Gunde Ninda Gudi Gantalu July 2nd: కోమాలోకి వర్ధన్.. పోలీసులకు దొరికిపోయిన రోహిణి.. బాలు డౌట్ పడడంతో!

ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మనోజ్, రోహిణి ఇంటికి రావడంతో వాళ్లకు హారతి ఇచ్చేందుకు ప్రభావతి రెడీ అవుతుంటుంది. అంతలోనే సుశీల చెప్పడంతో మీనా హారతి ఇవ్వబోతుంది. అది చూసిన ప్రభావతి ఆమెను తిట్టబోతుంది. అప్పుడు సుశీల వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వర్ధన్ ఆస్పత్రిలో ఉంటాడు. అతడు కోమాలోకి వెళ్లిపోవడంతో పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. వర్ధన్ చివరిగా బాలు కారు ఎక్కాడని చెప్పడంతో అతడి దగ్గరకు వెళ్తారు. అక్కడ బాలు జరిగింది అంతా చెప్తాడు. దీంతో రోహిణి, పూజ తెగ కంగారు పడిపోతుంటారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 2nd

బాలుకు పెరిగిన ఫ్యామిలీ సపోర్ట్
పోలీసులు బాలు గురించి ఇంటికి రాగానే ప్రభావతి నోరు పారేసుకుంటుంది. కానీ, ఎస్సై మాత్రం బాలు ఏ తప్పు చేయలేదని, వర్ధన్ గురించి ఏమైనా సమాచారం తెలుసేమో అని తెలుసుకుంటానికే వచ్చామని అంటాడు. దీంతో మీనా 'చూశారా అత్తయ్య గారు.. మా ఆయన ఏ తప్పు చేయలేదు' అని అంటుంది. అప్పుడే సత్యం కూడా 'నేరం చేసినట్లు మాట్లాడావు కదా. వాడు ఒక ఆడపిల్ల జీవితం కాపాడడానికి చేయి చేసుకున్నాడు తప్పా.. నా కొడుకు ఏ తప్పూ చేయలేదు' అని సీరియస్ అవుతాడు. దీంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది.

అడ్డంగా దొరికిపోయిన రోహిణి
ఆ తర్వాత పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఎస్సైతో 'సార్.. ఆ వర్ధన్ ఒక నెంబర్‌ను పదే పదే కాల్స్ చేశాడు. ఆ నెంబర్ ఇదిగోండి' అని చూపిస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న మనోజ్ 'అయితే ఆ నెంబర్ ఎవరిదో మీరే కాల్ చేసి చూడండి' అంటాడు. దీంతో ఎస్సై ఆ నెంబర్‌కు కాల్ చేస్తాడు. అప్పుడు రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అంతేకాదు, 'అంటే.. వాడు ఏడిపించేది నిన్నేనా' అని సత్యం ప్రశ్నిస్తాడు. అప్పుడు బాలు 'అసలు వాడి దగ్గర ఈ పార్లర్ అమ్మ ఎందుకు ఉంది' అని అడుగుతూ అందరిలో డౌట్ కలిగేలా చేస్తాడు.

అబద్దాలు చెప్పి తప్పించుకుని
అందరూ డౌట్ పడడంతో రోహిణి 'నాకు ఆయన కాదు.. వాళ్ల వైఫ్ కాల్ చేసింది. నేను బ్యూటీ పార్లర్ నడుపుతాను కదా. తనకు మేకప్ చేయాలని కాల్ చేసింది. నేనేమో నా పెళ్లి ఉంది. ఇప్పుడెలా చేస్తాను అని ప్రశ్నించాను. అయినా వదలకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడకు వస్తాను అని అంది. కానీ, నేను కుదరదు అని చెప్పి పెట్టేశాను. అంతే.. అంతకు మించి నాకు ఏమీ తెలీదు' అని అబద్దాలు చెప్తుంది. అప్పుడే పూజా వచ్చి 'ఓ ఆ ఫోనా? ఒకసారి నేను కూడా లిఫ్ట్ చేశా' అని రోహిణికి సపోర్ట్ చేస్తుంది. తర్వాత పోలీస్ అడిగినా రోహిణి అబద్దం చెప్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 2nd

