Gunde Ninda Gudi Gantalu July 31st: ప్రభావతి ఇంట్లో మరో షాకింగ్ సీన్.. అతడిని కొట్టాలని ప్లాన్
దాదాపు రెండు మూడు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కంగారుగా బయటకు వెళ్లిపోతున్న బాలును మీనా ఆపుతుంది. దీంతో అతడు ఆగకుండా వెళ్లిపోదామని అనుకుంటాడు. అప్పుడు మీనా ఆపి బాలుతో సెల్ఫీ దిగుతుంది. అనంతరం బాలు గుడికి వెళ్లి తనకు ఫస్ట్ నైట్ జరిగిన విషయం పంతులుకు చెప్తాడు. దీంతో ఆయన ముహూర్తం చూసి మంచి జరుగుతుందని చెప్తాడు. తర్వాత రోహిణి తల్లి ఆమెకు కాల్ చేయగా ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది. తర్వాత ఆమె తన తల్లికి కాల్ చేసి సీరియస్ అవుతుంది. అప్పుడు జరిగింది చెప్పడంతో బాధపడుతుంది. ఇక, ఫస్ట్ నైట్ గురించి సుశీలకు ఫోన్ చేసి మీనా చెబుతుంది.



Click it and Unblock the Notifications











