Gunde Ninda Gudi Gantalu July 30th: రోహిణికి తల్లి ఫోన్.. నిజం తెలియడంతో షాక్.. బాలుకు గుడ్ న్యూస్
గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీనా పెట్టిన కాఫీ షుగర్ ఎక్కువగా ఉన్నా ఇంట్లో వాళ్లు బాగానే ఉందని ప్రభావతిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా అందరూ ఆ గొడవలో ఉండగా బాలు అక్కడకు వచ్చి మీనా మీకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. తర్వాత వాళ్ల తండ్రిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తాడు. దీంతో ప్రభావతికి సీన్ అర్థం అవుతుంది. వెంటనే రోహిణిని పక్కకు తీసుకు వెళ్లి ఈ ఇంట్లో నువ్వే ముందు తల్లివి కావాలి అని చెబుతుంది. తర్వాత బాలు హీరోలా మారిపోయి వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు మీనా తన భర్తతో కలిసి ఫొటోలు దిగి సంతోషపడుతుంది.

ఒక సెల్ఫీని తీసుకుందామా
కంగారుగా బయటకు వెళ్లిపోతున్న బాలును మీనా ఆపుతుంది. దీంతో అతడు ఆగకుండా వెళ్లిపోదామని అనుకుంటాడు. అప్పుడు మీనా 'మీరు వస్తారా? లేకపోతే నన్నే మీ దగ్గరకు రమ్మంటారా' అని అడుగుతుంది. దీంతో మీనా 'మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది' అంటుంది. అప్పుడు బాలు వణుక్కుంటూనే ఫొటో తీస్తాడు. అనంతరం అతడు మొహమాటంగానే 'నిన్ను ఒకటి అడగాలని ఉంది' అంటాడు. దీంతో మీనా ఏదో ఊహించుకుని అడగమంటుంది. అప్పుడు బాలు 'ఈ టక్కు తీసేస్తాను' అంటాడు. దీనికి మీనా కోపంతో అతడి ఇన్‌షర్ట్ తీసేస్తుంది.
నీకు న్యాయం జరిగిందమ్మా
బాలు వెళ్లిపోగానే సంతోషంగా మీనా లోపలికి వస్తుండగా సత్యం ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటాడు. అప్పుడామెను చూసిన అతడు 'అబ్బా కోర్టు పని మీద వెళ్తున్నానమ్మా. నువ్వు ఎదురు వచ్చావు అంటే తీర్పు మనకు అనుకూలంగా వచ్చినట్లే' అంటాడు. దీనికి మీనా 'మంచి వాళ్లకు ఎప్పుడూ న్యాయమే జరుగుతుంది మావయ్య' అంటుంది. దీంతో సత్యం 'నీకు న్యాయం ఈరోజు జరిగిందని అర్థం అయిందమ్మా. నీ పెళ్లైన ఇన్నాళ్లకు నీ ముఖంలో సంతోషం చూశా. బాలుతో పెళ్లి చేసి నీకు అన్యాయం చేశానని అనుకున్నా. అది ఈరోజు పోయింది' అంటాడు.

