Gunde Ninda Gudi Gantalu July 5th: మందేసిన సుశీల.. ప్రభావతికి ప్రాణభయం.. రోహిణి శోభనం డ్రెస్ చూడడంతో!

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పువ్వుల దండలు ఆర్డర్ రావడంతో మీనాకు పూలు ఇచ్చేందుకు వాళ్ల బంధువులు వస్తారు. అప్పుడు వాళ్లను ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. అంతేకాదు, మీనాను కూడా తిడుతుంది. తర్వాత ఆమెకు మీనా ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇక, మనోజ్, రోహిణికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసిన మీనా, బాలుకు కూడా చేద్దామని సత్యం అంటే ప్రభావతి ఒప్పుకోదు. ఇక, శోభనం గదిలోకి వెళ్లిన తర్వాత మనోజ్, రోహిణి మీద డౌట్లు పడతాడు. దీంతో ఆమె అబద్దాలు చెప్పి తప్పించుకుంటుంది. అనంతరం బాలు మందు తాగేందుకు ప్లాన్లు వేయగా.. ప్రభావతి షాక్ ఇస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 5th

సత్యం అలా.. బాలు మరోలా

బాలు డాబా మీద మందు తాగుతున్నాడన్న విషయాన్ని సత్యానికి రవి చెప్తాడు. దీంతో ఆయన బాలు సంగతి చూస్తానని కోపంగా పైకి వెళ్లబోతాడు. అంతలోనే ప్రభావతి అక్కడకు చాపలు పట్టుకుని వస్తుంది. దీంతో కంగారు పడిపోయిన సత్యం 'నీకోసమే చూస్తున్నా. ఇవన్నీ నేను పైకి తీసుకు వెళ్తాను. నువ్వు కాసేపు అయ్యాక రా' అని ఆమెను ఆపుతాడు. మరోవైపు బాలు డాబా మీద మందు తాగేందుకు రెడీ అవుతాడు. అప్పుడు 'మందు లేని గ్లాసు, బుర్ర లేని పెళ్లాం ఒకటే' అని మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతలో మీనా ఆమ్లెట్ తీసుకుని వస్తుంది.

అడ్డంగా దొరికిపోయిన బాలు
బాలు మందు తాగుతుండగా సుశీల వస్తుంది. దీంతో వెంటనే అతడు మందును దాచేసి మంచంపై కూర్చుంటాడు. అంతేకాదు, మెట్లు ఎక్కి ఎలా వచ్చావని ఆమెను అడుగుతాడు. 'నేను ఇప్పుడు ఈ మెట్లేంటి? ఆ ఏడు కొండల మెట్లు కూడా ఎక్కగలను. నువ్వేంటి గుర్రం ఎక్కినట్లు కనిపిస్తున్నావు' అని అడుగుతుంది. అప్పుడు బాలు 'గుర్రం ఎక్కడ ఉంది.. గాడిద ఉంది' అని అంటూ మీనాను చూపిస్తాడు. దీంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. అప్పుడు బాలు దాచిన మందు బాటిల్ కనిపిస్తుంది. దీంతో సుశీల.. బాలుపై విరుచుకు పడుతూ తిడుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 5th

నానమ్మ ముందే మందేస్తూ

ఆ తర్వాత బాలు మందు గురించి ఏదో సూక్తులు చెబుతాడు. అంతేకాదు, మందు తాగడం చాలా కష్టం అంటూ వాళ్ల ముందే తాగుతుంటాడు. దీంతో సుశీలకు కోపం పెరిగిపోతుంది. అప్పుడామె 'కుంకుడకాయ కాషాయమే తాగిన దాన్ని ఇది ఒక లెక్కా? నేను కూడా తాగగలను' అంటుంది. దీంతో బాలు రెచ్చగొడతాడు. దీంతో సుశీల అతడి చేతిలో ఉన్న మందు బాటిల్ లాక్కుంటుంది. వెంటనే దాన్ని దించకుండా తాగేస్తుంది. అప్పుడామె 'శాంతి ముహూర్తం పెట్టిస్తే తప్పించుకుని తిరుగుతావా? ఆ మనోజ్ గాడు వాళ్లను బయటకు పంపి మిమ్మల్ని పంపుతా' అంటుంది.

