Gunde Ninda Gudi Gantalu September 11th: బయటపడ్డ రవి, శృతి అఫైర్.. నా ఫ్రెండ్ కొడుకుతో పెళ్లి చేస్తానని తండ్రి
గుండె నిండా గుడిగంటలు సీరియల్.. ఎమోషన్స్, గొడవలతో సాగుతుంది. రవి, శృతి వ్యవహారం పాకన పడుతుండగా.. తన కూతురికి పెళ్లి చేసే ఆలోచనలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. ఇక ఇంటి వ్యవహారాలు చూడమని బాలు భార్యకు ప్రభావతి భర్త బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెనిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 11వ తేదీ 247 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
ఐస్ క్రీమ్ పార్లర్‌లో రవి, శృతి తమ ప్రేమ వ్యవహరాన్ని చర్చించుకొన్నారు. నీ మీద ఉన్న లవ్వు మాత్రమే కొవ్వు కాదు అంటూ శృతి అంటే.. నాకు నీ మీద ఉన్న కూడా లవ్వే..కానీ కొవ్వు కాదు అంటూ రవి సమాధానం ఇచ్చాడు. కానీ మీ ఇంటి వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకొంటే నా ప్రాణాలకే ముప్పు. మీ నాన్న నాపై ఎంత వరకైనా వెళ్తాడు అని రవి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ముందు ఐస్ క్రీమ్ తీను.. కరిగిపోతుంది అంటూ.. రవి కప్‌లో ఉన్న ఐస్ క్రీమ్‌ను స్పూన్‌తో శృతి తినిపించే ప్రయత్నం చేసింది. అయితే రవి సిగ్గుపడుతూ అందరూ ఉన్నారంటూ అంటూ కంగారు పడ్డాడు. దాంతో నీవు ఈ దశకంలో పుట్టాల్సిన వాడివి కాదు.. 80వ దశకంలో పుట్టాల్సిన వాడివి అని సైటైర్ వేసింది.

ఇక అదే రెస్టారెంట్‌కు శృతి తల్లిదండ్రులు శోభన, సురేంద్ర వచ్చారు. ఎలాగైనా శృతిని ఒప్పించి నా స్నేహితుడి కుమారుడితో పెళ్లి చేయించాలి. శృతిని అలా వదిలేస్తే నా పరువు పోతుంది. లవ్ అంటూ తన ప్రియుడు రవిని పెళ్లి చేసుకొంటే ఒప్పుకొనేది లేదని అంటూ అక్కడికి వెళ్లగానే ఎదురుగా తన ప్రియుడు రవితో శృతి కనిపించింది. దాంతో ఆమెను చూసి శృతి తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. బాలును చూసి విర్రవీగుతున్నావేమో.. వాడు ఏదో రోజు నిన్ను ముంచెస్తారు.
ఇంటికి పెద్దగా నియమించినా నీవు ఏంటీ దిగులుగా ఉన్నావు అని బాలు అంటే.. రోహిణి, అత్త ఊరుకొంటారా? అని అడిగితే.. నిన్ను నమ్మి ఇంటి వ్యవహారాలు, ఆస్తి పత్రాలు అన్ని అప్పగించాడు. ఆ నమ్మకాన్ని నీవు నిలబెట్టాలి. నీకు ఎవరైనా ఎదురు పడితే అమ్మైనా, రోహిణి అయినా తాట తీస్తాను. నీ విషయంలో ఎవరైనా ఎక్కువ తక్కువైతే వారి అంతు చూస్తా అని బాలు అంటే.. ఇప్పటికే నా వల్ల గొడవలయ్యాయని అందరూ అనుకొంటారు. నీ కోపానికి ఎవరు బలైపోతారనే విషయంపై నేను చస్తున్నాను. ఈ పాపులకు కోపమే నా అస్త్రం. లేకపోతే వారు ఈ ఆస్తిని గుటుక్కు మనే వారు అని బాలు అన్నాడు.

నీ బాధ్యత తెలిసి నాన్న గుర్తించాడు కాబట్టే.. నీకు పత్రాలు అప్పగించారు. లేకపోతే అమ్మను ఫైనాన్సియర్ హౌజ్ అరెస్ట్ చేసిన విషయం బయటపడేదా? నీలో గొప్పతనం నీకు తెలియదు. నీలో గొప్ప ఎవరైనా గుర్తిస్తే నాకు సంతోషం కాదా అని బాలు తన భార్యతో అన్నాడు. దాంతో బుగ్గ మీద గిచ్చిన భార్య ప్రేమను అలకబోసింది.
ఇక రవి, శృతి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి బైక్ మీద వెళ్తూ రోడ్డుపై రొమాన్స్ చేసుకొంటుంటే.. పనిమనిషి చూస్తుంది. బైక్ మీద వెళ్తుంది రవినే కదా.. ప్రభావతి ఏమో అలా కట్టడి చేస్తుంటే.. కొడుకు రవి మాత్రం తనకు నచ్చిన వ్యక్తితో ఇలా తిరుగుతున్నాడు అంటూ పనిమనిషి మనసులో అనేసుకొన్నది. అయితే రవితో శృతి రోడ్డు మీదే రొమాన్స్ చేయాలని చూడటంతో అతడు భయపడ్డాడు. నాకు ఐ లవ్ యూ చెప్పమని ఫోర్స్ చేసింది. దాంతో భయపడుతూనే శృతికి రవి ఐ లవ్ యూ చెప్పాడు. ముఖంలో భయం చూసి.. ఇలాంటి హ్యాపీ మూమెంట్‌లో ముఖంలో భయమేందుకు అని ప్రశ్నించింది. తన డబ్బింగ్ పూర్తయ్యాక కాల్ చేస్తానని వెళ్లింది. బయటకు వెళ్దామని చెప్పింది. దాంతో కుదరదు అంటే.. లేదు.. కుదురుతుంది అని చెప్పి పంపించింది.

రవి బైక్‌పై వెళ్తుంటే.. తన స్నేహితురాలు బైక్ తోసుకొంటూ వెళ్తూ కనిపించింది. అయితే బైక్ పాడైందని అంటే తాను లిఫ్ట్ ఇచ్చేందుు సిద్దమయ్యాడు. అయితే శృతి పెళ్లి వ్యవహారం ఎంత వరకు వచ్చింది. ప్రపోజ్ చేయడానికి నేను హెల్ప్ చేయాలా? అని అంటే అవసరం లేదు అంటూ ఆమెను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తుంటే.. మళ్లీ పని మనిషి చూసి.. ఈమె మీనా చెల్లెలు కదా.. వీడేంటి.. ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటూ ఆశ్చర్యపోయింది.


Click it and Unblock the Notifications











