Gunde Ninda Gudi Gantalu September 10th: బయటపడ్డ గాజుల నిజం.. నక్కతోక తొక్కిన మీనా.. సూపర్ ట్విస్ట్

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
శివ ఫ్రెండ్ దగ్గరకు వచ్చిన రోహిణి రెండు లక్షలు అప్పు చేస్తుంది. అలా మొత్తం డబ్బు తీసుకుని వచ్చిన రోహిణి ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది. అప్పుడు వాటిని ఇస్తూ బాలుపై ఫైర్ అవుతుంది. దీంతో అతడు కూడా గట్టిగానే బదులిస్తాడు. అతడికి రవి, సుమతి కూడా సపోర్ట్ చేస్తారు. అనంతరం ఆ డబ్బు తీసుకు వెళ్లి వడ్డీ వ్యాపారికి ఇస్తారు. ఆ సమయంలో ఆయన ప్రభావతి మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడి పరువు తీస్తాడు. తర్వాత అందరితో పాటు మీనాతో సైతం సంతకం చేయిస్తాడు. ఆ సమయంలో ప్రభావతి వద్దని చెప్పడంతో సత్యం సహా అంతా తిడతారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 10th

మంగళవారం ఎపిసోడ్‌లో... డబ్బు తీసుకోవడం, సంతకాలు చేయడం తర్వాత వడ్డీ వ్యాపారి 'ఎందుకైనా మంచిది ఇంటి పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి' అంటాడు. తర్వాత అందరూ వెళ్లబోతుంటే ఆయన మళ్లీ ఆపుతాడు. అంతేకాదు, ఏదో గిఫ్ట్ బయటకు తీయడంతో అది వాళ్లకు ఇస్తాడేమో అని ఎదురు చూస్తుంటారు. అప్పుడు ఆయన చేతిలో నుంచి వాటిని ప్రభావతి లాక్కుంటుంది. దాన్ని బాలు తీసుకుని చూడగా అందులో గాజులు ఉంటాయి. అవి సుమతి, రవి గుర్తు పట్టి అవి అమ్మ గాజులే అంటారు. వాటిని గతంలో ప్రభావతి ఆయనకు ఇస్తుంది.

అందరూ సందేహం వ్యక్తం చేయడంతో మీనా 'మరి అత్తయ్య చేతికి ఉన్న గాజులు ఏంటి' అని అందరికీ డౌట్ పెడుతుంది. తర్వాత బాలు చెప్పడంతో చెక్ చేసి 'ఈ రెండు డిజైన్లు ఒకేలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆయన ఇచ్చినవే ఒరిజినల్‌లా ఉన్నాయి' అంటుంది. దీంతో సత్యం ఆపి ఈ పంచాయతీ అయ్యాకే వెళ్దాం అంటూ గాజులు చెక్ చేస్తాడు. కానీ, అవి తేల్చుకోలేకపోతాడు. అప్పుడు బాలు చెప్పడంతో వడ్డీ వ్యాపారి 'మీ అమ్మ చేతికి ఉన్నవే నకిలీవి. వడ్డీ కట్టకుండా ఎగ్గొట్టినందుకు గాజులు తాకట్టు పెట్టింది' అని నిజం చెప్పేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 10th

గాజుల గురించి నిజం తెలిసిన వెంటనే అందరూ ఏదో ఒక మాట అని వెళ్లిపోతారు. అప్పుడామె ఏడుస్తూ కోపంగా మీనా వైపు చూస్తుంది. ఇంటికి వెళ్లిన తర్వాత మరోసారి సత్యం పెద్ద పంచాయతీ పెడతాడు. అప్పుడు 'ఈ ఇంటి పత్రాలు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసా? మీ నాన్న మన ఇద్దరి పేర్లపై దీన్ని రాశారు. నీకు అస్సలు సిగ్గు ఉందా? 30 ఏళ్లు కాపురం చేసిన నువ్వే ఇలా చేస్తే నేనెవరిని నమ్మాలి ప్రభావతి' అంటాడు. దీంతో బాలు ఆమె మీద సెటైర్లు వేస్తాడు. అప్పుడు మనోజ్ అడ్డు రావడంతో సత్యం 'రోహిణి నిజం దాస్తే నీకెలా ఉంటుందిరా' అని ప్రశ్నిస్తాడు.