ప్రభావతికి షాకిచ్చిన సుశీల
మందు తాగిన సుశీల 'ప్రభావతి.. ప్రభావతి పైకి రావే' అంటూ అరుస్తుంది. అలాగే, ఈ భూమి, ఆకాశం తలకిందులు అయిందేంటి అని అంటుంది. ఆ తర్వాత సత్యం, రవి పైకి వస్తారు. వాళ్లను కూడా సుశీలమ్మ కామెడీగా తిడుతుంది. దీంతో జరిగింది మొత్తం బాలు వాళ్లకు చెప్తాడు. అప్పుడు సుశీల.. సత్యం మీద చిందులు వేస్తూ ఉంటుంది. అంతలోనే ప్రభావతి పైకి వస్తూ.. 'ఏంటి మీ అమ్మ గట్టి గట్టిగా అరుస్తుంది' అని అంటుంది. అప్పుడు ప్రభావతి అనుకుని రవిని కొడుతుంది. దీంతో ఆమె ఏమైందని అడగ్గా.. బాలు ఆమె మందు తాగిన విషయం చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 5th

ప్రభావతిని చంపేస్తానంటూ

సుశీల మాటలు విన్న తర్వాత ప్రభావతి 'కొత్త కోడలు ముందు పరువు పోతుంది' అంటుంది. దీంతో సుశీల పక్కనే ఉన్న మందు బాటిల్ పగలగొట్టి ప్రభావతిని చంపుతానని బెదిరిస్తుంది. దీంతో వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ల మీదకు కూడా వెళ్తుంది. అంతేకాదు, 'నువ్వు నీ కోడలు మీనాకు రెస్పెక్ట్ ఇస్తున్నావా? నేను నీకెందుకు ఇవ్వాలే. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయవే' అంటూ బెదిరిస్తుంది. దీంతో ప్రభావతి ఓ పాటకు డ్యాన్స్ చేస్తుంది. అనంతరం సుశీల డిమాండ్ చేయడంతో మీనాకు రెస్పెక్ట్ ఇవ్వమని అడగ్గా ఇస్తానని ప్రభావంతి చెప్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 5th

వీళ్లకు కూడా ఫస్ట్ నైట్ చెయ్
అనంతరం సుశీల 'ఆ గదిలో ఉన్న లక్షలు మింగిన మనోజ్ గాడిని.. సున్నాలు పూసే రోహిణిని బయటకు పంపించు. ఆ వెంటనే బాలు, మీనాలను గదిలోకి పంపి శాంతి ముహూర్తం చేయించు. అప్పుడు నేను మా ఇంటికి వెళ్లిపోతా. నువ్వు చేస్తావా లేకపోతే నన్నే చేయమంటావా' అని అంటుంది. తర్వాత మీనా, బాలును బలవంతంగా కిందకు తీసుకుని వెళ్తుంది. అప్పుడు బాలు 'నానమ్మ.. ఇప్పటి వరకూ నువ్వు చెప్పినవి అన్నీ విన్నాను. ఇప్పుడు మాత్రం వినను' అంటాడు. అప్పుడు సుశీల వెళ్లి మనోజ్ వాళ్లు ఉన్న తలుపును కొడుతూ రచ్చ రచ్చ చేస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 5th

విరుచుకుపడిన ప్రభావతి

ఉదయం కాగానే ఏమీ తెలియనట్లు సుశీల సైలెంట్‌గా కూర్చుని ఉంటుంది. అప్పుడు ప్రభావతి 'ఏరా ఇప్పుడు మొత్తం దిగిందా? లేకపోతే ఇంకా తెచ్చివ్వు. ఇద్దరూ కూర్చుని కొంపను బార్‌లాగ మార్చేద్దురు కానీ. నీ పెళ్లాం ఆమ్లెట్లు వేసి పెడుతుంది. మందు ఎక్కువైతే మీ నాన్న తీసుకెళ్లి పడుకోబెడతారు. ఏమండి మీ వయసెంత? మీరు తాగి చేసిన అల్లరేంటి? నాకు పద్దతి నేర్పి మీరు చేసింది ఏంటి' అంటూ విరుచుకుపడుతుంది. దీంతో అప్పుడు మీనా 'అది పొరపాటున చేశారు' అని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X