Gunde Ninda Gudi Gantalu June 29th: బాలు ప్లాన్ వర్కౌట్.. మీనాతో రొమాంటిక్‌గా.. చావు బతుకుల్లో వర్ధన్
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పెళ్లైన తర్వాత ప్రభావతి కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు. అప్పుడు కామాక్షి వచ్చి ఆమె ఇంటికి వెళ్లిపోయిందని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్తుంటే మీనాకు కాలు బెణుకుతుంది. దీంతో బాలు వచ్చి ఆమెకు సపర్యలు చేస్తాడు. అనంతరం వర్దన్ గుడి దగ్గరకు వచ్చి రోహిణి కాల్ చేస్తాడు. అప్పుడామె తన గదిలోకి రమ్మని అడుగుతుంది. అలా వచ్చిన అతడు ఆమెను బలవంతం చేయబోతాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ తలపై కొడుతుంది. దీంతో వర్ధన్ కింద పడిపోతాడు. తర్వాత రోహిణి అక్కడి నుంచి పరారు అయిపోతుంది.

పెళ్లి తర్వాత మనోజ్, రోహిణిని తమ కులదైవం గుడికి తీసుకు వెళ్తానని ప్రభావతి మొక్కుకున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె మాత్రం కొత్త దంపతులకు హారతి ఇవ్వడానికి తన కారులోనే ఇంటికి వెళ్లిపోతుంది. దీంతో మనోజ్ వాళ్లు ఎక్కేందుకు కారు ఉండదు. అప్పుడు బాలు తన కారులో వాళ్లను ఎక్కించేందుకు ప్లాన్ చేస్తాడు. అప్పుడు వెటకారంగా ఎన్నో మాటలు అంటాడు. దీంతో అక్కడ ఉన్న తండ్రి చెప్పడంతో మనోజ్, రోహిణి తప్పక బాలు కారు ఎక్కుతారు. దీంతో బాలు తన సోదరుడిని మరింతగా ఏడిపిస్తుంటాడు.
రోహిణి వాళ్లు దాడి చేయడంతో కళ్లు తిరిగి పడిపోయిన వర్ధన్‌కు స్పృహ వస్తుంది. వెంటనే తలుపులు కొట్టడంతో ఎవరో డోర్ తీస్తారు. దీంతో బయటకు పరుగున వచ్చి రోహిణి వాళ్లు ప్రయాణిస్తున్న కారును ఫాలో అవుతుంటాడు. అప్పుడు చూసిన రోహిణి బాగా టెన్షన్ పడుతుంటుంది. మరోవైపు, కారులో మనోజ్, బాలు మధ్య ఫన్నీగా డిస్కర్షన్ జరుగుతుంది. అప్పుడు మనోజ్ 'వీడు నాలా చదువుకోలేదు. అందుకే కల్చర్ తెలీదు' అంటాడు. అప్పుడు బాలు కూడా సీరియస్ అవుతుంటే పక్కనే ఉన్న మీనా అతడిని కంట్రోల్ చేస్తుంటుంది.
కారులో వెళ్తున్న సమయంలో మనోజ్ వాళ్లకు ఝలక్ ఇవ్వాలని భావించిన బాలు.. కారును రోడ్డు మీద ఆపేస్తాడు. దీంతో వాళ్లంతా షాక్ అవుతారు. తర్వాత కారు స్టార్టింగ్ ట్రబుల్ వచ్చిందని, దిగి తోయాలని బాలు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రోహిణి మాత్రం 'చీ ఈ కారు ఇప్పుడే ఆపాలా? ఆ పీఏ గాడు వచ్చేస్తాడు' అని టెన్షన్ పడుతుంటుంది. తర్వాత బాలు మనోజ్, రోహిణిని మాత్రమే కిందకు దిగి కారును నెట్టమని అంటాడు. అప్పుడు మీనా కూడా నెడతానని అంటే కాలు బాలేదు వద్దని చెబుతాడు.

వర్ధన్‌కు లిఫ్ట్ ఇచ్చిన కుర్రాడు కొంత దూరం తీసుకు వచ్చిన తర్వాత రూటు మారుస్తాడు. అప్పుడు ఏమైందని అడగ్గా.. తన ఇల్లు వేరే రూట్‌లో ఉందని, అందుకే అతడిని దిగిపోమని చెబుతాడు. దీంతో వర్ధన్ రోడ్డు మీద పరుగులు పెడతాడు. ఇక, రోడ్డు మీద కారును నెడుతూ నెడుతూ గుడి వరకూ చేరుకుంటారు. అంతలో అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాలు 'అసలు కారు ఆగిపోలేదు. నేనే కావాలని కారును నెట్టించాను' అని మీనాకు చెబుతాడు. తర్వాత మనోజ్ వాళ్లు కారు ఎక్కబోతుంటే గుడి వచ్చేసింది అని చెప్పి షాకిస్తాడు.
గుడిలోకి వెళ్లిన తర్వాత జరిగిందంతా బాలు ఇంట్లో వాళ్లకు చెప్తాడు. అప్పుడే పంతులు వచ్చి మనోజ్ డ్రెస్ మీద, రోహిణి ముఖంలో ప్రేత కళ కనిపిస్తుందని చెడామడా తిట్టేస్తాడు. తర్వాత పూజలో కూర్చుని ఏడవమంటాడు. తర్వాత సత్యం 'వీడు మా రెండో కొడుకు. వీడి పెళ్లి కూడా హడావిడిగా జరిగింది. ఇప్పుడు పూజ వీళ్లకు కూడా చేయండి' అని చెప్తాడు. దీంతో పంతులు అసలు పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? అని వివరిస్తాడు. మొత్తంగా భార్యకు పూజ చేయమంటే బాలు వద్దని అంటాడు. దీంతో పంతులు సీరియస్ అవగా సత్యం బ్రతిమాలతాడు.
పూజ మొదలైన తర్వాత పంతులు 'ఇప్పటి నుంచి మీ భార్యలు దేవతల్లా కూర్చుని ఉంటారు. ఇది పూర్తయ్యే వరకూ మీరు అమ్మవారితో సమానం' అని చెప్తాడు. తర్వాత బాలు, మనోజ్‌తో తమ తమ భార్యల కాళ్లు కడగమని, పూజ చేయమని చెబుతాడు. వాళ్లు కూడా అలాగే చెప్తారు. మరోవైపు, వర్ధన్ పరిగెత్తుకుంటూ గుడి వైపు వస్తుంటే ఓ కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొడుతుంది. దీంతో వర్ధన్ రోడ్డు మీద పడిపోతాడు. ఇలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక, శనివారం ఎపిసోడ్‌లో బాలు, మీనా మధ్య గిల్లికజ్జాలు కనిపిస్తాయి.


Click it and Unblock the Notifications











