Gunde Ninda Gudi Gantalu July 4th: శోభనంలో రోహిణికి షాకిచ్చిన మనోజ్.. మీనాకు మరో ఘోర అవమానం

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలు చేయాలంటే పుట్టింటి వాళ్లు ఉండాలని సత్యం అనడంతో రోహిణి మా అమ్మ వస్తుంది అని నోరు జారుతుంది. దీంతో అందరూ షాక్ అవుతూ మీ అమ్మ లేదని అన్నావుగా అంటారు. దీంతో ఆమె అత్తగారినే అమ్మ అని కవర్ చేస్తుంది. తర్వాత మనోజ్, రోహిణితో కొన్ని ఆటలు ఆడిస్తారు. అప్పుడు బాలు, ప్రభావతి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అనంతరం బాలు, మీనా ఏమైనా అంటే చెప్పమని రోహిణితో ప్రభావతి చెబుతుంది. అలాగే, వాళ్ల గురించి చెడుగా చెప్తుంది. ఇక, మీనా, తన భర్తతో ఆటలు ఆడినట్లు ఊహించుకుంటుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 4th

బాగా అవమానించిన ప్రభావతి:పూల దండల ఆర్డర్ వచ్చిందని మీనా బంధువులు పువ్వులు తీసుకు వచ్చి ఇస్తారు. అప్పుడు బాలు వాళ్లతో మంచిగా మాట్లాడి వెళ్లిపోతాడు. అంతలోనే అక్కడకు రోహిణి వచ్చి వీళ్లు ఎవరు అని అడుగుతుంది. దీంతో ప్రభావతి 'ఇండియాలోనే ఇంత పెద్ద పూల వ్యాపారం చేసేవాళ్లు లేరు. రోజూ కోట్లు సంపాదించుకుని పూల గంపల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ డ్రైవర్ గాడి పెళ్లాం పూలలోనే పుట్టి పెరిగింది కదా. ఆ బుద్దులు ఎక్కడికి పోతాయి. వాళ్ల అమ్మకు ఎక్కువ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ అమ్మగారికి పంపిస్తే ఇంట్లో పని ఆపేసి ఆ పని మీద పడుతుంది' అంటుంది.

అత్తకు ఎదురు చెప్పిన మీనా:మీనా మంచి నీళ్లు తీసుకు వచ్చి ఇస్తుంటే వాళ్లు 'వద్దమ్మా.. వెళ్లి మనుషులు తినే అన్నం తినాలి. మీ అత్తగారి ఇంటి నీళ్లు తాగితే కుడితి తాగినట్లే ఉంటుంది' అంటూ వెళ్లిపోతారు. దీంతో మీనా బాధగా ఆ పూల దండలు కట్టేందుకు కూర్చుంటుంది. అప్పుడు ప్రభావతి 'కొన్ని పువ్వులు పక్కన పెట్టు. నా కొడుకు కోడలికి శాంతి ముహూర్తం చేయించాలి' అంటుంది. దీంతో మీనా 'ఈ పువ్వులు తీయడం కుదరదు అత్తయ్యా. ఇవి మా పువ్వులు అంటే ఎవరో ఆర్డర్ ఇస్తే తీసుకు వచ్చిన పువ్వులు. ఇందులో నుంచి తీయడం కుదరదు' అంటూ ఎదురు చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 4th

బాలు, మీనాకు కూడా చేద్దాం:మీనాకు, ప్రభావతికి డిస్కర్షన్ జరుగుతుండగా సత్యం వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడామె మనోజ్, రోహిణికి శాంతి ముహూర్తం పెడుతున్నట్లు చెప్తుంది. అప్పుడాయన 'అలాగే బాలు, మీనాకు కూడా జరిపిద్దాం' అని అంటాడు. కానీ, దీనికి ప్రభావతి ఒప్పుకోదు. పైగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు బాధ పడిన మీనా 'అత్తయ్య వదిలేయండి. బొమ్మల కొలువులో బొమ్మలా ఎప్పుడూ రెడీ అయి ఉండడం నాకు ఇష్టం ఉండదు' అంటుంది. అప్పుడు సత్యం సర్ధి చెప్పబోతాడు. అయినా సరే మీనా మాత్రం తమకు శోభనం వద్దని తేల్చి చెబుతుంది.

