Gunde Ninda Gudi Gantalu July 8th: ప్రభావతిని దెబ్బ కొట్టిన బాలు ప్లాన్.. సత్యం పోలీస్ కేసుతో ట్విస్ట్
మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
బాలు మందు తాగుతున్నాడని తెలుసుకున్న సుశీల కోపంతో పైకి వెళ్తుంది. అప్పుడామె అతడి దగ్గర ఉన్న మందు బాటిల్ తీసుకుని గుటగుటా తాగేస్తుంది. అప్పటి నుంచి మత్తులో ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అంతేకాదు, ప్రభావతిని గట్టిగా పిలుస్తుంది. దీంతో ఆమె పైకి వస్తుంది. అప్పుడు ప్రభావతితో డ్యాన్స్ చేయిస్తుంది. అలాగే, మనోజ్, రోహిణిని ఫస్ట్ నైట్ గదిలో నుంచి బయటకు పిలిచి బాలు, మీనాను లోపలికి పంపాలని ప్రయత్నిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే ప్రభావతి.. అత్త సుశీలపై విరుచుకుపడుతూ గట్టిగా తిట్టేస్తుంది.

నచ్చకపోతే వెళ్లిపోతారు
సుశీల మందు తాగి రచ్చ చేసినందుకు ప్రభావతి కోప్పడుతుంది. అప్పుడు మీనా ఇంక వదిలేయమని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి 'నువ్వే చెప్పాలి నాకు నీతులు. నీ అమ్మమ్మ తాగుతాను అంటే ఆమ్లెట్ తీసుకు వెళ్లావు. నీ బస్తీ అనుకున్నావా? మీ లాంటి అలగా జనం అనుకున్నావా' అంటుంది. దీంతో బాలు కలుగజేసుకుని ఆపమంటాడు. దీంతో ప్రభావతి అతడిపై కూడా సీరియస్ అవుతుంది. అంతేకాదు, 'ఈ ఇల్లు మంచిగా ఉండడం కోసం నేను ఇలాగే ఉంటాను. నచ్చితే ఉంటారు. నచ్చని వాళ్లు మూటముల్లె సర్ధుకుని వెళ్లిపోతారు' అని ఫైర్ అవుతుంది.
నేను ఇంటికి వెళ్లిపోతా
ప్రభావతి మాటలకు బాలు 'అందరూ వెళ్లిపోతే నువ్వు, నీ కొడుకు, నీ కొత్త కోడలు మాత్రమే ఉంటారా' అని అంటాడు. దీంతో ప్రభావతి కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత సుశీల 'దాని కోపానికి కూడా అర్థం ఉందిలేరా. నేను అన్నీ తెలిసిన దాన్ని, అనుభవాన్ని పక్కనపెట్టి ప్రవర్తించాను. ఊరిలో కూడా పంట చేతికి వచ్చింది. నన్ను ఇంటికి పంపించేయిరా' అంటుంది. దీంతో బాలు వద్దు అంటాడు. అప్పుడు మీనా 'అక్కడ మహారాణిలా ఉండే అమ్మమ్మ ఇక్కడ దాసిలాగ మాటలు పడాల్సిన అవసరం ఏముంది' అంటుంది. దీంతో ఆమె వెళ్లిపోడానికి అంతా ఒప్పుకుంటారు.

