Gunde Ninda Gudi Gantalu october 1st: ప్రభావతికి ఘోర అవమానం.. రవికి శోభ వార్నింగ్.. శృతి హౌస్ అరెస్ట్
Gunde Ninda Gudi Gantalu october 1st: మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగానే కొత్త షోలు వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ప్రభావతి అండ్ ఫ్యామిలీ ఫ్రీగా వచ్చిన కూపన్స్ తో షాపింగ్ చేస్తుంటారు. కానీ, మీనా కు బట్టలు తీసుకోవడంతో బాలుకు కోపం వచ్చి.. వాళ్ల కంటే ఎక్కవ రేంజ్ లో షాపింగ్ చేస్తా.. అంటూ సపరేట్ గా షాపింగ్ చేస్తాడు. మనోజ్, ప్రభావతిలు ఫ్రీ కూపన్స్ ఉన్నాయిగా అంటూ హైరేంజ్ లో బట్టలు తీసుకుంటారు. మరో వైపు సంజూ శ్రుతి కోసం షాపింగ్ చేయడం.. అది నచ్చని ఆమె రవితో తిరగడం. ఇలా ఫన్నీగా సాగింది.

ఇక మంగవాళం ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి, కామాక్షిలు రవి, శృతిలను ఎలాగైనా పట్టుకోవాలని వెతకడం ప్రారంభిస్తారు. దీంతో రవి ట్రయల్ రూమ్ లో దూరుతాడు. సంజూ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శృతి కూడా ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంది. ' నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్' అని శృతి ప్రశ్నించగా..'మా అమ్మ నీతో చూస్తే.. నా పరిస్థితి అంతే' అంటాడు. 'ఇంత భయపడితే.. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావ్ ? ' అని ప్రశ్నిస్తుంది శృతి. కొంచెం టైం ఇవ్వు అని రవి అనగానే.. సంజూ నన్ను వదిలేలా లేదంటూ రిక్వెస్ట్ చేస్తుంది శృతి.
ఇంతలో బాలు, మీనాలు ట్రయల్ రూమ్ కి దగ్గరికి వస్తారు. ఓ ట్రయల్ రూమ్ లో రవి, శృతి ఉంటే.. మరో ట్రయల్ రూమ్ లో మీనా, బాలు ఉన్నారు. ఈ క్రమంలో శృతి కాస్త రొమాంటిక్ గా మాట్లాడుతూ.. సడెన్ గా రవికి ముద్దు పెట్టేస్తుంది. దీంతో రవి గాలిలో తేలుతాడు. మరో ట్రయల్ రూమ్లో ఉన్న బాలు మీనా కూడా కాస్త రొమాన్స్ లో ముగినిపోతారు. అంతలోనే బాలు ఇక చాలు అని బయటకు వచ్చేస్తాడు బాలు. రవి, శృతి కి కూడా ఇలాగోలా అక్కడి నుంచి బయటపడుతారు.

కానీ, శృతి మళ్లీ సంజూ కంటబడుతుంది. 'ఇప్పటి వరకూ ఎక్కడి వెళ్లావ్' అని ప్రశ్నించగా.. 'డ్రెస్ చాలా టైట్ గా ఉంది. విప్పడానికి చాలా టైం పట్టింది' అని కవరింగ్ చేసుకుంటుంది శృతి. 'సరేలే నీ కోసం శారీ తీసుకున్నా.. ఎలా ఉంది' అని అడుగుతాడు సంజూ. వెంటనే ఎలాంటి మొహామాటం లేకుండా నచ్చలేదని చెప్పేస్తుంది శృతి. 'నాకు నచ్చింది' అంటూ సంజూ అనడంతో'కట్టుకోవాల్సింది నేను' అంటూ శృతి సమాధానం ఇస్తుంది. కానీ, సంజూ మాత్రం 'ఆకట్టుకోవాల్సింది నన్ను' అంటూ రిప్లై ఇస్తాడు. దీంతో చిరాకు వచ్చిన శృతి అక్కడినుండి వెళ్ళిపోతుంది
మరోవైపు.. షాపింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రభావతి ఫ్యామిలీ బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి చేరుకుంటుంది. 'మీ కూపన్ల సంగతి మీరు చూసుకోండి. మా ఆవిడ చీర సంగతి నేను చూసుకుంటా' అంటూ బాలు వారు తెచ్చిన బట్టలను సైడ్ కు తోస్తాడు. దర్జాగా డబ్బులు కట్టేసి వాళ్ళ ముందు ఓ రేంజ్ లో ఫోజు ఇస్తాడు. ప్రభావతి మాత్రం ఫ్రీ కూపన్స్ చూపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసిన మౌనికకు మాత్రం బట్టలు తీసుకోవడంతో మీనా ఫీల్ అవుతుంది. వెంటనే బాలు 'నువ్వేం భాదపడకు రా.. తర్వాత తీసుకుంటాలే' అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మౌనిక మాత్రం 'వద్దులే అన్నయ్య.. నా సాలరీ వస్తుంది కదా.. అప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వకుండా షాపింగ్ చేస్తా' అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తుంది.

