Gunde Ninda Gudi Gantalu September 13th: రికార్డింగ్ వినిపించిన బాలు.. దొరికిపోయిన మనోజ్ ఏం చేశాడంటే!
ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కామాక్షి ఇంటికి వెళ్లిన ప్రభావతికి రవి, సుమతి బైక్ మీద వెళ్తున్నారని తెలుస్తుంది. దీంతో ఆమె వెంటనే రవికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన ప్రభావతి అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్తుంది. దీంతో సత్యం తన ఫ్రెండ్ కూతురితో రవికి పెళ్లి చేయాలని ఎప్పుడో డిసైడ్ అయినట్లు చెబుతాడు. ఆ తర్వాత బాలును అక్కడకు పంపించి సంబంధం మాట్లాడమని చెప్పడంతో అతడు వెళ్తాడు. ఇంటికి వచ్చిన రవితో మీనా పెళ్లి గురించి చెప్తుంది. దీంతో అతడు షాక్ అయి తండ్రిని అడుగుతాడు. దీనికాయన రవికి సర్ధి చెప్పాలని చూస్తాడు.

శుక్రవారం ఎపిసోడ్‌లో... రవికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్లిన బాలు.. కాసేపటికి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు. సంబంధం ఏమైందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అప్పుడు బాలు 'రంగారావు గారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నా తమ్ముడికి కూతురిని మీ ఇంటికి కోడలిగా పంపించి దాని గొంతు కోయలేను అన్నాడు. ప్రభావతి గారిని రాకసి, గయ్యాళిగంప అని రంగారావు అన్నాడు' అని చెబుతాడు. కానీ, బాలు చెప్పిన మాటలను ప్రభావతి మాత్రం నమ్మదు. దీంతో రంగారావుతో మాట్లాడేప్పుడు చేసిన రికార్డింగ్‌ను వినిపించడంతో ఆమె రగిలిపోతూ ఉంటుంది.
ఆ రికార్డింగ్ విన్న వెంటనే ప్రభావతి కోడలిని నేను కష్టపెడుతున్నానా అని అడుగుతుంది. అప్పుడు రోహిణి 'నన్నైతే అత్తయ్య బాగానే చూసుకుంటుంది' అంటుంది. దీంతో బాలు 'నన్నైతే అంటే మిగిలిన వాళ్లను బాగా చూడటం లేదనే అర్థం కదా. నీకు ఇప్పట్లో పెళ్లయ్యే యోగం లేదురా' అంటాడు. అప్పుడు మౌనిక ఇప్పట్లో అంటే అని అడగడంతో ప్రభావతి 'నేను బతికి ఉన్నంత వరకు' అని అరుస్తుంది. ఆ తర్వాత సత్యం 'ఒకప్పుడు ఆ అమ్మాయిని నీకు ఇద్దామని రంగారావు మావయ్య అనుకున్నాడు' అని బాలుతో చెబుతాడు.

తండ్రి మాటలకు బాలు 'ఆ అమ్మాయి బాగుంటుందా? నన్ను చూసిందా? ఇష్టపడిందా? మనోజ్ లక్షలు మింగి పారిపోకుండా ఉంటే ఆ అమ్మాయితో నాకు పెళ్లి జరిగేది కదా' అని ఎగ్జైట్‌మెంట్ చూపించడంతో మీనాకు కోపం వచ్చి వెళ్లిపోతుంది. అనంతరం ప్రభావతి 'రవికి నేనే మంచి సంబంధం కుదుర్చుతాను' అనడంతో 'నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు' అంటూనే బాలుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత అందరూ వెళ్లిపోతారు. ఆ సమయంలో మీనా అలిగి ఉండడంతో బాలు ఆమెను కాకపట్టే పనిని ప్రారంభిస్తాడు.
బాలు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా మీనా 'మీ నిజస్వరూపం బయటపడింది. రంగారావు తమ్ముడి కూతురిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని మావయ్య అనగానే ఆ అమ్మాయి ఎర్రగా ఉంటుందా? బుర్రగా ఉంటుందా పొగిడారు కదా. ఆమెనే పెళ్లి చేసుకొండి' అని ఫైర్ అవుతుంది. దీంతో బాలు 'పెళ్లికి ముందు ఆ అమ్మాయి నాకు సైట్ కొట్టేది' అని అంటాడు. దీనికామె 'మిమ్మల్ని పూర్తిగా చూసి ఉంటే జీవితంలో సైట్ కొట్టేది కాదు' అంటుంది. దీంతో బాలు 'నేను ఆరడుగుల అందగాడిని' అనడంతో మీనా సెటైర్ వేస్తుంది. ఇలా ఇద్దరూ గొడవ పడతారు.

