి తాగి చూసి కూడా అబద్దం చెబుతుంది.
నోరు జారిన బాలు ఫన్నీగా
అందరూ అబద్దం చెప్పగా రోహిణి, మనోజ్ వస్తారు. అప్పుడు రోహిణి ఆ కాఫీ తాగి నిజంగానే షుగర్ ఎక్కువగా వేసిందని అంటుంది. అంతలోనే అక్కడకు బాలు వస్తాడు. అప్పుడు 'ఏంటి అందరూ అలా ఉన్నారు. ఈ మీనా ఏమైనా చెప్పిందా' అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి 'నీ భార్య కాఫీలో ఉప్పు ఎక్కువ వేసింది తెలుసా' అనగా.. 'నా బతుకులో ఉప్పు కూడా వేసింది తెలుసా' అంటాడు. దీంతో ప్రభావతి 'ఇది ఎందుకు నవ్వుతుంది? వీడు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాడు' అంటుంది. దీంతో బాలు వాళ్ల నాన్నను ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతాడు.
నువ్వే మొదటి బిడ్డ కనాలి
బాలు తింగరి ప్రశ్నలు, మీనా నవ్వు చూసిన తర్వాత వాళ్ల మధ్య రొమాన్స్ జరిగిపోయిందని ప్రభావతి ఫిక్స్ అయిపోయింది. దీంతో వెంటనే రోహిణిని తీసుకుని పక్కకు వెళ్తుంది. అప్పుడు 'అమ్మా రోహిణి.. ఎలాగైనా నువ్వే ముందుగా తల్లివి కావాలి' అంటుంది. దీనికామె నాదేముంది అత్తయ్యా అంటుంది. అప్పుడు ప్రభావతి 'నువ్వే చేయాలి. నువ్వే మొదటి బిడ్డను కనాలి' అని చెబుతుంది. దీంతో రోహిణి ఓకే అని అంటుంది. తర్వాత బాలు తన గదిలోకి వచ్చి కంగారు పడుతుంటాడు. అప్పుడు మీనా వచ్చి మాట్లాడుతుంది.
బాలు షర్ట్.. వాళ్లంతా షాక్
స్నానం చేసి వచ్చిన బాలుకు మీనా తన చేత్తో ఐరన్ చేసి పెట్టిన షర్ట్ ఇస్తుంది. అంతేకాదు, అతడిని ఇన్‌షర్ట్ కూడా చేసుకోమని బలవంతం చేస్తుంది. దీంతో ఆమెను పంపిస్తాడు. అనంతరం మీనా సిగ్గు పడుతూ కిందకు వస్తుంటే ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు. అలాగే, రోహిణి వాళ్లు బాలు ఏదో చేశాడు అందుకే సంతోషంగా ఉందని మాట్లాడుకుంటారు. అనంతరం బాలు స్టైలిష్ గెటప్‌తో కిందకు వస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్లంతా అవాక్కవుతారు. అప్పుడు ప్రభావతి వాళ్లు వెటకారంగా నవ్వడంతో బాలు వాళ్లను కోతులతో పోలుస్తూ పంచులు వేస్తాడు.
దొంగతనం చేయలేదని
బాలును చూసిన తర్వాత ప్రభావతి 'మీ కొడుకు ఏ ఫ్లైట్‌కు పైలట్ అండీ' అని వెటకారంగా అంటుంది. దీంతో బాలు 'నేను కారు డ్రైవర్‌ను. ఈ షర్ట్ నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. నేను ఎవరి దగ్గరా లక్షల రూపాయలు దొంగతనం చేయలేదు. లేదంటే పెళ్లాం కష్టార్జితంతో కొనిస్తే తిరగడం లేదు. ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్ట్ కూడా ఈ పార్లరమ్మ కొనిచ్చిందే కదా' అంటాడు. తర్వాత రవి వచ్చి బాలును ఫొటోలు తీస్తాడు. అనంతరం సత్యం వచ్చి కూడా ఫొటోలు తీస్తాడు. అనంతరం మీనా వచ్చి 'మా ఇద్దరిని కూడా ఫొటోలు తీయండి' అని పక్కన నిల్చుంటుంది.
వాళ్లను జంటగా చూసి
మీనా, బాలు క్లోజ్‌గా నిల్చుని ఫొటోలు దిగుతుండగా ప్రభావతి వాళ్లు కుళ్లుకుంటారు. ఆ తర్వాత అందరూ కూర్చుని టిఫిన్ చేస్తుంటారు. కానీ, ప్రభావతి వాళ్లు మాత్రం రారు. అప్పుడు రవి వాళ్లను పిలవగా బాలు 'ఎవరిని పట్టుకుని పిలుస్తున్నావురా. వాళ్లు టిఫిన్ తినరు.. తాగుతారు' అంటూ పంచులు వేస్తాడు. తర్వాత బాలుకు మీనా కొసరి కొసరి వడ్డిస్తుండడం చూసి ప్రభావతి ఇబ్బంది పడుతుంది. టిఫిన్ తిన్న తర్వాత బాలు వెళ్తూ వెళ్తూ తల్లిని ఉడికించి వెళ్తాడు. అనంతరం బాలుకు మీనా సెండాఫ్ ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











