Gunde Ninda Gudi Gantalu october 2nd Episode: అన్నపై బాలు కు అనుమానం.. బిక్షగాడిలా మారిన మనోజ్..

Gunde Ninda Gudi Gantalu october 2nd Episode: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజుకు స్పందన పెరుగుతోంది. హైయెస్ట్ టీఆర్పీతో దూసుకుపోతుంది. అలాంటి సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ ఒక్కటి. గత కొంత కాలంగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ కు రోజురోజుకూ ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్ లో శృతితో ఫోన్ మాట్లాడుతున్న రవికి శోభన సిరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి తన కూతురుకి సంజూతో ఎంగెజ్ మెంట్ అయిందనీ, మరోసారి ఫోన్ మాట్లాడొద్దంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది శోభ. అనంతరం శృతి నుంచి ఫోన్ లాక్కొని.. బెడ్ రూమ్ లో వేసి లాక్ చేస్తుంది శోభ. ఈ విషయాన్ని రవికి చెప్పింది శ్రుతి. ఎలాగైనా తనని రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటూ రవికి రిక్వెస్ట్ చేస్తుంది శృతి. తరువాత ఏం చేయాలో చెప్పుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode october 2nd

ఇక నేటీ ఎపిసోడ్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానంటూ మనోజ్ తన తల్లి ప్రభావతిని 500 రూపాయలు అడుగుతాడు. దీంతో ప్రభావతి నేనొక్క రూపాయి కూడా ఇవ్వనంటూ కరాకండిగా చెప్పేస్తుంది. తాను ఈ రోజు ఓ ఇంటర్వ్యూకి వెళ్లాలంటూ ఎలాగైనా రూ. 500 కావాలని మొండికి వేస్తాడు మనోజ్. దీంతో ప్రభావతి 'నా దగ్గర ఉన్న లక్ష రూపాయలను ఎవ్వడో దొంగ వెధవ కొట్టేశాడు, అంత ముందుకు ఉన్న చిట్టి డబ్బులు కూడా పోయాయి' అంటూ బాధపడుతుంది. అయినా జీతం డబ్బుల గురించి రోహిణి అడుగుతే.. ఏం సమాధానం చెప్పాలంటూ మనోజ్ ను ప్రభావతి నిలదీస్తుంది. 'అందుకు నా దగ్గర ఓ ఐడియా ఉంది' అంటూ ప్రభావతి నోరు మూయించే ప్రయత్నం చేస్తాడు మనోజ్. 'నువ్వు ఎంత కన్విన్స్ చేసినా.. నా దగ్గర మాత్రం డబ్బులు లేవు. కావాలంటే నాన్న దగ్గరికి వెళ్లి అడుగు' అంటూ సలహా ఇస్తుంది ప్రభావతి.

తల్లి ప్రభావతి సలహా ప్రకారం.. మనోజ్ తన తండ్రి దగ్గరికి వెళ్లగా హాల్ లో సత్యం తన పెన్షన్ డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. దీంతో మనోజ్ డబ్బులు వంక దొంగలాగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన బాలు 'ఏంటి నాన్న ఎన్నిసార్లు చెప్పాను. డబ్బులు రూమ్ లో లెక్క పెట్టాలని, చూసావా.. మటన్ షాప్ ముందు కుక్కలాగా ఎలా చూస్తున్నాడో' అంటూ మనోజ్ పై బాలు సెటైర్ వేస్తాడు. వెంటనే ప్రభావతి అక్కడికి వచ్చి..' వాళ్ళు డబ్బు ముఖం చూడని వాడు కాదు' అంటూ సమాధానం ఇస్తుంది. 'నేను అలా అనలేదు కదా.. 40 లక్షల ముఖం వాడు.. పదిహేను లక్షల ముఖం నువ్వు.. చూడలేదు' అని ఎవరైనా బుద్ధున్నవాడు అంటాడు అంటూ ప్రభావతికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తాడు బాలు. ఆ మాటలతో రియాక్ట్ అయిన మనోజ్ 'నేను మూర్ఖులతోని వాదించారంటూ' కామెంట్ చేస్తాడు. 'నేను రోజు మాట్లాడుతూన్నా కదా.. లక్షల మింగిన మూర్ఖుడా..'అంటూ మనోజ్ పై బాలు పంచ్ వేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Episode 262

