Gunde Ninda Gudi Gantalu June 28th: రోహిణి గదిలో వర్ధన్.. హత్యాయత్నంతో షాక్.. ప్రభావతి మిస్ అవడంతో!
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పెళ్లి అయిపోయిన తర్వాత గుడి దగ్గరకు వచ్చిన వర్ధన్.. రోహిణిని చూసి షాక్ అవుతాడు. పెళ్లి ఆపాలనుకున్న కుదరకపోవడంతో ఫీల్ అవుతాడు. అప్పుడే రోహిణి టెన్షన్ పడుతూ ఉండగా మనోజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఆమె మాత్రం అబద్దాలు చెప్పి తప్పించుకుంటుంది. అంతేకాదు, వివాహం అయిపోవడంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అతడికి చెబుతుంది. దీంతో మనోజ్ కూడా ఆమె మాటలను నమ్ముతాడు. అంతేకాదు, ఇకపై తమ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అంటాడు. దీంతో రోహిణి కూడా ఓకే అని హామీ ఇస్తుంది.

ఆ తర్వాత సత్యం వచ్చి ప్రభావతి కనిపించడం లేదని వెతుకుతుంటాడు. అందరినీ కలిసి అడుగుతాడు. కానీ, వాళ్లెవరికీ కనిపించలేదని చెప్తారు. తల్లి లేకపోవడంతో మనోజ్ కంగారు పడిపోతాడు. ఆ సమయంలోనే కామాక్షి వచ్చి ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలుసు అని చెప్తుంది. తర్వాత అందరూ ఆశ్చర్యపోతూ అడగ్గా.. 'కొత్త జంట కోసం హారతి పళ్లెం రెడీ చేయడానికి సుశీలమ్మతో కలిసి వెళ్లింది' అని చెబుతుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
ప్రభావతి గురించి నిజం తెలిసిన తర్వాత సత్యం 'పెళ్లి జరిగిన తర్వాత మీ అమ్మ మన కుల దైవం గుడిలో పూజలు చేయించాలని మొక్కుకుంది. ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్తాను' అని చెప్తాడు. దీంతో మనోజ్ వాళ్లు ఓకే అంటారు. బాలు వెళ్లిపోదాం అని అనుకుంటూ ఉండగా.. సత్యం ఆపి మిమ్మల్ని కూడా ఆ గుడికి తీసుకు వెళ్తాను అని చెప్పడంతో తప్పక ఒప్పుకుంటారు.

గుడి దగ్గరే ఉన్న వర్ధన్.. రోహిణికి కాల్ చేస్తాడు. అప్పుడామె అతడిపై సీరియస్ అవుతుంది. కానీ, వర్ధన్ మాత్రం ఎలాగైనా తనను కలవాలని డిమాండ్ చేస్తాడు. దీంతో చేసేదేం లేక పెళ్లి కూతురు కోసం కేటాయించిన రూమ్‌లోకి వచ్చి ఉండమంటుంది. దీంతో అతడు ఓకే అని చెప్తాడు. అనంతరం బాలు ఇంటికి తీసుకు వెళ్తానని లాగగానే మీనా కాలు బెణుకుతుంది. దీంతో అందరూ కంగారు పడతారు. తర్వాత వాళ్లంతా చెప్పడంతో బాలు తన భార్య కాలును పట్టుకుని ఏమైందో అని చూస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్యలో గిల్లికజ్జాలు కనిపిస్తాయి.
గదిలో రోహిణి కోసం వర్ధన్ రెడీగా ఉంటాడు. ఆమెను ఏమైనా చేయాలని ఆశగా ఎదురు చూస్తుంటాడు. అప్పుడే ఆమె గదిలోకి వస్తుంది. ఆ సమయంలో రోహిణిని బలవంతంగా లొంగదీసుకోవాలని వర్ధన్ ప్రయత్నిస్తాడు. అంతలోనే ఆమె ఫ్రెండ్ అక్కడ ఉన్న వస్తువుతో వర్ధన్ తలపై కొడుతుంది. దీంతో అతడు పడిపోతాడు. తర్వాత రోహిణి కూడా నాలుగు దెబ్బలు వేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక, కొత్త జంట వెళ్లేందుకు కారు లేకపోవడంతో బాలు వాళ్లను ఆటపట్టిస్తాడు. ఇలా గురువారం ఎపిసోడ్ పూర్తైంది. శుక్రవారం ఎపిసోడ్‌లో మనోజ్, బాలు తమ భార్యల కాళ్లు కడుగుతూ కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











