Gunde Ninda Gudi Gantalu September 12th: నిజం తెలుసుకున్న ప్రభావతి.. వాళ్లకు పెళ్లి సెట్ చేసిన బాలు
తరాలు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
శృతి, రవి రెస్టారెంట్‌లో కూర్చుని మాట్లాడుతుండగా సురేంద్ర వాళ్లు అక్కడికి వస్తారు. ఎలాగైనా శృతిని ఒప్పించి తన ఫ్రెండ్ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండగానే రవి కూడా ఆమెతో కనిపిస్తాడు. అది చూసి వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు, ప్రభావతి అన్న మాటలకు మీనా బాధపడుతూ ఉండగా బాలు వచ్చి ఆమెను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, తన పట్ల రోహిణి, ప్రభావతి సంతోషంగా లేరని ఆమె చెబుతుంది. దీంతో వాళ్ల సంగతి చెప్తానని బాలు అంటాడు. తర్వాత సుమతిని రవి బైక్‌పై తీసుకెళ్లడం చూసిన కామాక్షి.. ప్రభావతికి చెబుతుంది.

గురువారం ఎపిసోడ్‌లో.. బాలుతో మాట్లాడుతోన్న సమయంలో కారును తాను డ్రైవింగ్ చేస్తానని మీనా అంటుంది. దీనికతడు సెటైర్లు వేస్తాడు. అనంతరం సరదాగా బయటకు వెళ్దాం అని బాలు అనడంతో మీనా 'ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఏంటి ఇలా? ఎప్పుడు చూసినా ట్రిప్పులు, ఈఎంఐలు, వడ్డీలు ఇవే మాట్లాడతారు కదా. ఇప్పుడు కొత్తగా బయటకు వెళ్దాం అంటున్నారు' అంటుంది. దీనికతడు 'నేనూ అదే అనుకుని ఇప్పుడు వెళ్దాం అంటున్నా' అంటాడు. అప్పుడామె 'వద్దులేండి. ముందు మీ ఇబ్బందుల గురించి ఆలోచించండి' అని సలహా ఇస్తుంది.
బాలు, మీనా మాట్లాడుకున్న తర్వాత వాళ్ల మధ్య కాసేపు రొమాంటిక్ చూపులు ఉంటాయి. అప్పుడు మీనా 'ఏంటి మీకు నలుగురు పిల్లల్ని ఇవ్వమంటారా' అని అడుగుతుంది. దీంతో అతడు కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ప్రభావతి.. కామాక్షి ఇంటికి వెళ్లగా ఆమె 'ఒకప్పుడు సింహంలా తిరిగేదానివి. ఇప్పుడు మాత్రం పిల్లిలా మారిపోయావు. రోహిణి ఎలాగోలా డబ్బులు తీసుకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా ఇబ్బంది పడేదానివి' అని అంటుంది. అప్పుడు ప్రభావతి 'రోహిణి వాళ్ల నాన్న మంచోడు కాబట్టే ఇచ్చాడు' అని చెబుతుంది.

ప్రభావతి మాటలకు కామాక్షి 'బాలు సంగతి పక్కన పెడితే ఆ మనోజ్ గాడు రోజుకో ఉద్యోగం మారుస్తున్నాడు' అంటుంది. దీనికామె 'రోహిణి వాళ్ల నాన్న వాడిని సెట్ చేస్తాడులే కానీ.. నాకు ఒక టెన్షన్ పోయింది అనుకుంటే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఆ పూలు అమ్ముకునే దానితో రవి తిరుగుతున్నాడు అని చెప్పావు. ఆ బాలు గాడికి తెలిస్తే వాళ్లిద్దరికీ కట్టబెట్టేస్తాడు. మా చిన్ననాటి ఫ్రెండ్ ఉంది. ఆమె వాళ్ల అమ్మాయి కోసం సంబంధాలు చూస్తోంది. దానితో మాట్లాడి రవి గాడికి పెళ్లి చేసేస్తా' అని చెబుతుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంది.
బాలు వచ్చీ రాగానే 'మళ్లీ ఏం పోగొట్టుకున్నావు? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటావా' అని ప్రశ్నిస్తాడు. దీనికి సత్యం 'అవును ప్రభా.. అప్పుడు లక్ష పోయినప్పుడు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు' అని అడుగుతాడు. ఆ వెంటనే బాలు 'కొంపదీసి ఆ లక్ష కూడా వీడికి (మనోజ్) ఇచ్చేసి డ్రామా ఆడుతున్నావా' అని అంటాడు. దీంతో రోహిణికి కోపం వస్తుంది. అప్పుడు బాలు ఫోన్ మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. మొత్తానికి ప్రభావతి 'నాకు ఈ ఇంట్లో మర్యాద పోతుంది' అనడంతో బాలు 'ఓ బొచ్చ తీసుకుని అందరినీ అడుక్కో' అని పంచ్ వేస్తాడు.

