Gunde Ninda Gudi Gantalu July 6th: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. వాటాల విషయంలో బిగ్ ట్విస్ట్
ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బాలు మందు తాగుతున్నాడని తెలుసుకున్న సుశీల కోపంతో పైకి వెళ్తుంది. అప్పుడామె అతడి దగ్గర ఉన్న మందు బాటిల్ తీసుకుని గుటగుటా తాగేస్తుంది. అప్పటి నుంచి మత్తులో ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అంతేకాదు, ప్రభావతిని గట్టిగా పిలుస్తుంది. దీంతో ఆమె పైకి వస్తుంది. అప్పుడు ప్రభావతితో డ్యాన్స్ చేయిస్తుంది. అలాగే, మనోజ్, రోహిణిని ఫస్ట్ నైట్ గదిలో నుంచి బయటకు పిలిచి బాలు, మీనాను లోపలికి పంపాలని ప్రయత్నిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే ప్రభావతి.. అత్త సుశీలపై విరుచుకుపడుతూ గట్టిగా తిట్టేస్తుంది.



Click it and Unblock the Notifications