రోహిణిపై బాలుకు పెరిగిన డౌట్
పోలీసులు వెళ్లిపోయిన తర్వాత బాలు 'నాకు ఎక్కడో తేడా కొడుతుంది. సరిగ్గా నా క్యాబ్‌లో వచ్చి తన్నులు తిన్న వాడి సెల్ నుంచి ఈ పార్లరమ్మకు అన్ని కాల్స్ రావడం నాకు జీర్ణం కావడం లేదు' అంటాడు. అప్పుడు వాళ్ల తమ్ముడు కూడా డౌట్ పడుతూ మనోజ్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో రోహిణి 'మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఆ విషయం మనోజ్‌కు చెప్పాలని అనుకున్నా. అప్పుడే మామగారు నా ఫోన్ తీసుకున్నారు' అంటుంది. తర్వాత ప్రభావతిపై బాలు ఫైర్ అవగా.. మీనా కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్లకు రోహిణి కూడా మద్దతు చెప్తుంది.

వాళ్ల ఆవిడ నీకెలా కాల్ చేసింది
మనోజ్ తమ్ముడు 'వదిన మార్నింగ్ నుంచి సాయంత్రం వరకూ ఫోన్ వాడి దగ్గరే ఉంది కదా. మరి వాళ్ల ఆవిడ నీకు కాల్ ఎలా చేసింది' అని ప్రశ్నిస్తాడు. తర్వాత అందరూ ఎవరి పనికి వాళ్లు వెళ్లిపోతారు. అనంతరం పక్కకు వచ్చిన పూజ 'నిన్ను టెన్షన్ పడొద్దని చెప్పాను కదా. ఎందుకు అందరి ముందూ అలా భయపడుతున్నావు' అని రోహిణిని తిడుతుంది. దీనికామె 'నేనేమైనా యాక్టర్‌ను అనుకున్నావా? ఎలా మేనేజ్ చేస్తాను' అని అంటుంది. తర్వాత పూజ 'నేను వెళ్లి వాడు ఎలా ఉన్నాడో చూస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రవి ఆమెతో.. బాలు మీనాతోనే
రవికి అతడి స్నేహితురాలు ఫోన్ చేస్తుంది. అంతేకాదు, ఏమైనా తినాలని అనిపిస్తుందని చెబుతుంది. దీంతో అతడు రెస్టారెంట్‌లోనే ఉన్నాను.. అక్కడకు వస్తే ఏమైనా చేసి పెడతాను అని చెప్తాడు. దీంతో ఓకే అంటుంది. ఇక, బాలు తన గదిలోకి వస్తుండగా.. మీనా చీర సరిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అతడు కంగారు పడతాడు. అప్పుడు బాలు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటూ మీనాను వెళ్లిపోమంటాడు. కానీ, ఆమె ముందే షర్ట్ మార్చుకుంటాడు. తర్వాత అతడికి బటన్స్ సరిగా లేకపోవడంతో మీనా వాటిని సరిచేస్తుంది.

వర్ధన్ ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసిన పూజ.. రోహిణికి కాల్ చేస్తుంది. అంతేకాదు, అతడు కోమాలోనే ఉన్నాడని, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అని చెబుతుంది. దీంతో రోహిణి ఫుల్ ఖుషీ అవుతుంది. అంతేకాదు, వెంటనే బయటకు వచ్చి ప్రభావతిని హగ్ చేసుకుంటుంది. అలాగే, 'నేను ఎంతో సంతోషంగా ఉన్నా. మా అమ్మ ఉంటే పెళ్లి ఎలా చేసేదో మీరు అలానే చేశారు' అని చెబుతుంది. అప్పుడు ప్రభావతి కూడా ఆమెపై ప్రేమను చూపిస్తూ మాట్లాడుతుంది. అదే సమయంలో మీనాను తిడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X