Gunde Ninda Gudi Gantalu July 3rd: నోరు జారిన రోహిణి.. మీనాకు షాకిచ్చిన అత్త.. బాలు రావడంతో ట్విస్ట్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
వర్ధన్ క్యాబ్ డీటేల్స్ చూసి బాలు కోసం వచ్చిన పోలీసులకు అతడు అసలు నిజం చెప్తాడు. ఒక అమ్మాయిని ఏడిపిస్తుండడం వల్లే కొట్టానని అంటాడు. అప్పుడే పోలీసులకు వర్ధన్ ఎక్కువగా కాల్ చేసిన నెంబర్ దొరుకుతుంది. దానికి కాల్ చేయగా రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు అందరూ ఆమెపై డౌట్ పడతారు. దీంతో వర్ధన్ వాళ్ల భార్య మేకప్ కోసం కాల్ చేసిందని అబద్దం చెప్తుంది. కానీ, బాలు వాళ్లకు డౌట్ వస్తూనే ఉంటుంది. తర్వాత పూజ వెళ్లి వర్ధన్ గురించి ఎంక్వైరీ చేసి రోహిణికి చెప్తుంది. ఇక, బాలు, మీనా మధ్య చిన్నగా రొమాన్స్ ప్రారంభం అవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 3rd

నోరు జారి బుక్కైన రోహిణి

రోహిణి సంతోషంగా ఉండడంతో పాటు ప్రభావతిని పొగుడుతూ మాట్లాడడంతో ఆమె పొంగిపోతుంది. అంతేకాదు, మీనాను తిట్టుకుంటూ రోహిణిపై ప్రేమను చూపిస్తుంది. దీంతో పక్కనే ఉన్న సత్యం తన భార్యపై పంచులు వేస్తుంటాడు. తర్వాత ప్రభావతి.. రోహిణి తండ్రి గురించి మాట్లాడుతుంది. దీంతో ఆయన ప్రస్తావన తీసుకు రావొద్దని చెప్తుంది. ఇక, మనోజ్ 'పెళ్లి గందరగోళంగా జరిగింది. తర్వాత చేయాల్సిన తంతు చేయండి' అంటాడు. అప్పుడు సత్యం దానికి రోహిణి పుట్టింటి వాళ్లు కావాలని అనడంతో రోహిణి అయితే మా అమ్మను పిలుస్తా అని నోరు జారుతుంది.

అమ్మ చనిపోయింది కదా
రోహిణి తన తల్లి వస్తుంది అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు సత్యం 'అదేంటమ్మా.. మీ అమ్మ చనిపోయింది అని చెప్పావుగా' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె కవర్ చేసుకుంటూ ప్రభావతిని చూపించి 'ఈ తల్లే నా తల్లి స్థానంలో ఉండి జరిపిస్తుంది. ఇంక నాకు ఏ లోటు ఉండదు. ఎందుకంటే పుట్టిల్లు మెట్టెనిల్లు ఒకటే అయింది' అంటుంది. తర్వాత ఆమెను ప్రభావతి ముద్దు పెట్టుకుని మీనాను పిలిచి దెప్పుతూ మాట్లాడుతుంది. అంతేకాదు, మీనాను పనిమనిషి అంటూ అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో సత్యం కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 3rd

బాలు ఎంట్రీతో ఫన్నీగా

అత్త అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసిన మీనాతో రోహిణి ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు ఇద్దరూ పేర్లు పెట్టి పిలుచుకుందాం అని డిసైడ్ అవుతారు. అనంతరం అందరూ వచ్చి సిద్ధం అవుతూ ఉంటారు. అప్పుడు ప్రభావతి భర్తను పిలవగా 'భార్యను కంట్రోల్ చేయడం ఎలా' అనే వీడియోలు చూస్తున్నా అంటాడు. అంతలోనే బాలు ఎంట్రీ ఇస్తాడు. అతడి వచ్చినప్పటి నుంచి తల్లిపై సెటైర్లు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తాడు. మధ్య మధ్యలో కొన్ని పంచులు వేస్తుంటాడు. అప్పుడు సత్యం అతడిని కంట్రోల్‌గా ఉండమని చెప్పగా.. తల్లిపైనే పంచులు వేస్తాడు.