జోకులు అయిపోయిన తర్వాత ప్రభావతి 'నేను రవికి పెళ్లి చేయాలని అనుకుంటున్నా' అని చెబుతుంది. దీంతో సత్యం 'ఇది మంచి నిర్ణయమే కానీ సరైంది కాదు. కూతురు ఉండగా కొడుక్కు పెళ్లి చేస్తే వచ్చిన వాళ్లు వాడికి కాకుండా మన నెత్తిన అక్షింతలు వేసి వెళ్లిపోతారు' అని అంటాడు. దీనికి బాలు 'ఈ పెళ్లికి కూడా ఇల్లు తాకట్టు పెడతావా' అని అడుగుతాడు. దీంతో ప్రభావతి 'ముందుగా రవికి పెళ్లి చేస్తాను. ఆ కట్నం డబ్బుతో దీనికి చేద్దాం' అంటుంది. అప్పుడు మౌనిక 'నాకు ఇప్పుడిప్పుడే ఆఫీస్‌లో మంచి పేరు వస్తుంది. నాకు పెళ్లి వద్దు' అని తేల్చేస్తుంది.
మౌనిక పెళ్లి వద్దు అనడంతో మీనా కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ వెంటనే రోహిణి 'మంచి నిర్ణయం మౌనిక. లేకపోతే మీనాలా పనులు చేసుకోవాల్సి వస్తుంది' అంటుంది. దీంతో బాలు 'అవును.. లేదంటే లక్షలు లక్షలు మింగేయాల్సి వస్తుంది' అని రోహిణిపై పంచ్ వేస్తాడు. ఆ సమయంలో సత్యం 'దాని భవిష్యత్ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అయితే రవికి నేను ఒక సంబంధం చూశాను. మన రంగారావు వాళ్ల తమ్ముడి కూతురు' అంటాడు. అప్పుడు ప్రభావతి, బాలు కౌంటర్లు వేసుకుంటుండగా.. సత్యం సంబంధం మాట్లాడదాం అని అంటాడు.
ఇక, మనోజ్ పార్కులో ఉన్న తనలాంటి వాళ్లతో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటారు. అప్పుడు ఒక వ్యక్తి 'జాబ్ లేకున్నా నెల నెల డబ్బులు ఇస్తే నా పెళ్లాం సైలెంట్‌గా ఉంటుంది. నా దగ్గర మా అమ్మ ఇన్యూరెన్స్ డబ్బులు ఉన్నాయి. వాటిని వడ్డీకి తిప్పుతున్నాను. ఎక్కువగా ఆలోచించకు బ్రో. పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి' అని చెప్పడంతో మనోజ్ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత రవికి పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినట్లు మీనా చెబుతుంది. దీంతో అతడు కంగారు పడుతూ తండ్రిని అడుగుతాడు. దీనికి అతడు జరిగింది చెబుతాడు.

సత్యం చెప్పిన మాటలకు రవి 'నాకు చాలా గోల్స్ ఉన్నాయి నాన్న. నేను రెస్టారెంట్ కూడా పెట్టుకోవాలి' అని అంటాడు. దీనికి తండ్రి 'నీ పెళ్లి అయిన తర్వాత కూడా అన్నీ పెట్టుకోవచ్చురా' అని అంటాడు. అప్పుడు ప్రభావతి 'అంతలేదు. ఆ రంగారావు మన ఇంటి సంబంధం సెట్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. అసలు బాలు గాడితోనే ముహూర్తం పెట్టి పంపిస్తాడు' అంటుంది. దీంతో సత్యం సీరియస్ అవుతాడు. కొద్దిసేపటికి బాలు వచ్చి అందరినీ పిలుస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