బాయ్‌ఫ్రెండ్ ఎవడు?
రవి తన ఫోన్‌లో శృతి ఫొటో చూస్తుండగా ఆమె కాల్ చేస్తుంది. అప్పుడామె 'ఉదయాన్నే నాకు ఎందుకు మెసేజ్ చేశావు' అని అడుగుతుంది. దీనికతడు 'అసలు నైట్ పడుకుంటేనా' అని చెబుతాడు. అప్పుడు శృతి.. రవిని వంటబ్బాయి అంటుంది. అలా మాట్లాడుకున్న తర్వాత రవి 'నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా? వాలంటైన్స్ డే లోపు బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకు వస్తా అన్నావుగా' అని అడుగుతాడు. దీనికి శృతి 'అవును.. అప్పటికి బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకు వస్తాను' అంటాడు. దీంతో రవి బాగా డిసప్పాయింట్ అయిపోతాడు.
మీనాపై ప్రభావతి ఫైర్
ప్రభావతి, సత్యం కూర్చుని ఉండగా మీనా వచ్చి 'మావయ్య గారు టిఫిన్ చేస్తారా' అని అడుగుతుంది. అప్పుడతను 'బాలు లేచాడా? వాడు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాం' అని చెప్తాడు. దీంతో మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు వెనక్కి పిలిచిన ప్రభావతి 'నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోతున్నావేంటి? అయినా ఏ టిఫిన్ చేయాలో నన్ను అడిగావా? అంటే నాకోసం కాదు.. నా కోడలు రోహిణి కోసం. తను ఏం తింటుందో అడగవా. ఆమె లేచిన తర్వాత ఏం కావాలో అది చేసి పెట్టాలి' అని ఫైర్ అవుతుంది. అప్పుడు మీనా కూడా ఎదురు చెబుతుంది.

నువ్వే నిలబెట్టుకోట్లే
మీనా ఎదురు చెప్పడంతో ప్రభావతి 'మంచి మర్యాద లేదా' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'పెళ్లైన దగ్గర నుంచి మర్యాద ఇస్తూనే ఉన్నాను' అంటుంది. అప్పుడు సత్యం కలుగజేసుకుని 'ఆ మర్యాదను నువ్వు నిలబెట్టుకోవడం లేదు. నీ కొత్త కోడలు మహారాణిలా పొద్దెక్కేదాక పడుకుంటే.. ఈ కోడలు ఆవిడకు నచ్చింది చేసి పెట్టాలా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? సంపాదించే కోడలు నీకు అంత ఇష్టం అయితే చంకన వేసుకుని వెళ్లు' అంటాడు. దీంతో ప్రభావతి మీనాపై కోప్పడుతుండగా.. సత్యం ఆపి ఆమెను పంపించేస్తాడు.
కేసు అని.. బాలు కేక
ప్రభావతి భర్తను ఏం చేస్తారు అని అడగ్గా.. 'నీ కొడుకు ఇంట్లో నుంచి లక్షలు పట్టుకుపోయాడని కేసు పెడతాను. బాలు గాడు సాక్ష్యం చెప్తాడు. అప్పుడు నీ కొత్త కోడలు వాడిని ఛీ అని వెళ్లిపోతుంది' అని బెదిరించి వెళ్లిపోతాడు. తర్వాత ప్రభావతి షాక్‌లో ఉండగా బాలు వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు 'నీ పెళ్లాం నన్ను లెక్కచేయట్లేదు. నా మాటకు ఎదురు చెప్తే ఇంట్లో నుంచి బయటకు పంపేస్తా' అని అంటుంది. దీంతో బాలు 'సరే.. నా వాటా డబ్బులు నీ కొడుకు మింగేశాడు. అవి కక్కించు. ఇప్పటికిప్పుడు వెళ్లిపోతా' అని చెబుతాడు.
బాలు టీజ్ చేస్తూ
తన షర్ట్ కనిపించడం లేదని బాలు రచ్చ చేస్తాడు. అంతేకాదు, మనోజ్ వాళ్ల రూమ్ డోర్‌ను కొడతాడు. దీంతో మీనా, సత్యం ఆపుతారు. అనంతరం అందరూ టిఫిన్ చేస్తుంటే ప్రభావతి వద్దంటుంది. ఇక, ఫస్ట్ నైట్ తర్వాత మనోజ్, రోహిణి బయటకు వస్తారు. వాళ్లకు ప్రభావతి వడ్డిస్తానంటుంది. ఇక, పూరి తనకు ఇష్టం లేదని, అందరి కోసం జ్యూస్ చేస్తానని వెళ్తుంది. తర్వాత మనోజ్‌ను సత్యం, బాలు టీజింగ్ చేస్తారు. తర్వాత రోహిణి జ్యూస్ తీసుకుని వస్తుంది. అది తాగిన తర్వాత ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