ఎవరు తీస్తే వాళ్లదే అని
అనంతరం ప్రభావతి బిందెలో ఉంగరం వేసి 'అమ్మా రోహిణి ఉంగరం నువ్వే తీయాలి. మనదే పైచేయి కావాలి' అని అంటుంది. అందులో మనోజ్ గెలుస్తాడు. దీంతో ప్రభావతి నిరాశ చెందుతుంది. అప్పుడు రోహిణి 'మా ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే' అంటుంది. దీంతో ప్రభావతి పొంగిపోతూ 'చూశావారా మనోజ్.. నువ్వు గెలవడం కోసం తను ఓడిపోయింది' అని అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న బాలు 'అయితే.. తనను చూసి నువ్వు కూడా నేర్చుకో' అని పంచ్ వేస్తాడు. అనంతరం ఒక స్వీట్‌ను ఇద్దరూ తినిపించుకునే ఆటను మొదలుపెడతారు.

కొత్త స్వీట్ చేసిన రవి

తన ఫ్రెండ్‌ శృతిని రవి రెస్టారెంట్‌కు రమ్మని చెప్పడంతో ఆమె వస్తుంది. అప్పుడు రవి కోసం వేచి చూస్తుండగా అతడు కేక్ పట్టుకుని వస్తాడు. అప్పుడామె 'నాకోసం ఏదైనా స్పెషల్‌గా స్పైసీ డిష్ చేస్తావని అనుకుంటే ఇది తీసుకు వచ్చావేంటి' అని అంటుంది. అప్పుడతను 'దీని పేరు మిథునం. అంటే ఇద్దరు అని అర్థం. వాలంటైన్స్ డే కోసం తయారు చేసే స్పెషల్ డిష్ ఇది. ఇందులో కొంచెం స్వీట్, కొంచెం స్పైసీ ఉంటుంది' అంటాడు. దీంతో శృతి వచ్చే వాలంటైన్స్ డే కోసం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇదే రెస్టారెంట్‌కు వస్తానని రవికి చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 3rd

ఏమైనా అంటే చెప్పు
ప్రభావతితో రోహిణి 'ఆంటీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఆ మీనా వాళ్ల ఆయన ఏంటి మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటాడు' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రభావతి 'వాడు అదో టైపు. వాడికి ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలీదు. ఆ మీనా కూడా అంతే. వాళ్లిద్దరూ చదువు రాని దద్దమ్మలు. నువ్వు మంచిదానివి. వాళ్లు సర్ధుకుపోయే రకం కాదు. ఆ మీనా చూడ్డానికి పిల్లిలా సైలెంట్‌గా ఉంటుంది కానీ, ఈ ఇంట్లో అన్ని సమస్యలకు అదే కారణం. నిన్ను ఏమైనా బాధ పెడితే నాతో చెప్పు' అనడంతో.. వాళ్లు నన్ను ఏమైనా అన్నా పట్టించుకోనని రోహిణి చెప్తుంది.

సాంబార్‌లో చేయి

ఇక, బాలుకు మీనా భోజనం వడ్డిస్తుంది. అప్పుడతను 'పెళ్లి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు బిందెలో ఉంగరం తీయిస్తున్నారేంటి' అని మీనాతో అంటాడు. దీనికామె 'వాళ్లకు లేటుగానైనా చేస్తున్నారు. మనకు అది కూడా జరగలేదు కదా' అంటుంది. అనంతరం అక్కడే ఉన్న సాంబార్‌ను బిందె అనుకుని అందులో చేయి పెట్టి తిప్పుతూ బిందెలా ఊహించుకుంటుంది. దీంతో బాలు నెత్తి మీద ఒకటి కొడతాడు. దీంతో ఆమె ఊహలో నుంచి బయటకు వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X