Gunde Ninda Gudi Gantalu September 14th: పెళ్లి చేసుకోం.. తెగేసి చెప్పిన రవి, మౌనిక
ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రవికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్లిన బాలు.. కాసేపటికి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు. సంబంధం ఏమైందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అప్పుడు బాలు 'రంగారావు గారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నా తమ్ముడికి కూతురిని మీ ఇంటికి కోడలిగా పంపించి దాని గొంతు కోయలేను అన్నాడు. ప్రభావతి గారిని రాకసి, గయ్యాళిగంప అని రంగారావు అన్నాడు' అని చెబుతాడు. కానీ, బాలు చెప్పిన మాటలను ప్రభావతి మాత్రం నమ్మదు. దీంతో రంగారావుతో మాట్లాడేప్పుడు చేసిన రికార్డింగ్‌ను వినిపించడంతో ఆమె రగిలిపోతూ ఉంటుంది.

రోహిణి మాటలకు మీనా 'మనం చేసే వృత్తి ఏదైనా దేవుడితో సమానం. ఇంకోసారి ఆఫ్ట్రాల్ అంటే ఊరుకోను. ఇళ్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టిన నీకు కష్టం విలువ ఏం తెలుస్తుంది' అంటుంది. దీంతో ప్రభావతి ఫైర్ అవుతుంది. మరోవైపు, ప్రభావతి.. రవి, మౌనికలకు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుంది. తన చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి కూతురికి రవిని ఇచ్చి పెళ్లిచేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇప్పుడు తమకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రవి, మౌనిక ఎంత చెప్పిన ప్రభావతి వినదు. ఇక శనివారం సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?


Click it and Unblock the Notifications