ఇంతలో పానకంలో పుడకలాగా.. 'ఫ్రీ ఫ్రీ కూపన్స్' అంటూ కామాక్షి అరుస్తుంది. బట్టలు అన్ని చూసిన షాక్ కీపర్ బిల్లు 25,000 అనడంతో ఫ్రీ కూపన్స్ ఇస్తారు. మహా అయితే 5,000లో.. 10,000లో కట్టాల్సి ఉంటుందని అనుకుంటారు. కానీ, మొత్తం బిల్లు కట్టాలంటూ షాప్ కీపర్ బాంబేస్తాడు. దీంతో అవాక్కైనా ప్రభావతి ఫ్యామిలీ 'ఎందుకు.. ఎందుకు..' అంటూ అడుగగా.. 'ఈ కూపన్స్ వ్యాలిడిటీ నిన్నటితో అయిపోయింది' అని షాక్ ఇస్తాడు షాప్ కీపర్. దీంతో ఒక్కరి మొకం ఒక్కరూ చూసుకుంటారు.
ఆ సమయంలో బాలు రియాక్షన్స్ వేరే లెవల్ లో ఉంటాయి.కూపన్స్ ఎక్స్పైర్ అయిన విషయం తనకు ముందుగానే తెలుసుననీ, మిమ్ములను కావాలని రెచ్చగొట్టి ఎక్కువ రేటు బట్టలు కొనిచ్చా. ఎలా ఉంది నా దెబ్బ డబ్బావతి అంటూ పంచ్ వేస్తాడు. మీ కూపన్స్ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావంటూ ఎగతాళి చేస్తాడు బాలు.
'ఏమైనా డబ్బులు ఉన్నాయా వదిన' అంటూ మీనాక్షిని అప్పు అడుగుతుంది ప్రభావతి. నా దగ్గర రూ.5,000 మాత్రమే ఉన్నాయంటూ తాను శారీ డబ్బులను కట్టేస్తుంది. జీవితంలో మరోసారి మనోజ్ నమ్మొద్దంటూ నానా మాటలు అనేస్తుంది కామాక్షి. 'అత్త.. అత్త.. ఇదిగో కూపన్స్' అంటూ బాలు కామాక్షికి కూపన్స్ ఇస్తే.. 'మీ మమ్మీని చలిమంట వేసుకోమన్రా' అంటూ అక్కనుండి వెళ్ళిపోతుంది కామాక్షి.
ఎలాగైనా బిల్లు కట్టాలని మనోజ్ భార్య తన బ్యాగ్ లో ఉన్న డబ్బులను తీసుంది. కానీ, ఇంక మూడు వేల రూపాయలు తగ్గుతాయి. ఆ పరిస్థితిని పసికట్టిన బాలు అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మీనా మిగతా డబ్బులు కట్టమని చెబుతుంది. దీంతో అవమానంగా భావించిన ప్రభావతి 'నా చీర డబ్బులు మీరు కట్టాల్సినవసరం లేదు' అంటూ తాను తీసుకున్న శారీ ని క్యాన్సల్ చేయమని షాప్ కీపర్ కు చెబుతుంది. 'ఎంతైనా మా అమ్మ కదా.. మా అమ్మ పరువు పోతే.. నా పరువు పోతుంది' అంటూ మిగతా డబ్బులను కట్టేసి వెళ్ళిపోతాడు.
మరోవైపు.. శృతి తన ఇంటికి చేరుకొని సంజు తో షాపింగ్ చేశానంటూ ఇంట్లో అబద్ధం చెబుతుంది. శృతి చెప్పింది నిజమేనని నమ్మి శోభ హ్యాపీగా ఫీల్ అవుతారు. శృతి హాల్ లో నుంచి బెడ్ రూం కి వెళ్లి రవితో సరదాగా ఫోన్ మాట్లాడుతుంది. శృతి వాళ్ళ మమ్మీ శోభ కూడా నిజంగానే సంజూతో మాట్లాడుతుంది కావచ్చని అనుకుంటూంది.
కట్ చేస్తే సంజు ఎంట్రీ ఇస్తాడు. తాను సెలెక్ట్ చేసిన సారీ ని తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తాను తెచ్చిన సారీ ఎలాగైనా శృతి కట్టుకోవాలని, తానే ఇస్తానంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. దీంతో అప్రమత్తమైనా శోభ తానే తీసుకొస్తానంటూ బెడ్ రూమ్ కి వెళ్తుంది.
బెడ్రూమ్ లో రవితో ఫోన్ మాట్లాడుతున్న శృతిని చూసి ఫైర్ అవుతోంది. ఫోన్ లాక్కుని కొడుతుంది. అదే సమయంలో 'మరోసారి శ్రుతికి ఫోన్ చేయొద్దు,తనకు ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది.తన కూతురి జోలికి వస్తే బాగుండదు' అంటూ రవికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది శోభ. శృతి ఫోన్ తీసుకుని బెడ్ రూమ్ లో వేసి లాక్ చేస్తుంది శోభ. ఈ విషయాన్ని ఎలాగైనా రవికి చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో శృతికి తన పాత ఫోన్ దొరకడంతో ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పుతుంది. ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లమనీ, రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటూ రవికి రిక్వెస్ట్ చేస్తుంది శృతి.
మరోవైపు మనోజ్ ఇంటర్వ్యూ కి వెళ్లాలంటూ బాలు దగ్గర డబ్బులు తీసుకెళ్తాడు. కానీ, ఇంటర్వ్యూకు వెళ్లకుండా ఓ పార్కులో తీరికగా కూర్చొని ఉంటాడు మనోజ్. అనుకోకుండా అదే పార్క్ దగ్గర ఓ వ్యక్తి ద్వారా మనోజ్ కు ఇచ్చిన నోట్లు మళ్లీ బాలు చేతికే వస్తాయి. దీంతో షాక్ అయిన బాలు.. అసలు మనోజ్ ఏం చేస్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తన కోసమే వెతుకున్న బాలును చూసి.. మనోజ్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నానా తిప్పలు పడుతాడు.


Click it and Unblock the Notifications