భర్త మీద అలిగిన మీనా వంట కూడా చేయకుండా ఉంటుంది. అప్పుడు బాలు ఆమెను బుజ్జగిస్తూ.. 'నిన్ను ఏడిపించడానికే రంగారావు మావయ్య తమ్ముడి కూతురి గురించి నాన్నను అడిగాను. ఈ ముళ్లకంప జీవితానికి పూలగంప చాలు' అని హగ్ చేసుకుంటాడు. తర్వాత మీనా పనులు చేస్తూ కష్టపడుతుండగా ప్రభావతి, రోహిణి కూర్చుని ఉంటారు. అది చూసిన బాలు వాళ్లపై ఫైర్ అవుతాడు. 'అత్తాకోడళ్లు ఇద్దరు ఇంటి ఖర్చులు ఎలా పెంచాలి, ఎవరికి తెలియకుండా ఏ వస్తువు తాకట్టు పెట్టాలో మాట్లాడుకుంటూ ఉంటారా' అంటూ సెటైర్లు వేస్తాడు.
తర్వాత మనోజ్ ఆఫీస్ నుంచి ముందుగానే రావడంతో బాలు అతడిపై డౌట్ పడుతాడు. దీంతో రోహిణి 'నువ్వు ఈ ఉద్యోగంలో మంచి పేరుతో పాటు ప్రమోషన్ తెచ్చుకుంటే ఇలాంటి వాళ్లు నిన్ను మాటల్ని అనాల్సిన అవసరం రాదు. మీ బాస్ నా కస్టమర్ కదా. ఆమెతో నీ ప్రమోషన్ గురించి నేను మాట్లాడుతా' అని అంటుంది. దీంతో మనోజ్ కంగారు పడుతూ 'నా ప్రమోషన్ గురించి ఎవరితో మాట్లాడాల్సిన పనిలేదు' అంటాడు. అప్పుడు బాలు 'ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు మనోజ్ డబ్బులు ఇస్తాడని ఎవరో మంగమ్మ శపథం చేశారు' అని గుర్తు చేస్తాడు.

బాలు మాటలతో రోహిణి 'మనోజ్ చేసే పని ఎంత కష్టమో నీకు తెలుసా' అంటుంది. అప్పుడు మనోజ్ 'కష్టం చేస్తేనే కదా తెలిసేది నాకు' అని నోరు జారుతాడు. దీంతో అందరూ షాకవుతారు. అది గమనించి వెంటనే కష్టాన్ని కూడా ఇష్టపడి చేస్తున్నా అని కవర్ చేస్తాడు. తర్వాత రోహిణి 'ఆఫ్ట్రాల్ కారు నడిపేవాళ్లకు, షోరూమ్‌లో పని చేసే వాళ్లకు కష్టం విలువ ఏం తెలుస్తుంది' అని అవమానిస్తుంది. దీనికి బాలు 'నువ్వు తాగే కాఫీ, నీ భర్త తీసుకెళుతున్న క్యారేజీలోని అన్నం నేను చేస్తున్న ఆఫ్ట్రాల్ సంపాదనతోనే వస్తున్నాయి' అని బదులిస్తాడు.
రోహిణి మాటలకు మీనా 'మనం చేసే వృత్తి ఏదైనా దేవుడితో సమానం. ఇంకోసారి ఆఫ్ట్రాల్ అంటే ఊరుకోను. ఇళ్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టిన నీకు కష్టం విలువ ఏం తెలుస్తుంది' అంటుంది. దీంతో ప్రభావతి ఫైర్ అవుతుంది. మరోవైపు, ప్రభావతి.. రవి, మౌనికలకు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుంది. తన చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి కూతురికి రవిని ఇచ్చి పెళ్లిచేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇప్పుడు తమకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రవి, మౌనిక ఎంత చెప్పిన ప్రభావతి వినదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