నా ఇష్ట ప్రకారం జరగలేదు:ఆ తర్వాత సత్యం 'ముందు పెళ్లైన వాళ్లను వదిలేసి.. వీళ్లకు ఎలా శాంతి ముహూర్తం చేస్తాం' అని అడుగుతాడు. దీంతో ప్రభావతి 'ముందు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగలేదు. మీ అమ్మ, మీరు కలిసి ఈ పూల గంపను నాకు అంటగట్టారు. ఆ ముహూర్తం కూడా మీ అమ్మ, మీరు జరిపించండి' అంటుంది. దీంతో మీనా అసలు గొడవ వద్దులేండి అంటుంది. అప్పుడు రోహిణి కూడా మీనాకు సపోర్ట్ చేస్తుంది. దీంతో మనోజ్ కలుగజేసుకుని మాట్లాడొద్దు అని చెబుతాడు. తర్వాత ప్రభావతి.. మీనాపై విరుచుకుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 4th

గ్లాస్ పాలు కూడా ఇవ్వొద్దు:ఫస్ట్ నైట్ కోసం అంతా రెడీ అవడంతో ప్రభావతి వచ్చి మీనాను పాలు తీసుకు రమ్మని అంటుంది. అప్పుడు ఆమె తెచ్చి ఇవ్వబోతే కసురుకుంటుంది. అంతేకాదు, తన చేత్తోనే ఇస్తానని అంటుంది. తర్వాత శోభనం గదిలో మనోజ్ 'ఒకటి అడగాలి. ఆ పీఏ గాడు నాకు తెలీదు అని ఎందుకు చెప్పావు? వాడు అన్ని సార్లు కాల్ చేసింది నీకేనా? వాడి భార్య కాల్ చేసింది అన్నావు నిజమేనా? వాడు నాకు తెలీదు అన్నావు నిజమేనా' అని అడుగుతూ షాకిస్తాడు. దీంతో రోహిణి అప్పుడే నా మీద డౌట్ వచ్చిందా అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతూ అబద్దాలు చెప్తుంది.

మీనాకు కాల్ చేశానంటూ:బాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి అతడిని ప్రశ్నిస్తాడు. దీంతో 'సిటీ ఔట్‌స్కట్స్‌కు వెళ్లాను అందుకే లేట్ అయింది. భోజనం కూడా అక్కడే తినేసి వచ్చాను' అని చెప్తాడు. తర్వాత మీనా వచ్చి బాలు తనకు కాల్ చేసిన విషయం చెప్తుంది. అప్పుడు బాలు 'నేను తినేసిన విషయం ముందే మీనాకు కాల్ చేసి చెప్పాను' అంటాడు. దీంతో సత్యం 'నీకు బాధ్యత తెలిస్తే నాకు సంతోషమే' అంటాడు. తర్వాత సుశీల, సత్యం కలిసి బాలు, మీనా గురించి బాధపడతుంటారు. అనంతరం బాలు వచ్చి తను ఆమ్లెట్ వేసి ఇవ్వమని మీనాను అడుగుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 4th

ప్లాన్ మార్చేసిన ప్రభావతి:మీనాను ఆమ్లెట్ వేసుకుని రమ్మని బాలు పైకి వెళ్లి మందు తాగుతూ ఉంటాడు. అంతలో ప్రభావతి వచ్చి అందరం ఈరోజు పైన పడుకోవాలని చెప్తుంది. అప్పుడు మీనా కంగారు పడుతుంది. తర్వాత సుశీల వెళ్లి కవర్ చేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్లు అలా వెళ్లగానే ప్రభావతి చాపలు తీసుకుని వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X