రోహిణి తల్లికి ఇబ్బందులు
రోహిణి తల్లి సుగుణమ్మ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోబోతుంది. అంతలోనే అక్కడ ఓ ఆవిడ ఆమెను పట్టుకుంటుంది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్తానంటే వద్దు అంటుంది. దీంతో ఆ మహిళ 'జాగ్రత్తగా ఉండు సుగుణమ్మ. అసలే నిన్ను చూసుకోడానికి ఎవరూ లేరు. ఒకవేళ నీకు ఏమైనా అయితే నీ మనవడు ఒంటరి వాడు అవుతాడు. వాడిని చూసుకోడానికి కూడా ఎవరూ లేరు' అంటుంది. దీంతో సుగుణమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఆమె అన్న మాటలను గుర్తు చేసుకుంటూ 'నా మనవడు ఒంటరివాడు కాకూడదు' అనుకుంటుంది.
రోహిణికి సుగుణమ్మ ఫోన్
ఆ తర్వాత సుగుణమ్మ.. రోహిణి ఫోన్‌కు కాల్ చేయగా ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు సుగుణమ్మ 'అమ్మా కల్యాణీ.. ఎలా ఉన్నావమ్మా' అంటుంది. దీంతో ప్రభావతి ఎవరు అనడంతో వెంటనే కాల్ కట్ చేస్తుంది. అప్పుడు ప్రభావతి గతంలో కూడా ఈ కల్యాణీ పేరు ప్రస్తావనకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అంతేకాదు, 'ఈ కల్యాణి ఎవరు? నా గొంతు వినగానే ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు. కనీసం రాంగ్ నెంబర్ అని కూడా చెప్పకుండానే ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు' అని డౌట్ పడుతుంది.

పూజారికి చెప్పేసిన బాలు
బాలు పరుగు పరుగున గుడికి వచ్చి అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. అప్పుడాయన నువ్వు మీనా భర్తవు కదా అంటాడు. అలా అలా ఏదేదో మాట్లాడుతూ చివరకు 'నా బ్రహ్మచర్యం పోయింది. మీరు గ్రహణం పట్టిన తర్వాత గుడికి ఏదో చేస్తారు కదా. నాక్కూడా అలాగే చేయండి. నన్ను ఎలాగైనా పూజకు పనికి వచ్చే పువ్వులా మార్చండి' అంటాడు. దీంతో అసలేం జరిగింది అని ఆయన సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు బాలు అసలు విషయం చెప్తాడు. దీనికి పంతులు 'దివ్యమైన ముహూర్తంలో నీ శోభనం జరిగింది. ఇది డైలీ సీరియల్‌గా సాగుతుంది' అంటాడు.
లెక్కలన్నీ నేనే చూస్తాను
రోహిణి కనిపించగానే ప్రభావతి 'నువ్వు ఇంకా బ్యూటీ పార్లర్‌కు వెళ్లలేదేంటి' అని అడుగుతుంది. దీనికామె స్టాఫ్ ఓపెన్ చేస్తారు అంటుంది. అప్పుడు ప్రభావతి 'డబ్బు దగ్గర అలా అజాగ్రత్తగా ఉండకూడదు. నన్ను రమ్మంటే చెప్పు వచ్చి క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటాను' అంటుంది. దీంతో రోహిణి మీరు టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటా అంటుంది. అప్పుడు ప్రభావతి 'అమ్మా వడ్డీ కట్టాలి కాస్త డబ్బులు చూడు' అంటుంది. దీంతో రోహిణి ఓకే అంటుంది. అనంతరం ప్రభావతి.. కల్యాణీ గురించి ప్రస్తావన తెస్తుంది. కానీ, రోహిణి మాత్రం అబద్దం చెప్పి కవర్ చేస్తుంది.

తల్లికి ఫోన్ చేసి తిట్టింది
ప్రభావతికి దొరికిపోవడంతో రోహిణి తన తల్లి సుగుణమ్మకు కాల్ చేస్తుంది. అంతేకాదు, ఆమెను మాట్లాడనీయకుండా తిడుతుంది. అప్పుడు ఆమె తల్లి నిజం చెప్పేయొచ్చు కదా అని అనడంతో రోహిణి శివాలెత్తిపోతుంది. దీంతో సుగుణమ్మ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతుంది. అప్పుడు రోహిణి కూల్ అవుతుంది. అప్పుడు సుగుణమ్మ 'నా పరిస్థితి అస్సలు బాలేదు. నాకేమైనా అయితే నీ కొడుకు అనాథ అవుతాడు' అని తేల్చి చెప్తుంది. మరోవైపు సుశీలమ్మకు ఫోన్ చేసిన మీనా జరిగింది మొత్తం చెప్తుంది. దీంతో ఆమె సంతోషిస్తుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