సత్యం మాటలకు మనోజ్ 'అవును నాన్న. ఎవరైనా అబద్దం చెప్తే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ కల్పన డబ్బులు తీసుకుని పారిపోతే.. రోహిణి డబ్బులు తిరిగి తీసుకొచ్చి పరువు నిలబెట్టింది' అంటాడు. అయినా బాలు తగ్గకుండా సెటైర్లు వేస్తుండగా రోహిణి సీరియస్ అవుతుంది. అప్పుడు రవి 'ఎందుకు అన్నయ్యా అందరి మీద సెటైర్లు వేస్తావు? అందుకే అవి తిరిగి వస్తుంటాయి' అంటాడు. దీంతో మీనా 'మీ అన్నయ్యకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు రవి' అని అంటుంది. అప్పుడు ప్రభావతి అరవగా.. ఆమెపై బాలు కూడా సీరియస్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 10th

గొడవ మొత్తం పూర్తైన తర్వాత సత్యం 'ఈ పత్రాలు ఇకనైనా జాగ్రత్తగా పెట్టాలి. నువ్వు పక్కకుపోవే. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ పత్రాలు ఇవ్వమని అడుగుతున్నావు. అమ్మా మీనా ఇలా రా. ఈ పత్రాలు ఇకపై నువ్వే భద్రంగా దాచిపెట్టమ్మా' అంటూ ఆమెకు అందించబోతాడు. అప్పుడు ప్రభావతి 'అదేంటి నా ఇంటి పత్రాలు దానికి ఎలా ఇస్తారు? అదెంత దాని లెక్కెంత' అంటుంది. దీనికి సత్యం 'అసలు ఈ ఇల్లు విడిపించడానికి కారణం మీనానే' అంటాడు. దీనికి ప్రభావతి 'అదేంటి అన్ని లక్షలు తెచ్చింది నా కోడలు రోహిణి. తనకు సంబంధం లేదా' అంటుంది.

ప్రభావతి మాటలకు బాలు 'పార్లరమ్మకు పత్రాలు ఇవ్వడానికి నాన్నకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఆమె పక్కనే వాడు ఉంటాడు. ఆ లక్ష మాయం చేసినట్లు ఈ పత్రాలు కూడా మాయం చేస్తే ఏంటి? అప్పుడు ఈ మహాతల్లి వచ్చి మహానటిలా యాక్టింగ్ చేస్తుంది' అని పంచులు వేస్తాడు. మొత్తానికి సత్యం ఆ ఇంటి పత్రాలను మీనాకు ఇవ్వబోతాడు. అప్పుడామె 'వద్దు మామయ్య. వాటిని అత్తయ్య గారికే ఇవ్వండి' అంటుంది. కానీ, ప్రభావతి 'నీ భిక్ష నాకు అవసరం లేదు తీసుకో' అంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

ఇంటి పత్రాలను మీనా తన బీరువాలో దాస్తుండగా ప్రభావతి వచ్చి 'ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా? పత్రాలు నీ చేతికి వచ్చేలా చేసుకున్నావు. పత్రాలు మాత్రమే నీ చేతికి వచ్చాయి. ఈ ఇల్లు కాదు. వాటి మీద నా సంతకమే ఉంది. నువ్వు తలకిందుగా తపస్సు చేసినా ఇల్లు కూడా నువ్వు కట్టుకోలేవు కదా' అంటుంది. దీంతో మీనా 'అవును.. నేను అద్దె ఇంట్లోనే పుట్టాను. నాకు సొంత ఇల్లు కల లేదు. మట్టీలో పుట్టినవాళ్లం. మట్టిలోనే కలిసిపోతాం. మనకంటూ ఆరు అడుగులు చాలు. మీరు ఎంత అనుకున్నా నాకు ఈ ఇంటి మీద ఆశ లేదు' అంటూ వాటిని ఇచ్చేయబోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 10th

మీనా వాటిని ఇవ్వబోతుంటే ప్రభావతి 'ఏంటే దానం చేస్తున్నావా? నీ చేతులతో నువ్వు ఇవ్వడం కాదు. నేనే వాటిని రప్పించుకుంటాను. పత్రాలు తీసుకున్నది కాక అందరి ముందు వెటకారంగా నవ్వుతావా? ఆ బాలు గాడు సపోర్ట్ చేస్తున్నాడని విర్రవీగుతున్నావేమో. వాడే అందరి ముందు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు' అని వెళ్లిపోతుంది. తర్వాత రవి, శృతి రెస్టారెంట్‌లో కలుసుకుంటారు. అప్పుడు మా వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేము. మీ అమ్మనాన్న నన్ను మర్డర్ చేయిస్తారేమో అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X