'అన్ని వదిలేయ్.. నీ దగ్గర 500 కు చిల్లర ఉందా?' అంటూ బాలు ని తన తండ్రి అడుగుతాడు. ఉందంటూ చిల్లర ఇస్తాడు. అయితే.. అందులో ఒక వంద రూపాయల నోట్ పై లవ్ సింబల్ ఉంటుంది. ఆ నోట్లో చూసిన బాలు తండ్రి 'ఇదేంట్రా ఇలా గీశారు?' అంటూ అడుగుతాడు. 'ఇంతే నాన్న ఈ రోజులలో.. ప్రేమించిన వాళ్ళు ఇలా నోట్లపై సంకేతాలు రాస్తున్నారు. మీ కాలంలో లవ్ లెటర్లా మాదిరిగా' అంటూ చెబుతాడు. దీంతో సత్యం 'ఆ కాలంలో నేను ఎవరికి లవ్ లెటర్ ఇవ్వలేదని అంటూ ఫీల్ అవుతున్నారు. వెంటనే బాలు 'ఇచ్చు ఉండాల్సింది నాన్న.. అనవసరంగా ఇల్లు మింగే ఇల్లాలను పెళ్లి చేసుకున్నారు' అంటూ తల్లి ప్రభావతి పై ఇన్ డైరెక్ట్ గా పంచి వేస్తాడు బాలు. 'నేనేమన్నా అడ్డుకున్నానా.. కావాలంటే ఇప్పుడు వెళ్లి ఇవ్వమను లవ్ లెటర్' అంటూ ప్రభావతి కూడా వెరైటీగా రిప్లై ఇస్తుంది.

'పాపం నీలవేణికి పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారే.. ఇప్పుడు లవ్ లెటర్ ఇస్తే ఎలా ఉంటుంది' అంటూ సెటైరికల్ గా సమాధానం ఇస్తాడు సత్యం. ఆ సమాధానంతో మండిపడుతుంది ప్రభావతి. ఆ తర్వాత మనోజ్ తనకు 500 కు చిల్లర కావాలంటూ తన తండ్రిని అడుగుతాడు. 'ఏంట్రా నీకు ఇంకా జీతం రాలేదా?' అంటూ ప్రశ్నిస్తాడు. 'ఇవాళ వస్తుంది నాన్న. కానీ 500 కు చిల్లర కావాలి' అని అడుగుతాడు. సరే.. జీతం రాగానే ఖర్చు పెట్టకుండా రోహిణికి డబ్బులు ఇవ్వంటూ తన తండ్రి వార్నింగ్ ఇస్తాడు. దానికి సరైన అంటూ సమాధానం ఇస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Episode 262

ఇంతకీ నీకు ఎంత కావాలని తండ్రి మరోసారి ప్రశ్నించగా 'నాకు 500 కు చిల్లర కావాలి' అంటూ ప్రాధేయపడతాడు. 'నేనే చిల్లర లేక బాలు దగ్గర తీసుకున్నాను. నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి' అని సమాధానం ఇస్తారు సత్యం. 'అయితే 300 రూపాయలు ఇవ్వండి' అంటూ మనోజ్ కు సపోర్టుగా ప్రభావతి మాట్లాడుతోంది. వెంటనే సత్యం 300 రూపాయలు తీసి ఇవ్వగా.. రూ. 500 ఇవ్వకుండా అక్కడి నుండి మనోజ్ జంప్ అవుతాడు.

వాస్తవానికి మనోజ్ ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఓ పార్కులో తీరికగా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇంతలో బాలు ఓ కస్టమర్ ను తన టాక్సీలో తీసుకువచ్చి ఆ పార్కు వద్దనే ఆపుతాడు. ఆ కస్టమర్ టాక్సీ డబ్బులు అంటూ 500 నోట్ ఇస్తాడు. దీంతో బాలు తన దగ్గర చిల్లర లేవు.. మీరే ఎవరినైనా అడిగి ఇవ్వమని సలహా ఇస్తాడు. దీంతో ఆ కస్టమర్ పార్క్ లో ఉన్న మనోజ్ దగ్గరికి వెళ్లి చిల్లర తీసుకొని వచ్చి బాలుకు ఇస్తాడు. అయితే.. ఆ డబ్బులలో తాను ఇచ్చిన లవ్ సింబల్ ఉన్న 100 రూపాయల నోటు కనిపించడంతో అనుమానం వస్తుంది.

మనోజ్ ఉద్యోగం చేయకుండా పార్కులు, హోటల్స్ లా చుట్టు తిరుగుతున్నాడా? అనే సందేహం వస్తుంది దీంతో ఒకసారి పార్కులో వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా అంటూ లోపలికి వెళ్లి తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన మనోజ్ తన తమ్ముడు బాలు నుండి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే బిచ్చగాడిలా మారుతాడు. ఎంత వెతికినా మనోజ్ కనిపించకపోవడంతో బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోజ్ ఈరోజు ఎలాగైనా ఇంట్లో శాలరీ ఇవ్వాలంటూ తన ఫ్రెండేనా అప్పు అడుగుతాడు. అందుకు ఆ ఫ్రెండు సవాలక్ష కండిషన్లు పెడతాడు అయినా వాటన్నిటికీ ఓకే చెబుతాడు మనోజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X