Gunde Ninda Gudi Gantalu october 3th: సత్యం కు సురేంద్ర వార్నింగ్.. సీక్రెట్ గా పెళ్లి ప్లాన్ చేస్తున్న రవి..
Gunde Ninda Gudi Gantalu october 3th: బుల్లితెరపై ప్రసారమవుతోన్న సీరియళ్లకు రోజురోజుకు మంచి ఆదరణ వస్తోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తూ సక్సెస్ పుల్ గా ప్రసారం అవుతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మనోజ్ పై బాలుకు అనుమానం వస్తోంది. తన అన్నయ్య ఉద్యోగం చేయకుండా ఖాళీగా పార్కులు, హోటల్స్ పంటి తిరుగుతున్నా.. అనే సందేహం వస్తుంది. దీనికి ప్రధాన కారణం తాను తన తండ్రికి ఇచ్చిన లవ్ సింబల్ ఉన్న వంద రూపాయాల నోటు తిరిగి తన చేతికే రావడంతో అనుమానం వస్తుంది. ఆ డబ్బులు దొరికిన పార్కులో వెతకడం ప్రారంభిస్తాడు. బాలు నుంచి తప్పించుకోవడానికి మనోజ్ నానా తిప్పలు పడుతాడు. క్రమంలో బిక్షగాడిలా అవతారమెత్తుతాడు మనోజ్.

గురువారం ఎపిసోడ్ లో .. మనోజ్ తన పార్క్ మెట్ అండ్ ఫ్రెండ్ దగ్గర పదివేల రూపాయలను అప్పుగా తీసుకుంటాడు. ఇక నుండి ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా ఎంజాయ్ చేయొచ్చని భావిస్తాడు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనోజ్. ఇందులోనే బాలు ఇంటికి వచ్చి.. వంద రూపాయల నోటు చూపించి, ఈ నోటను ఎవరికి ఇచ్చారంటూ తన తండ్రి సత్యాన్ని ప్రశ్నిస్తాడు. వెంటనే సత్యం ఆ నోటును మనోజ్ కు ఇచ్చానని చెప్తాడు.మనోజ్ ను ప్రశ్నించగా.. తాను ఆఫీస్ కు వెళ్లేటప్పుడు ఆ పార్కు దగ్గర టీ తాగి వెళ్లాలని, ఆ సమయంలో ఆ నోటను అక్కడ ఇచ్చానని సమాధానం చెప్తాడు. కానీ మనోజ్ కు బాలు చెప్పే సమాధానంతో పొందన కనిపించదు.
అక్కడ ఉంటే తాను దొరికిపోతానని, మెల్లగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్. ఈ క్రమంలో మనోజ్ పాయింట్ జేబులో ఉన్న 10000 రూపాయలు కింద పడతాయి. ఆ విషయాన్ని గమనించిన బాలు ఆ డబ్బులు ఎవరివి అని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తాడు. కానీ, ఎవరు కూడా తమవి కావని సమాధానం ఇస్తారు. మనోజ్ కూడా.. ఆ డబ్బులు తనవి కావని, ఒకవేళ తనవేనని చెబితే.. ఎక్కడ సాలరీ డబ్బులు అడుగుతారని అబద్ధం చెప్తాడు. ఆ దేవుడే తన కష్టాలను గమనించి, ఇలా డబ్బులు ఇచ్చాడంటూ సంబరపడిపోతాడు బాలు.

ఇదిలా ఉంటే.. శృతి వాళ్ల నాన్న సురేంద్ర.. సత్యానికి ఫోన్ చేసి తనతో మాట్లాడాలని వెంటనే ఆఫీసుకు రమ్మని పిలుస్తాడు. ఆఫీస్ కు వెళ్లిన సత్యానికి .. తన కొడుకు రవి గురించి చెబుతూ .. తన కొడుకును తన కూతురి శ్రుతితో మాట్లాడవద్దని, తనకి ఆల్రెడీ పెళ్లి సెట్ అయిందంటూ ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సురేంద్ర. తన కొడుకు తనుకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని, తన కూతుర్ని కూడా కంట్రోల్ లో పెట్టుకోమని, భయం లేకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకో మని సలహా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్యం.
ఇంటికి వచ్చిన సత్యం వెంటనే బాలుకు దగ్గరికి వచ్చి అసలు విషయాన్ని చెబుతాడు. ఏదో ప్రమాదం జరగబోతుందని ఆందోళన చెందుతాడు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, రవి విషయాన్ని తాను చూసుకుంటానని తన తండ్రికి దీమా ఇస్తాడు బాలు. ఆ తర్వాత మీనా మాట్లాడుతూ రవి, శృతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కావచ్చని, సురేంద్ర మీద కోపంతో వారిద్దరిని విడదీయడం సరికాదని సలహా ఇస్తుంది బాలుకు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే బాగుండదంటూ మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
కేవలం మాట్లాడినందుకే సురేంద్ర తన తమ్ముడు రవిని గుండాలతో కొట్టించే ప్రయత్నం చేసాడనీ, పెళ్లి అంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించుకోమని, కావాలంటే రవితో మాట్లాడి.. శృతి తో మాట్లాడకూడదని నచ్చజెప్పుమని మీనాకు సలహా ఇస్తాడు బాలు. మరోవైపు రవి.. సుమతికి ఫోన్ చేసి తన లవ్ మేటర్ మాట్లాడాలని తన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. తాను శృతిని ప్రేమిస్తున్నానని కానీ, ఇంట్లో తెలిస్తే తమ పెళ్లినీ అడ్డుకుంటారని ఎలాగైనా తనని సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు రవి.


Click it and Unblock the Notifications











